BigTV English

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ మణికంఠ ఎమోషన్స్‌ను హేళన చేసిన ‘బ్రహ్మముడి’ నటి.. సారీ చెప్పక తప్పలేదుగా!

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ మణికంఠ ఎమోషన్స్‌ను హేళన చేసిన ‘బ్రహ్మముడి’ నటి.. సారీ చెప్పక తప్పలేదుగా!

Bigg Boss 8 Telugu: సీరియల్ నటులుతో పాటు పలువురు వెండితెర ఆర్టిస్టులు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా బిగ్ బాస్ సీజన్‌ 8లో కంటెస్టెంట్స్‌గా వచ్చారు. అందులో చాలామంది ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరు నాగ మణికంఠ. తను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కేటగిరిలో బిగ్ బాస్ 8లో అడుగుపెట్టాడు. కానీ హౌజ్‌లోకి వచ్చిన మూడు రోజుల్లోనే తన పర్సనల్ లైఫ్ కష్టాలు చెప్పుకొని అందరినీ ఎమోషనల్ చేసేశాడు. అసలు తనకు బిగ్ బాస్ హౌజ్‌లో ఎలా ఉండాలో తెలియడం లేదంటూ విగ్ తీసేశాడు. నాగ మణికంఠ ఎమోషనల్‌గా చేసిన ఈ విషయాన్ని ఒక బుల్లితెర నటి ట్రోల్ చేసి ఇప్పుడు సారీ చెప్పడానికి ముందుకొచ్చింది.


ప్రేక్షకుల ఆగ్రహం

‘బ్రహ్మముడి’ సీరియల్‌లో కావ్యగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది దీపికా రంగరాజు. తన ఆన్ స్క్రీన్ యాక్టింగ్ గురించి పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ అల్లరి, తను ఎంటర్‌టైన్ చేసే పద్ధతి చాలామంది ప్రేక్షకులకు నచ్చింది. దీపికా వచ్చిందంటే చాలు.. ఎంటర్‌టైన్మెంట్ పక్కా అనే గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ 8 ప్రారంభమయిన తర్వాత దీపికా ఒక బుల్లితెర షోలో పాల్గొంది. బిగ్ బాస్ హౌజ్‌లో నాగ మణికంఠ ఎమోషనల్ అవుతూ విగ్ తీసిని సందర్భాన్ని ఇమిటేట్ చేసి చూపించింది. ఇది చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. మణికంఠ ఎమోషన్‌ను హేళన చేసినట్టుగా ఉందని తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్లు. దీంతో ఈ విషయం గురించి వివరణ ఇవ్వడానికి దీపికా ముందుకొచ్చింది.


Also Read: బొక్కబోర్లా పడ్డ సోనియా.. నిఖిల్ హర్ట్, తొక్కలో సెంటిమెంట్స్ అంటూ యష్మీ ఫైర్

నేనూ ఉపయోగిస్తాను

‘‘నేను రీసెంట్‌గా ఒక షోకు వెళ్లినప్పుడు విగ్ తీసి చూపించినందుకు చాలామంది నాకు మెసేజ్‌లు చేశారు, కామెంట్స్ చేశారు. నేను ఆ షోకు వెళ్లినప్పుడు నాకు బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం, అందులోకి వెళ్లాలనుంది అని చెప్పాను. నేను బిగ్ బాస్ హౌజ్‌లో ఉండుంటే, ఎవరి స్థానంలో ఉండి మంచి కంటెంట్ ఇచ్చేదాన్ని అని అడిగారు. నాకు అప్పుడే బిగ్ బాస్‌లో మణికంఠ విగ్ తీసిన వీడియో గుర్తొచ్చింది. నేను కూడా బిగ్ బాస్ హౌజ్‌లో ఉండుంటే అదే పని చేసేదాన్ని అని సడెన్‌గా నాకు అనిపించింది. ఎందుకంటే నేను కూడా విగ్స్ ఉపయోగిస్తాను. సీరియల్‌లో, బయట షూటింగ్స్‌లో మంచి లుక్ రావడం కోసం నాకు ఉన్న జుట్టు సరిపోవడం లేదు. అందుకే నేను విగ్స్ ఉపయోగిస్తాను’’ అని చెప్పుకొచ్చింది దీపికా.

అనారోగ్య సమస్యలు

‘‘మణికంఠ విగ్ తీయడం చూసిన వెంటనే నేను కూడా ఇలాగే చేసేదాన్ని అనిపించి వాళ్లు ఆ ప్రశ్న అడిగిన వెంటనే ఇది చేసి చూపించాలి అనిపించిందే తప్పా మణికంఠను ట్రోల్ చేయడం, తన ఎమోషన్‌తో ఆటలు ఆడుకోవడం లాంటివి చేయలేదు. పీసీఓడీ, కరోనా, టైఫాయిడ్ వల్ల నాకు గత అయిదేళ్లుగా జుట్టు రాలిపోతోంది. అందుకే విగ్స్ ఉపయోగిస్తాను. నా యూట్యూబ్ ఛానెల్‌లో విగ్ పెట్టడం, తీయడం గురించే ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను. నేను మణికంఠను నేరుగా కలిసినా కూడా నేను కూడా విగ్ ఉపయోగిస్తాను అని ప్రోత్సహిస్తాను. నావల్ల ఎవరైనా ఫీల్ అయ్యింటే హర్ట్ అయ్యింటే సారీ’’ అని వివరించింది దీపికా రంగరాజు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×