Keerthi bhat:బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూ.. మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటున్న రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈ షో వల్ల కొంతమందికి గుర్తింపు లభిస్తే..మరికొంతమందికి ఎటువంటి ఉపయోగం లేదు అని చాలామంది చెప్పుకొచ్చారు.. ముఖ్యంగా డబ్బు , పరపతి పెరుగుతుందని చాలామంది ఊహించి ఈ హౌస్ లోకి అడుగు పెడతారు. కానీ ఇక్కడ అనూహ్యంగా బ్యాడ్ ఇమేజ్ ని సొంతం చేసుకొని బయటకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత తమకు ఒరిగిందేమీ లేదని.. పైగా ఈ బిగ్ బాస్ వల్ల మనుషుల వ్యక్తిత్వాలు బయటపడ్డాయని, అంతేకాదు దీనివల్ల ఎంతోమంది తనకు దూరం అయ్యారు అంటూ చెప్పుకొచ్చింది బుల్లితెర నటి.
బిగ్ బాస్ పై ఊహించని కామెంట్స్..
ఆమె ఎవరో కాదు కీర్తి భట్ (Keerthi Bhat).. కన్నడ నటి అయిన ఈమె అటు కన్నడ.. ఇటు తెలుగు టీవీ సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 2017లో వచ్చిన ‘ఐస్ మహల్’ సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. తెలుగులో స్టార్ మా లో ప్రసారమైన ‘మనసిచ్చి చూడు’ అనే సీరియల్ తో భాను పాత్ర చేసి తెలుగు బుల్లితెర ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘కార్తీకదీపం’ సీరియల్ లో నటించిన ఈమెకు 2022లో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ లో అవకాశం లభించింది .అక్కడ రెండవ రన్నరప్ గా నిలిచింది. ఇకపోతే ఈ షో వల్ల తనకు ఎంత మేరా మంచి జరిగింది అనే విషయంపై తాజాగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ.
బిగ్ బాస్ వల్ల అయిన వాళ్లు కూడా దూరమయ్యారు..
కీర్తి భట్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో నేను మూడవ స్థానాన్ని సంపాదించుకున్నాను. అయితే ఈ షో వల్ల నాకు అభిమానులు పెరిగారు కానీ దీనివల్ల నాకు ఎటువంటి లాభం చేకూరలేదు. ముఖ్యంగా ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ వల్ల నాకు మాత్రం అవకాశాలు లభించలేదు. కేవలం కొంతమందికి మాత్రమే ఆఫర్లు వచ్చాయి. నా వరకు అయితే ఈ షో తో నా కెరియర్ లో ఎలాంటి మార్పులు రాలేదు. పైగా ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ప్రవర్తనను కూడా నేను మార్చుకున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్ళకముందు చాలామంది స్నేహితులు నాకు సపోర్ట్ చేశారు. అయితే హౌస్ లోకి వెళ్ళాక ఎవరు సపోర్టు చేయలేదు. మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడుతారు. నేను గుడ్డిగా వ్యక్తులను నమ్ముతాను. ఆ నమ్మకమే ఇప్పుడు కోల్పోయేలా చేసింది. అందుకే నమ్మకం అనే పదం పైనే నాకు నమ్మకం లేదు” అంటూ కీర్తి భట్ చెప్పుకొచ్చింది.
బుల్లితెర షోలకు అందుకే నన్ను పిలవరు..
సాధారణంగా బిగ్ బాస్ లో చేసిన వాళ్లకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక షోలో అవకాశం కల్పిస్తారు. కానీ తనకు అవకాశం కల్పించకపోవడం పై మాట్లాడుతూ.. అమ్మాయిలు గ్లామర్ గా ఉంటేనే ఇలా బుల్లితెర షోలకు పిలుస్తారు. వాళ్ళు చెప్పినట్టు మోకాళ్లపైకి డ్రెస్సులు ధరించాలి. నేను అలా చేయలేదు. అయితే ఈ విషయం చెబితే నా ఫ్రెండ్స్ అపార్థం చేసుకొని నాకు దూరం అయ్యారు. ఇక నేను అలా దుస్తులు వేసుకొని చలాకీగా మాట్లాడలేను. అందుకే నాకు అవకాశాలు ఇవ్వరు” అంటూ క్లారిటీ ఇచ్చింది.
ALSO READ:Nargis Fakhri: రహస్యంగా పెళ్లి చేసుకున్న నర్గీస్ ఫక్రీ.. 6నెలల తర్వాత బయటపడ్డ నిజం!