BigTV English
Advertisement

Shekar Basha: అది పచ్చి అబద్ధం, హౌజ్‌మేట్స్‌తో అలా చెప్పినందుకే బయటికి పంపించేశారు.. శేఖర్ భాషా క్లారిటీ

Shekar Basha: అది పచ్చి అబద్ధం, హౌజ్‌మేట్స్‌తో అలా చెప్పినందుకే బయటికి పంపించేశారు.. శేఖర్ భాషా క్లారిటీ

Shekar Basha: బిగ్ బాస్ సీజన్ 8లో రెండోవారం శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశాడు. కానీ ఈ ఎలిమినేట్ న్యాయంగా జరగలేదని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఆడియన్స్ ఓట్ల వల్ల తను ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడేమో అని భావిస్తున్నారు. హౌజ్‌లో ఉన్నప్పుడు శేఖర్ భాషా అందరితో సరదాగా ఉన్నా కూడా హౌజ్‌మేట్స్ అంతా కలిసికట్టుగా బయటికి పంపడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇక హౌజ్ నుండి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో ముచ్చటించాడు శేఖర్ భాషా. అందులో ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలిచ్చాడు. హౌజ్‌మేట్స్ కలిసి బయటికి పంపడంపై ఆయన స్పందించారు.


మంచికోసమే

బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనేది పచ్చి అబద్ధం అని ముందుగా షో గురించి చెప్పుకొచ్చారు శేఖర్ భాషా. ‘‘నేను ఎలిమినేట్ అవ్వడానికి సోనియా, పృథ్వి ఎవరూ కారణం కాదు. నేను హోమ్ సిక్ అయ్యాననే విషయం అక్కడ ఉన్న హౌజ్‌మేట్స్ అందరితో షేర్ చేసుకున్నాను. కరెక్ట్‌గా చెప్పాలంటే బిడ్డను చూసుకోవాలనే కోరిక బలంగా ఉందని అందరికీ చెప్పాను. వాళ్లందరూ నాకు సింపథీ చూపించారు. ఎలిమినేట్ అయినా పర్వాలేదా అని అడిగినప్పుడు నాకు బిడ్డను చూడడం ముఖ్యం అని కొంతమందికి చెప్పాను. అందుకే నా మంచికోసమే నన్ను పంపించారు తప్పా ఎవరూ నా మీద కక్ష కట్టి చేయలేదు. ప్రేమతోనే పంపించారు’’ అని క్లారిటీ ఇచ్చాడు.


రెండు రోజులుగా టెన్షన్

హౌజ్‌మేట్స్ నిర్ణయంతో తను ఎలిమినేట్ అయినా కూడా తనకు హ్యాపీగానే ఉంది అని అన్నాడు శేఖర్ భాషా. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడే తనకు బిడ్డ పుట్టాడని తెలియడంపై కూడా స్పందించాడు. ‘‘మాకు అసలు అక్కడ టైం, డేట్ తెలియదు. ఈ రెండు రోజుల్లో డెలివరీ ఎప్పుడు ఉండొచ్చు. తనకు ఎలా ఉంది. సేఫ్‌గా ఉందా లేదా అనే టెన్షన్‌లోనే ఉన్నాను. ఏ సమాచారం తెలియదు. అక్కడ కెమెరాలను కూడా అడిగేవాడిని. ఏ సమాధానం రాలేదు. నాగార్జున మాత్రమే మాతో మాట్లాడడానికి వచ్చేవారు. ఆయనను అడిగినప్పుడు ఒక్కసారి బిడ్డ పుట్టాడని చెప్పగానే రెండు రోజులుగా ఉన్న టెన్షన్ మొత్తం పోయింది. పిచ్చి కలలు అన్ని వచ్చేవి. మనసు కుదుటపడింది. ఆనందభాష్పాలు వచ్చాయి’’ అని వివరించాడు.

తెలుగమ్మాయి గెలవాలి

టాప్ 5లో ఎవరు ఉంటే బాగుంటుంది అని అడగగా.. ‘‘టాప్ 5 గురించి కాదు కానీ సీత గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మన తెలుగమ్మాయి. హైదరాబాద్ అమ్మాయి. చిన్న వయసులోనే ఒక మంచి స్పిరిట్‌తో వచ్చింది. పైగా 8 సీజన్స్‌లో ఒక్క లేడీ కంటెస్టెంట్ కూడా గెలవలేదు’’ అని మనసులో మాట బయటపెట్టాడు శేఖర్ భాషా. బిగ్ బాస్ తెలుగులో కన్నడ కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉండడంపై కూడా తను స్పందించాడు. ‘‘కన్నడవాళ్లు ఉన్నమాట నిజమే. కొంతమందికి ముందు నుండే పరిచయాలు ఉండడం వల్ల రాగానే ముందు నుండి క్లోజ్ అయిపోయి మాట్లాడుకుంటూ ఉండడం వల్ల కొంతమందిని దూరం చేశారనే ఫీలింగ్ వస్తుంది’’ అని అన్నాడు శేఖర్ భాషా.

Related News

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Big Stories

×