BigTV English

Shilpa Shirodkar: మహేశ్‌, నమ్రతతో విభేదాలు… అందుకే మహేష్ మరదలు నుంచి ఆ కామెంట్స్

Shilpa Shirodkar: మహేశ్‌, నమ్రతతో విభేదాలు… అందుకే మహేష్ మరదలు నుంచి ఆ కామెంట్స్

Bigg Boss Shilpa Shirodkar: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 మంచి రేటింగ్‌తో దూసుకుపోతుండగా.. దానికి పోటీగా తమిళంలో కూడా బిగ్ బాస్ సీజన్ 8తో పాటు హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 ప్రారంభమయ్యింది. ఇండియన్ భాషలో బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రారంభమయ్యిందంటే అది హిందీలోనే. అందుకే సక్సెస్‌ఫుల్‌గా 17 సీజన్స్ పూర్తి చేసుకొని 18వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ బిగ్ బాస్ 18లో కంటెస్టెంట్స్‌గా వచ్చినవారిలో హైలెట్అయిన వ్యక్తి శిల్పా శిరోద్కర్. తను మరెవరో కాదు నమ్రత చెల్లెలు. మహేశ్ బాబుకు మరదలు. తన ఫ్యామిలీకి అంత స్టార్‌డమ్ ఉన్నా కూడా వారి గురించి ఓపెన్‌గా మాట్లాడడానికి ఇష్టపడదు శిల్పా శిరోద్కర్.


బిగ్ బాస్ కంటెస్టెంట్

నమ్రత, శిల్పా.. ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో హీరోయిన్స్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. నమ్రతకు తెలుగు నుండి కూడా అవకాశాలు రాగా.. తను ఇక్కడికి వచ్చి మహేశ్‌తో సినిమా చేసి తనతో ప్రేమలో పడి పెళ్లిచేసుకొని సెటిల్ అయిపోయింది. నమ్రత పెళ్లి చేసుకొని యాక్టింగ్‌కు దూరమయినా కూడా శిల్పా మాత్రం కొంతకాలం వరకు యాక్టింగ్‌ను కొనసాగించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని నమ్రతలాగానే తను కూడా యాక్టింగ్ మానేసి ఫారిన్‌కు వెళ్లి సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఉన్నట్టుండి బిగ్ బాస్ 18లో కంటెస్టెంట్‌గా వచ్చి అందరికీ షాకిచ్చింది. ఇటీవల తను పాల్గొన్న ఇంటర్వ్యూలో నమత్ర, మహేశ్‌తో అనుబంధం గురించి చెప్పమని అడగగా శిల్పా నిరాకరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


Also Read: అడుగుపెట్టిన 24 గంటల్లోనే కంటెస్టెంట్ ఎలిమినేట్.. బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్

ఫ్రెండ్ కాదు

‘‘నాకు ఏమీ దాచాలని లేదు. సీక్రెట్ అనేవి అస్సలే లేవు. నేను నా ఇమేజ్ గురించి అతిజాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేను నాలాగే ఉంటూ ఆటను మనస్ఫూర్తిగా ఆడతాను’’ అని చెప్పుకొచ్చింది శిల్పా శిరోద్కర్. సల్మాన్ ఖాన్, శిల్పా శిరోద్కార్ ఒకేసారి ఇండస్ట్రీలో వచ్చారు. పైగా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. అదే ఫ్రెండ్‌షిప్‌తో బిగ్ బాస్ 18లో సల్మాన్ సపోర్ట్.. శిల్పాకే దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. దానిపై కూడా తను ఈ ఇంటర్వ్యూలో స్పందించింది. సల్మా్న్ ఖాన్ అసలు నా ఫ్రెండే కాదు అంటూ వ్యాఖ్యలు చేసింది.

బాండింగ్ లేదు

‘‘సల్మాన్ ఖాన్ నాతో కలిసి పనిచేసే వ్యక్తి మాత్రమే. మా మధ్య ఎలాంటి స్పెషల్ బాండ్ లేదు. అసలు తను నా ఫ్రెండ్ కూడా కాదు. ఇప్పుడైనా తనను ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నాను. నేను ప్రతీ సీజన్‌ను ఫాలో అవుతాను. తను చాలా గొప్ప హోస్ట్ అని నాకు అనిపిస్తుంది. తను చాలా న్యాయంగా ఉంటాడు. తనతో ఈ కొత్త ప్రయాణం మొదలుపెట్టడానికి ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ఇంతకు ముందు కూడా తను కంటెస్టెంట్‌గా బిగ్ బాస్‌లోకి ఎంటర్ అవ్వడంపై మహేశ్, నమ్రత రియాక్షన్ ఏంటని అడగగా.. తను ఏం చేసినా వాళ్లు సపోర్ట్ చేస్తారని, వాళ్లు చాలా హ్యాపీ అని బయటపెట్టింది శిల్పా శిరోద్కర్.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×