E-Paper
Advertisement

Sanjana Galrani Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద పోరాటమే చేశాను.. ఎమోషనల్ అయిన సంజనా

Sanjana Galrani Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద పోరాటమే చేశాను.. ఎమోషనల్ అయిన సంజనా
Advertisement

Sanjana Galrani Bigg Boss: బిగ్ బాస్ సీజన్-9లో అద్భుతమైన ప్రదర్శనతో టాప్-5 ఫైనలిస్ట్‌గా నిలిచిన ప్రముఖ నటి సంజనా గర్లాని.. తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె..  తన జీవితంలో ఎదురైన చీకటి రోజులను తలచుకుంటూనే..  తన గెలుపు ప్రయాణాన్ని వివరించారు.

‘ఐదేళ్ల క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఒక సంఘటన నా జీవితాన్ని, కెరీర్‌ను అస్తవ్యస్తం చేసింది. కానీ నేను స్వతహాగా ఫైటర్‌ని. ప్రతికూల పరిస్థితులతో పెద్ద పోరాటమే చేశాను. నేడు విజేతగా నిలిచి మీ ముందు ఉన్నాను’ అని సంజన పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు,  అభిమానులకు ఆమె పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

బిగ్ బాస్ షో తన జీవితంలో ఒక మలుపు అని సంజన అభివర్ణించారు. సమాజంలో మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేసిన బిగ్ బాస్ వేదికకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. హోస్ట్ అక్కినేని నాగార్జున గురించి మాట్లాడుతూ..  ఆయన హుందాతనం,  ప్రోత్సాహానికి తాను మరింత పెద్ద ఫ్యాన్‌గా మారిపోయానని వెల్లడించారు.

తన కెరీర్‌లో ఇది ‘ఫ్రెష్ ఇన్నింగ్స్’ అని సంజన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’ చిత్రంలో త్రిష చెల్లెలిగా నటించి గుర్తింపు పొందిన ఆమె..  ఆ చిత్రంలోని పాపులర్ డైలాగ్‌ను చెప్పి మీడియాను అలరించారు. ఇకపై తెలుగు చిత్ర పరిశ్రమపై పూర్తి దృష్టి సారిస్తానని.. ఇప్పటికే పలు అవకాశాలు తలుపు తడుతున్నాయని స్పష్టం చేశారు.

Advertisement

చివరగా..  తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా భవిష్యత్తులో ముందుకు సాగుతానని సంజన ప్రతిజ్ఞ చేశారు. ఈ మీడియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ‘విజనరీ వౌస్’ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ALSO READ: Immanuel Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో నటించడం అంత ఈజీ కాదు.. ఇమ్మాన్యుల్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×