OTT Movies : కొత్త వారం వచ్చేసింది. ఆదివారం సినిమాలు చాలానే వచ్చేసాయి. ఇక సోమవారం అటు టీవీలలో మాత్రమే కాదు. ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. గత నెలలో రిలీజ్ అయిన సినిమాలతో పాటుగా డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. థియేటర్లలో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన మదరాసి చిత్రంతో పాటుగా మరి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. అనుష్క నటించిన ఘాటీ చిత్రం కూడా ఈ వారంలోనే రిలీజ్ కాబోతుంది. వీటితో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలపై కాస్త ఇండస్ట్రీలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఎప్పుడెప్పుడు వీటిని థియేటర్లలో చూస్తామని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటాయో చూడాలి.
ఇక ఈవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. చెప్పుకోదగ్గ సినిమాలైతే పెద్దగా లేవు.. కానీ ఒకటి రెండు సినిమాలు మాత్రం ఆసక్తిగా ఉన్నాయి. ఈవారం దాదాపు పది సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా తక్కువ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇన్‌స్పెక్టర్ జెండే, ద ఫాల్ గాయ్ చిత్రాలు ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి.. ఇక అన్ని డబ్బింగ్ సినిమాలే.. ప్రస్తుతానికైతే స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకున్న సినిమాల గురించి మాత్రమే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం… ఈ వారంలో మరికొన్ని సినిమాలు సడన్ సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఏ సినిమాలు సడన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తాయో చూడాలి..
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..
ప్రతి వారం లాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.. అవి ఏంటో చూస్తే..
సన్ నెక్స్ట్
సరెండర్ (తమిళ మూవీ) – సెప్టెంబరు 04
ఫుటేజ్ (మలయాళ సినిమా) – సెప్టెంబరు 05
నెట్‌ఫ్లిక్స్..
ద ఫాల్ గాయ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 03
ఇన్‌స్పెక్టప్ జెండే (హిందీ మూవీ) – సెప్టెంబరు 05
హాట్‌స్టార్..
లిలో అండ్ స్టిచ్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 03
ఆపిల్ ప్లస్ టీవీ..
హైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 05
ఎమ్ఎక్స్ ప్లేయర్..
రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 06
జీ5..
కమ్మట్టం (మలయాళ సిరీస్) – సెప్టెంబరు 05..
అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) – సెప్టెంబరు 05
Also Read : బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న జాన్వీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ఎప్పటిలాగే ఈవారం కూడా కొన్ని ఆసక్తికర సినిమాలో స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. ఓటీటీ లవర్స్ కు ఇది పెద్ద పండగే.. గతవారం వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయిన చిత్రాలు కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని చిత్రాలు ఈ వారం చివరలో సడన్ సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉంది.. మరి ఏ సినిమాలు ఎంట్రీ ఇస్తాయో చూడాలి.. సెప్టెంబర్ నెల అంటే సినిమాల సందడి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. దసరా కానుకగా బోలెడు సినిమాలు ఈ నెలలో థియేటర్లలోకి రాబోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. దాంతో ఈ నెల సినిమాలను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మరి ఏ సినిమా విన్నర్గా నిలుస్తుందో చూడాలి…