E-Paper
Advertisement

OTT Movie : జర్నలిస్ట్ కే చుక్కలు చూపించే దెయ్యాలు.. ఆమె వల్ల అపార్ట్మెంట్ అంతా దెయ్యాల గోలే

OTT Movie : జర్నలిస్ట్ కే చుక్కలు చూపించే దెయ్యాలు.. ఆమె వల్ల అపార్ట్మెంట్ అంతా దెయ్యాల గోలే
Advertisement

OTT Movie : ఓటీటీ లో రిలీజ్ అవుతున్న హర్రర్ మూవీస్ ను చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ దయ్యం కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలను మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.  అందులోను దయ్యం, థ్రిల్లర్ లాంటి చిత్రాలను ప్రత్యేకంగా చూస్తారు. థియేటర్లలో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకొని ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక దయ్యం స్టోరీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీ ఏమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

Advertisement

ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి ఇదివరకే థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ పేరు మరేమిటో కాదు ది ఇనరసబుల్. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చాలా భయానకంగా వుంటాయి. ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో పాటు సస్పెన్స్, హర్రర్ సన్నివేశాలు ప్రేక్షకుల చూపు మరల్చకుండా చేస్తాయి. ఈ మూవీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అయిన “నెట్ ఫ్లిక్స్”(Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ చిత్రంలో హీరోయిన్ ఒక రైటర్ గా వుంటూ, క్రైమ్ థ్రిల్లర్ కథలను రాస్తుంది. ఆ కథలను ఆమె ఒక పత్రికకు పంపుతూ ఉంటుంది. ఆ కథలను ఆ పత్రిక పబ్లిష్ చేస్తుంది. అలాగే హీరోయిన్ కి కూడా కొన్ని కథలు ఆమె అభిమానులు పంపుతూ ఉంటారు. అలా పంపిన కథలలో ఒక అపార్ట్మెంట్ నుంచి కుబు అనే అమ్మాయి ఒక కథ పంపుతుంది. కుబు పంపిన కథను హీరోయిన్ చదువుతుంది. అందులో ఒక ఇంజనీరింగ్ చదివిన ఒక అమ్మాయి దయ్యాలు ఉన్న అపార్ట్మెంట్లో ఉంటుంది. తనకు ఆ అపార్ట్మెంట్ లోని తన ఫ్లాట్ లో వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి.ఆ శబ్దాలను ఆమెకు రాత్రిపూట మాత్రమే వినబడతాయి. ఈ విషయాన్ని తన భర్తకు కూడా చెప్తుంది. రాత్రిపూట కొన్ని ఫోటోలు తీసి ఆ ఫోటోలలో కొన్ని ఆకారాలను కనిపెడుతుంది.

ఇదిలా ఉంటే అదే అపార్ట్మెంట్లో 405 నుంచి కూడా హీరోయిన్ కి లెటర్ లు వస్తాయి. ఆ ఫ్యామిలీలో భార్యాభర్తల తో పాటు ఒక అబ్బాయి కూడా ఉంటాడు. ఆ అబ్బాయి ఒక బొమ్మను తీసుకుని అపార్ట్మెంట్ పైకి చూస్తూనే ఉంటాడు. ఆ బొమ్మ గొంతుకు ఒక తాడు వేసి లాగుతూ ఉంటాడు. ఆ పిల్లవాడికి ఆ దయ్యాలు కనబడుతూ వుంటాయి. అతని ప్రవర్తనకి తల్లి దండ్రులు భయపడుతూ వుంటారు. ఇది చదువుతూ ఉన్న హీరోయిన్ కి హఠాత్తుగా ఒక సంఘటన ఎదురవుతుంది. ఆమెకు ఎదురైన ఆ సంఘటన ఏమిటి? అపార్ట్మెంట్ కి హీరోయిన్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ అపార్ట్మెంట్లో దయ్యాలు ఎందుకు ఉన్నాయి? అనే విషయాలు తెలియాలంటే ఉత్కంఠ భరితంగా సాగే “ది ఇనరజబుల్” (THE INERASABLE) మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నవాళ్లే చూడాలి. ఎందుకంటే ప్రతి సన్నివేశం చాలా థ్రిల్లింగ్ గా భయపెట్టే విధంగా వుంటుంది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×