E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : తనూజకు నాగార్జున సపోర్ట్..అంతా మోసం..బిగ్ బాస్ పై శేఖర్ బాషా షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : తనూజకు నాగార్జున సపోర్ట్..అంతా మోసం..బిగ్ బాస్ పై శేఖర్ బాషా షాకింగ్ కామెంట్స్..
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగు బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నా టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది. సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జనాలను బాగానే ఆకట్టుకుంది. ఎవరు విన్నర్ అవుతారా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. కొంతమంది తనూజకి సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది కళ్యాణ్ విన్ అవుతాడంటూ వాదిస్తున్నారు.. అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విన్నర్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అని తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా షాకింగ్ న్యూస్ ను రీవిల్ చేశారు.. ఆయన నాగార్జున తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి శేఖర్ బాషా ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉందని అన్నాడో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

తనూజను నాగార్జున కాపాడుతున్నాడు..

తెలుగు బిగ్ బాస్ లో ప్రతి సీజన్లో బిగ్ బాస్ కి ఒక ముద్దుబిడ్డ ఉంటుంది. వాళ్లని ఎలిమినేట్ అవ్వకుండా హౌస్ లోనే ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలాంటి వారిని జనాలు బిగ్ బాస్ దత్తపుత్రిక అంటారు. అయితే ఇప్పటివరకు జరిగిన సీజన్లలో ఎక్కువగా ఆడవాళ్ళనే బిగ్ బాస్ సేవ్ చేస్తూ వస్తున్నాడు. అలాగే ఈ సీజన్ లో కూడా నాగార్జున ఫేవరెట్ కంటెస్టెంట్ అయిన తనుజని ప్రతి నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తూ వస్తున్నాడు. కేవలం ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ చేయడం మాత్రమే కాదు విన్నర్ అయ్యేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా సంచలన విషయాలను బయటపెట్టారు..తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఈ సీజన్ విన్నర్ పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తనూజ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Also Read : ‘నిండు నూరేళ్ల సావాసం’ మను ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

బిగ్ బాస్ 9 విన్నర్ అతనే..? 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బిగ్ బాస్ శేఖర్ బాషా ఈ సీజన్ బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్‌బాస్-9 విన్నర్ ఎవరంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై కూడా శేఖర్ మాట్లాడాడు. నాగార్జున తనూజ కు సపోర్ట్ చేస్తున్నాడని ఆయన అన్నారు. అయితే మిగతా లేడీ కంటెస్టెంట్లతో పోలిస్తే ఆమె బెటర్‌యే కానీ ఒక కామనర్ గెలిస్తే పబ్లిక్‌కి వచ్చే కిక్కు వేరు.. ఆయన అంటున్నారు. ఒక కామనర్ కప్పు కొడితే అది గ్రేట్ గా ఫీల్ అవుతారు. నాకు తెలిసి కళ్యాణ్‌కే స్కోప్ ఎక్కువ ఉంది.. సెలబ్రెటీలకి పీఆర్స్ గట్టిగా ఉంటాయి.. దీనికి తోడు తనూజ లాంటి సీరియల్ యాక్టర్ కు ఆడియన్స్ సపోర్టు చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆమె నామినేషన్ లోకి వెళ్లిన టాప్ లోనే కొనసాగుతుంది.. ఏది ఏమైనా కూడా ఆడియోస్ సపోర్ట్ గనుక ఉంటే కళ్యాణ్ కప్పు కొట్టడం గ్యారెంటీ అని శేఖర్ బాషా జోష్యం చెప్పాడు. మరి ఆయన చెప్పిన జోష్యం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే సీజన్ ఎండ్ అయ్యేవరకు వెయిట్ చేయాలి…

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×