Bigg Boss 9:ఊహించని సంఘటనలు జరగడమే బిగ్ బాస్ ప్రత్యేకత అని మరొకసారి రుజువైంది. ఎందుకంటే ఎంతోమంది ప్రేక్షకులు ఎలిమినేట్ అయిన శ్రీజ హౌస్ లోకి రావాలని బలంగా కోరుకున్నారు. అంతేకాదు శ్రీజ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని, కావాలనే ఆమెను బయటికి పంపించేసారని, జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అంటూ సోషల్ మీడియాలో ఎన్నో యాష్ ట్యాగ్ లు వైరల్ అయ్యాయి. అందరూ కోరుకున్నట్టే శ్రీజ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. శ్రీజతో పాటు భరణి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మీ ఇద్దరిలో పర్మినెంట్ హౌస్ మేట్ ఎవరు అవుతారో మీ గేమ్స్ ద్వారా రుజువు చేసుకోవాలని కొన్ని టాస్కులు ఇచ్చారు.
అలా టాస్కుల్లో శ్రీజ ఆడ శివంగిలా ఆడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి పర్మినెంట్ హౌస్ మేట్ గా భరణి అయ్యారు.శ్రీజని ఎలిమినేట్ చేశారు. కానీ శ్రీజ బయటికి వచ్చాక తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన వీడియో రిలీజ్ చేసింది. బిగ్ బాస్ కావాలనే తనని బలి పశువుని చేశాడని, భరణిని హౌస్ లోకి తీసుకురావడానికి నన్ను బలి పశువును చేశాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి శ్రీజ అందులో ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. నేను రెండోసారి కూడా ఎలిమినేట్ అయ్యాను. నన్ను సపోర్ట్ చేసిన వారు, నా మీద నెగిటివ్ కామెంట్లు చేసిన వారు,ఆడియన్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది నేను మాట్లాడుతాను.
ALSO READ:Mass jathara: మాస్ జాతర కలెక్షన్స్.. మరీ ఇంత దారుణం అయితే ఎలా బాసూ!
టాస్క్ లో నాకు అన్యాయం చేశారు. రీతు సుమన్ శెట్టికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. నిజం చెప్పుకోవాలంటే ఆ టాస్క్ లో వాళ్ళిద్దరూ పోయి ఉంటే నేనే విన్ అయ్యేదాన్ని. సంజన గారు నేను ఉంటే మళ్లీ నేనే కచ్చితంగా విన్ అయ్యేదాన్ని. క్లియర్గా మీరే చెప్పండి. ఆ రింగ్ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారో అంటూ ప్రశ్నించింది. అలాగే నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళలేదు.కానీ భరణి గారు ఆడియన్స్ ఓటింగ్ వల్లనే బయటికి వెళ్లారు. కానీ అది మిగతా కంటెస్టెంట్లకు అన్యాయం జరిగినట్లే..శ్రష్టి వర్మ, ఫ్లోరా, మనీష్,ప్రియా శెట్టి వీరందరికీ అన్యాయం జరిగినట్లే. నేను, భరణి గారు ఇద్దరం గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్న సమయంలో గేట్ దగ్గర ఉన్న వ్యక్తి.. ఇప్పుడైనా బాగా ఆడండి.. హౌస్ లోనే ఉంటారు కదా అని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. భరణిని హౌస్ లోనే ఉంచుతారని, ఎన్ని ఫార్మాట్లు పెట్టినా.. ఎన్ని టాస్కులు పెట్టినా.. నేను క్లియర్ కట్ గా అర్థం చేసుకున్నాను భరణి గారిని లోపలే ఉంచుతారని..
గేటు దగ్గర ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఇండైరెక్టుగా చెప్పేశారు. ఇక టాస్కుల్లో నేను ఫస్ట్ టాస్క్ విన్ అయ్యాను. సెకండ్ టాస్క్ డ్రా అయ్యింది. కానీ దాన్ని అన్యాయంగా రద్దు చేశారు.. నాకు ఒక్కటే అనిపించింది భరణి గారిని హౌస్ లోకి తీసుకురావడం కోసం నన్ను బలి పశువుని చేశారని అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది దమ్ము శ్రీజ. ప్రస్తుతం శ్రీజ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో శ్రీజ మాట్లాడింది నిజమే.. భరణిని తీసుకురావడం కోసం శ్రీజని నిజంగానే బలి పశువును చేశారని అంటున్నారు. టాస్కుల్లో అంత బాగా ఆడని భరణిని తీసుకురావడం కోసం ఆడ పులిలా ఆడే శ్రీజ కి అన్యాయం చేశారు అంటూ మరొకసారి జస్టిస్ ఫర్ శ్రీజ దమ్ము అంటూ యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.