E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu : ఇదేం రచ్చ రా నాయనా.. రోహిణి, పృథ్వి పచ్చి బూతులు..

Bigg Boss 8 Telugu : ఇదేం రచ్చ రా నాయనా.. రోహిణి, పృథ్వి పచ్చి బూతులు..
Advertisement

Bigg Boss 8 Telugu : బుల్లితెర టాప్ మోస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. అందులో తెలుగు సీజన్ 8 ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది. సండే ఫన్ డే.. సరదాగా ఎపిసోడ్ సాగింది. నాగార్జున వేసిన జోకులకు హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఏడో వారం తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. గౌతమ్ సేవ్ అయ్యాడు. ఇక మణికంఠ బయటకు వెళ్తూ హౌస్ మేట్స్ కు బాంబ్ పెల్చాడు.. నయని, హరి తేజను సేవ్ చేసాడు. నిఖిల్, పృథ్వి, తేజ లు ఇంకా బాగా ఆడాలి అని చెప్పాడు. ఇక సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఏడు వారాల వరకు నామినేషన్స్ బాగానే సాగాయి. కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం హోస్ మేట్స్ బూతులకు పని చెప్పారు. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన రచ్చ గురించి ఒకసారి చూసేద్దాం పదండీ..

సోమవారం, మంగళవారం ఎపిసోడ్ లలో నామీనేషన్స్ రచ్చ రచ్చగా సాగుతాయి.. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్స్ లో బొమ్మలను పగలగొట్టి నామినేట్ చెయ్యాలని.. ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పాలని బిగ్ బాస్ చెబుతాడు. ముందుగా విష్ణు, నిఖిల్ ను నామినేట్ చేస్తుంది. గత ఆరువారాల నుంచి జరుగుతున్న ఫుడ్ గురించి ఇద్దరు గొడవ పడతారు. మణికంఠ విషయంలో చేసిన తప్పులను చెబుతుంది. ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. నిఖిల్ మాటకు మాట అనడంతో గొడవ పెద్దది అవుతుంది. ఆ తర్వాత ప్రేరణను నామినేట్ చేస్తుంది. అక్కడ కూడా ఫుడ్ విషయం పై నామినేట్ చేస్తుంది. ప్రేరణ కూడా విష్ణు పై కోపంతో మాటలను అంటుంది. ఇక్కడ ఎవరికీ అమ్మా నాన్న లేరు అందరు గేమ్ ఆడటానికే వచ్చారు. ఇది గుర్తు పెట్టుకుంటే బెస్ట్ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.

Advertisement

ఇక ఆ తర్వాత రోహిణి పృథ్విని నామినేట్ చేస్తుంది. నామినేషన్స్ టైమ్ లో లేదా విష్ణు తో తప్ప పెద్దగా కనిపించలేదు. వీరిద్దరూ చేసిన రచ్చా అంతా ఇంతా కాదు. హౌస్ తన ఆట తీరు సరిగ్గా లేదని, విష్ణు తో తిరుగుతూ ఆటపై పూర్తి ఫోకస్ చెయ్యలేదని చెబుతుంది. ఇక పృథ్వి కూడా రోహిణికి మాటకు మాట సమాధానం చెబుతాడు. ఆ తర్వాత పృథ్వి రోహిణిని నామినేట్ చేస్తాడు. ఆట సరిగ్గా లేదనో లేదనో పొంతన లేని సమాధానం చెప్తాడు. దానికి రోహిణి కోపంతో రగిలిపోతుంది. నేను ఆట ఆడలేదు నువ్వు ఆడుతున్నావు. ఎనిమిది వారాల్లో ఒక్కసారైనా చీఫ్ అయ్యావా నన్ను అనడానికి నీకు రైట్స్ లేవు.. అనగానే నాకు జోకులు వెయ్యడం రాదనీ పృథ్వి అంటాడు. ఇక రోహిణి ఆ చూపేంటీ అంటూ ఇద్దరు కొట్టుకొనే వరకు వెళ్తారు. వీరిద్దరి గొడవతో హౌస్ మొత్తం రచ్చ రచ్చగా మారుతుంది. అదే విధంగా నభీల్ ప్రేరణ లు కూడా గొడవ పడతారు. మొత్తానికి సోమవారం కొట్టుకొనేవరకు వెళ్లారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారో చూడాలి.. ఇక మణికంఠ ఏడో వారం హౌస్ నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన ఏడు వారాలకు హౌస్ లో ఉన్నందుకు రూ. 8.40 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఈ వారం అందరు పృథ్వి నే టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వారం బిగ్ బాస్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Tags

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×