Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri).. బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అవుతున్నా.. ఇప్పటివరకు తెలుగులో నేరుగా ప్రేక్షకులను పలకరించలేదు. కానీ తొలిసారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ అందుకుంది అని చెప్పవచ్చు. ఇకపోతే మోడల్ గా కెరియర్ ను ఆరంభించిన ఈమె.. 2011లో వచ్చిన ‘రాక్ స్టార్’ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది.మొదటి సినిమాతోనే రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో హాటెస్ట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకొని ఐఫా అవార్డును కూడా దక్కించుకుంది.
రహస్యంగా పెళ్లి చేసుకున్న నర్గీస్ ఫక్రీ..
ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా మరొకవైపు స్పెషల్ సాంగ్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నర్గీస్ ఫక్రీ సడన్గా వివాహం చేసుకొని కనిపించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 45 సంవత్సరాల వయసులో అందులోనూ రహస్యంగా పెళ్లి చేసుకొని ఆరు నెలల తర్వాత తన భర్తతో బయట కనిపించడం చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ జంటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫరా ఖాన్ మాటలతో అందరూ ఆశ్చర్యం..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఈమె తన భర్తతో కలిసి నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో పాల్గొనింది. ఈ వేడుకలకు బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్(Farah Khan) కూడా హాజరయ్యారు. ఫరా ఖాన్ మాట్లాడుతూ.. నీ భార్య పక్కకు వచ్చి నిల్చో అంటూ టోనీని పిలిచింది. దీంతో నర్గీస్ ఫక్రీ, టోనీ కి పెళ్లి జరిగిపోయిందని అందరూ నిర్ధారణకు వచ్చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆరు నెలల క్రితమే వివాహం..
ఇక పెళ్లెప్పుడు జరిగిందనే విషయానికి వస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారట. వ్యాపారవేత్త టోనీ బేగ్ (Tony baig) తో అమెరికాలోని కాలిఫోర్నియాలో అతడితో ఏడడుగులు వేసినట్లు సమాచారం. ఆ తర్వాత స్విట్జర్ల్యాండ్ కి హనీమూన్ కి కూడా వెళ్లారట. ఇక వీరి పెళ్లి జరిగి ఇప్పుడు ఆరు నెలలు అవుతోందని.. అయితే ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఈమె రహస్యంగా ఉంచడం ఇది అతి పెద్ద హాట్ టాపిక్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నర్గీస్ ఎందుకు తన పెళ్లి విషయాన్ని బయట పెట్టలేదు అని పలువురు పలు రకాలుగా చర్చించుకుంటూ ఉండటం గమనార్హం.
నర్గీస్ ఫక్రీ సినిమాలు..
రాక్ స్టార్ సినిమాతో కెరీర్ ఆరంభించిన ఈమె.. ఆ తర్వాత మద్రాస్ సినిమాలో నటించి.. ‘ఫటా పోస్టర్ నిఖలా హీరో’ అనే సినిమాలో తొలిసారి స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నర్గీస్ హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్ లతో మెప్పిస్తూ అటు మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. సింగర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఫిలింఫేర్ గ్లామర్ , స్టైల్ అవార్డులు కూడా ఈమెకు లభించాయి.
ALSO READ: Nara Rohit: పెళ్లి పీటలెక్కుతున్న నారా రోహిత్.. డేట్ ఫిక్స్!
?utm_source=ig_web_copy_link