BigTV English

Prerana Kambam: బిగ్‌బాస్ తర్వాత మరో  టీవీషోలోకి ప్రేరణ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

Prerana Kambam: బిగ్‌బాస్ తర్వాత మరో  టీవీషోలోకి ప్రేరణ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!

Prerana Kambam: బుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గత ఏడాది పూర్తయింది. ఆ సీజన్లో తెలుగు వాళ్ళ కంటే కన్నడ వల్లే ఎక్కువగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రేరణ కంభం కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. హౌస్ లో ఆమె యాటిట్యూడ్ అటు తీరు ఆమెను చివరి వరకు ఉంచాయి. ప్రతివారం నామినేషన్ లో ఉన్నా కూడా. నా ఆటతో మాటతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటూ చివరికి టాప్ ఫైవ్ లో నిలిచింది.. బిగ్ బాస్ ప్రేరణ బుల్లితెరపై మరో రియాల్టీ షోలో పాల్గొన్న పోతుంది. వైట్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఈ సారి సింగిల్‌గా కాకుండా జంటగా షోలోకి అడుగు పెట్టబోతుంది.. ఇంతకీ ఆ షో పేరేంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


గత మూడేళ్లుగా బిగ్ బాస్ షో అయిన తర్వాత ఇస్మార్ట్ జోడి అనే ప్రోగ్రాం ని నిర్వహిస్తుంది స్టార్ మా.. బిగ్ బాస్ లో సందడి చేసిన సెలబ్రిటీలు ఈ షోలో తమ జంటలతో కలిసి సందడి చేస్తారు.. బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత ఇస్మార్ట్ జోడి సీజన్ 3 ని మొదలెట్టేశారు. సెలిబ్రిటీ కపుల్ గేమ్ షోలోకి బిగ్‌బాస్ ఫైనలిస్ట్ ప్రేరణ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఆమె తన భర్త శ్రీపద్ తో ఈ షోలో పాల్గొనబోతుంది. ఇటీవల ఈ షో ప్రోమోను విడుదల చేశారు. అందులో ఈమె తన భర్తతో కలిసి రావడం కనిపిస్తుంది. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో ఏముందంటే.. ప్రేరణ తన భర్త శ్రీపద్ అలాగే తన తల్లిదండ్రులతో కలిసి ఈ షోకి వచ్చింది. ప్రేరణ, శ్రీపాద్ కలిసి డ్యాన్స్ చేసినట్లు ఈ ప్రోమోలో కనిపిస్తోంది. ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్‌లోకి ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా ప్రేరణ మరియు శ్రీపద్ నిలవనున్నారని ప్రోమోను చూస్తే తెలుస్తుంది.. ఈ స్మార్ట్ జోడి సీజన్ 3 లో 9 జంటలు పాల్గొన్నాయి.. అందులో అలీ రెజా – మౌసుమా, రాకింగ్ రాకేష్ – సుజాత, యశ్ – సోనియా, లాస్య – మంజునాథ్‌, ఆదిరెడ్డి – కవిత, అమర్ దీప్ -తేజు , వరుణ్ – సౌజన్య, ప్రదీప్ – సరస్వతి, అనిల్ గీలా – ఆమని, జంటలతో ఈ షో మొదలైంది.. అయితే వారం వరుణ్ సౌజన్య జంట ఎలిమినేట్ అయ్యారు. ఇక భారీ ప్లేస్ లో ప్రేరణ శ్రీపద్ జంట రానున్నారని తెలుస్తుంది. ఈ షో కి హోస్టుగా ఓంకార్ వ్యవహరిస్తున్నారు.


ఈ కన్నడ ముద్దుగుమ్మ ప్రేరణ గురించి చెప్పాలంటే ఈమె సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. స్టార్ మా లో ప్రసారమైన కృష్ణ ముకుందా మురారి అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సీరియల్ మంచి హిట్ టాక్ ని అందుకోవడంతో ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. బిగ్ బాస్ లో ప్రేరణ భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్.. అంటే వారానికి రెండు లక్షల చొప్పున మొత్తం 30 లక్షల వరకు ప్రేరణకు రెమ్యూనరేషన్ అందుకుంది..

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×