Mass jathara:కొన్ని సినిమాలు భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తాయి. అలా తాజాగా విడుదలైన ‘మాస్ జాతర’ మూవీ కూడా మాస్ మహారాజ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ‘ధమాకా’ కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాకా అని సినిమా రిలీజ్ కి ముందే ఎంతో మంది ఫ్యాన్స్ రివ్యూ ఇచ్చేశారు. కానీ తీరా రిజల్ట్ చూస్తే మాత్రం డిజాస్టర్ టాక్.. మాస్ జాతర రిలీజ్ కు ముందు భారీ ఎత్తున ప్రమోషన్స్ చేశారు.ముఖ్యంగా సినిమా నుండి విడుదలైన టీజర్,ట్రైలర్,సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా రవితేజ అభిమానుల్లో కొత్త ఊపును తెచ్చాయి. ఒకప్పటి రవితేజని మళ్ళీ చూడబోతున్నాం అని అనుకున్నారు.
కానీ బాహుబలి ది ఎపిక్ ఎఫెక్ట్ పడిందో లేక ప్రేక్షకులకు కథ నచ్చలేదో తెలియదు కానీ సినిమా డిజాస్టర్ అనే టాక్ వినిపిస్తోంది. మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న ప్రీమియర్స్ వేసి నవంబర్ ఫస్ట్ న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే చాలా పూర్ కలెక్షన్స్ అంటున్నారు. ఎందుకంటే మాస్ జాతర మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కేవలం 5.4 కోట్లు మాత్రమే.. ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం నిజంగా దారుణం అనే చెప్పవచ్చు. మాస్ జాతర మూవీ పెద్ద హిట్ అవుతుందని రవితేజ కూడా కలలు కన్నారు. ముఖ్యంగా చాలా రోజుల నుండి ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ కి మాస్ జాతర బూస్టింగ్ మూవీ అని భావించారు. కానీ ఫైనల్ టాక్ చూస్తే మాత్రం రవితేజ అభిమానులు కూడా సినిమాని బాలేదనే అంటున్నారు.
ముఖ్యంగా సినిమాలో కథ ఏమీ లేకపోవడం ప్రేక్షకుల్ని దారుణంగా నిరాశపరిచింది. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ ఎదురయింది. రొటీన్ స్టోరీ అవ్వడంతో ప్రేక్షకులు సినిమాని ఆదరించలేదు. ఓ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ కనిపించాడు. కానీ రవితేజ పోలీస్ అవ్వాలని కలలు కంటాడు. ఆ తర్వాత ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయిన సమయంలో గంజాయిని అడ్డుకునే పాత్రలో కనిపించాడు.అయితే ఈ సినిమాలో క్యారెక్టర్లని దర్శకుడు భాను భోగవరపు బాగా వాడుకోలేదని అంటున్నారు.సినిమాలో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్లు ఉన్నప్పటికీ ఒక్కరితో కూడా పంచ్ డైలాగ్ లు చెప్పించలేదు.
ALSO READ:Bigg Boss 9 Promo: హౌస్ లో ది గర్ల్ ఫ్రెండ్.. రీ క్రియేట్ తో ఆకట్టుకున్న కంటెస్టెంట్స్!
అలా మొత్తంగా సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. శుక్రవారం ప్రీమియర్స్,శనివారం మొత్తం కలెక్షన్లు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా కేవలం 5.4 కోట్లు రావడం నిర్మాతల్ని కూడా నిరాశపరిచింది. అయితే ఈ సినిమాని బాహుబలి ది ఎపిక్ మూవీ దెబ్బకొట్టిందని అంటున్నారు. ఒకవేళ బాహుబలి ది ఎపిక్ మూవీ రిలీజ్ కాకపోయి ఉంటే మాస్ జాతర మూవీకి పెట్టిన బడ్జెట్ అయిన తిరిగి వచ్చేదని నిర్మాతలు గట్టెక్కేవారని అంటున్నారు సినీ విశ్లేషకులు. అలా ఈ సినిమాలో రవితేజ శ్రీలీల మ్యాజిక్ పనిచేయలేదని చెప్పుకోవచ్చు. ఏవి ఏమైనా రవితేజ మళ్లీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నారని.. ఇలా కథల ఎంపిక విషయంలో తడబడితే ఎలా గురూ అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.