E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : డిమాన్ పై రగిలిపోతున్న తనూజ..మారిన లెక్కలు.. టాప్ లో ఎవరంటే..?

Bigg Boss 9 Telugu : డిమాన్ పై రగిలిపోతున్న తనూజ..మారిన లెక్కలు.. టాప్ లో ఎవరంటే..?
Advertisement

Bigg Boss 9 Telugu : బుల్లితెరపై టాప్ రియాల్టీ షో గా కొనసాగుతున్న ఏకైక షో బిగ్ బాస్.. ఈ షో కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే శుభం కార్డు వేసుకోబోతుంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న తొమ్మిదవ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలో ఈ సీజన్ విన్నర్ ఎవరు అన్నది ఆసక్తి జనాల్లో రోజురోజుకీ పెరుగుతుంది. గతంలో ఎన్నడు లేని విధంగా టిఆర్పి రేటింగ్ రావడంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బిగ్ బాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు.. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు.. వీరిలో ఎవరు విన్నర్ అవుతారా అన్నది ఆసక్తిగా మారింది.. అయితే ఈ వారం హౌస్ మేట్స్ లెక్కలు పూర్తిగా మారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొన్నటివరకు టాప్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పుడు లాస్ట్ పొజిషన్ లో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఐదుగురిలో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు..? లీస్ట్ ఓటింగ్ తో ఎవరు ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం..

డిమాన్ పై కోపంతో రగిలిపోయిన తనూజ…

బిగ్ బాస్ హౌస్ లోకి కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన డిమోన్ పవన్ మొదటి నుండి టాస్కులు ఆడడంలో బీస్ట్ రేంజ్ అనే చెప్పాలి. డిమోన్ పవన్ బరిలో దిగాడంటే అవతల ఎంతటి మనిషి అయినా ఓడిపోవాల్సిందే.. మొదట్లో ప్రతి ఆటలో విజ్రూంభించేవాడు. ఎప్పుడైతే రీతు చౌదరి పరిచయం ఏందో అప్పటినుంచి అతని ఆటలో కూడా తేడా కనిపించేసింది. రీతు హౌస్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ కూడా బీభత్సంగా ఇస్తున్నాడని అంటున్నారు. ఇక గడిచిన రెండు రోజుల్లో ఆయన టాస్కులు ఏ రేంజ్ లో ఆడుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.. నిన్న జరిగిన టాస్క్ లో డిమాన్ బాగా ఆడాడు. దాంతో అతను మళ్లీ ఫామ్లోకి వచ్చేసాడు.. అందరికి గట్టిపోటీని ఇస్తూ రెచ్చిపోయాడు. అతని ఆటని చూసి ఒక్కసారిగా తనూజకు షాక్ తగిలింది. మొత్తానికి అతన్ని ఎలాగైనా ఓడించాలని నిర్ణయించుకుంది.. ఇక ముందు వీళ్ల మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి..

Advertisement

Also Read : తాయారును రెచ్చగొట్టిన గాయత్రి.. నారాయణ దెబ్బకు షాక్.. మహా పై భూషణ్ సీరియస్..

తారుమారైన ఓటింగ్.. టాప్లో ఎవరున్నారంటే..?

డిమోన్ పవన్ మొన్నటివరకు సైలెంట్ ఏదో ఉన్నామంటే ఉన్నామని ఉండేవాడు.. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి టాస్క్ లోనూ యాక్టివ్ గా ఉంటున్నాడు. హౌస్ మేట్స్ అందరూ కలిసి డిమోన్ టార్గెట్ చేయడం నిన్నటి ఎపిసోడ్ ను చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం అధికారిక ఓటింగ్ ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ 26 శాతం తో కొనసాగుతుండగా, తనూజ 25 శాతం తో, డిమోన్ పవన్ 23 శాతం తో కొనసాగుతున్నాడు.. వీరి ముగ్గురు మధ్య పెద్దగా పోటీ కనిపించలేదు. ప్రస్తుతం రీస్ లో ఈ ముగ్గురు ఉండడంతో ఎవరైనా టైటిల్ కొట్టే అవకాశం ఉంది అని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు విన్నర్ అవుతారు అన్నది సోషల్ మీడియాలో చర్చినీయాంశంగా మారింది.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బిగ్ బాస్ షో రసవత్తరంగా కొనసాగుతుంది… మరి ఈ సీజన్ విన్నర్ ఎవరో అవుతారా అన్నది తెలియాలంటే ఈ షో చివరి ఎపిసోడ్ వరకు మిస్ అవ్వకుండా చూడాలి…

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×