Suman Shetty: సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈయన 14 వారాలు పాటు హౌస్ లో కొనసాగుతూ 14వ వారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా సుమన్ శెట్టి (Suman Shetty)బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వత ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ శెట్టికి బిగ్ బాస్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి కళ్యాణ్(Kalyan), తనూజ(Tanuja) రిలేషన్ గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. గత కొద్ది వారాలుగా వీరిద్దరూ చాలా చనువుగా ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కొనసాగుతుందని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య రిలేషన్ నిజమేనా లేకపోతే కంటెంట్ కోసమే బిగ్ బాస్ అలా లవ్ ట్రాక్ క్రియేట్ చేశారా? అనే విషయంపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుమన్ శెట్టి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నేపథ్యంలో ఆయనకు వీరిద్దరి రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. తనూజ, కళ్యాణ్ మద్య లవ్ ట్రాక్ నిజమేనా అంటూ ప్రశ్న ఎదురు కావడంతో ఈయన మాత్రం ఈ వార్తలను ఖండించారు. వారిద్దరి మధ్య ఎలాంటి లవ్వు లేదని కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో 24 గంటలు జరిగేది టెలికాస్ట్ చేయరని వాళ్లకు కావాల్సిన కంటెంట్ మాత్రమే బయటకు వదులుతారని సుమన్ శెట్టి తెలిపారు.
తనూజ, కళ్యాణ్ తో పాటు నేను హౌస్ లో దాదాపు 90 రోజులకు పైగా ఉన్నాను వారిని చాలా దగ్గర నుంచి చూసిన నేను వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ఎలాంటి లవ్ లేదని కచ్చితంగా చెప్పగలను అంటూ వీరిద్దరి లవ్ ట్రాక్ గురించి వస్తున్న వార్తల పట్ల సుమన్ శెట్టి క్లారిటీ ఇచ్చారు.. మరి ఇప్పటికైనా వీరిద్దరి రిలేషన్ గురించి వచ్చే వార్తలకు చెక్ పడుతుందా లేదంటే ఇలాగే కొనసాగుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక సుమన్ శెట్టి భరణి 14వ వారం హౌస్ నుంచి బయటకు రాగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా తనూజ, కళ్యాణ్, పవన్, సంజన, ఇమ్మానియేల్ ఉన్న సంగతి తెలిసిందే.
చోటా డాన్ గా సుమన్ శెట్టి..
మరి ఈ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలవబోతున్నారనేది తెలియాల్సి ఉంది. మరొక మూడు రోజులలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే విన్నర్ ఎవరు అనే విషయంపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమన్ శెట్టి ఇటీవల ఎలిమినేట్ అయిన అనంతరం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు ఈయన బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి రాగానే స్టార్ మా సీరియల్ లో ఛాన్స్ కొట్టేసారని తెలుస్తోంది. స్టార్ మాలో డిసెంబర్ 22 వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్న నువ్వు లేక నేను లేను అనే సీరియల్ లో చోటా డాన్ పాత్రలో సుమన్ శెట్టి కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ తర్వాత సుమన్ శెట్టి బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చారని తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: IBomma Ravi: సైబర్ క్రైమ్ కస్టడీలోకి ఐ బొమ్మ రవి.. వెలుగులోకి సంచలన విషయాలు!