BigTV English

TGPSC Group-II: అఫీషియల్ KEY తర్వాత గ్రూప్-2 కటాఫ్ ఇదిగో.. సేఫ్ మార్కులివే..

TGPSC Group-II: అఫీషియల్ KEY తర్వాత గ్రూప్-2 కటాఫ్ ఇదిగో.. సేఫ్ మార్కులివే..

TGPSC Group-II: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 ఉద్యోగాలకు 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ప్రభుత్వం నిర్వహించింది. అయితే గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన అఫీషియల్ ‘కీ’ ని టీజీపీఎస్సీ మూడు రోజుల క్రితం వెబ్ సైట్‌లో పొందపరిచింది. అయితే ఎన్ని మార్కుల వస్తే జాబ్ వస్తుందో ఒకసారి చూద్దాం.


అయితే పరీక్ష రాసిన అనంతరం చాలా యూట్యూబ్ ఛానెళ్లు, పలు కోచింగ్ సెంటర్ నిర్వహకులు సోషల్ మీడియాలో కటాఫ్ మార్కుల గురించి వివరించారు. 370 పైన మార్కులు వచ్చిన వారికే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే చాలా మంది అభ్యర్థులు మొదట్లో 380, 390 మార్కులు వచ్చాయని చెప్పినప్పటికీ.. అఫీషియల్ కీ విడుదలయ్యాక ముప్పై నుంచి 40 మార్కులు తగ్గుతున్నాయని చెబుతున్నారు. మొదట్లో 380 మార్కులు వచ్చిన వారు ఇప్పుడు 350 మార్కులు వస్తున్నాయని.. అఫీషియల్ కీ లో చాలా మార్కులు తగ్గుతున్నాయని చెప్పుకొస్తున్నారు.

మూడు మార్కులు తొలగింపు.. 597 మార్కులకే..


డిసెంబర్ 15న ఉదయం 10 గంటలకు పేపర్-1 జనరల్ స్టడీస్ పరీక్ష జరగగా.. మధ్యాహ్నం 3 గంటలకు పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సోషయాలజీ జరిగింది. మరుసటి రోజైన డిసెంబర్ 16 న ఉదయం 10 గంటలకు పేపర్-3 ఎకానమీ పరీక్ష జరగగా.. మధ్యాహ్నం 3 గంటలకు పేపర్-4 తెలంగాణ ఉద్యమం జరిగింది. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు గానూ టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అఫీషియల్ కీ లో మూడు మార్కులను టీజీపీఎస్సీ తొలగించింది. దీంతో మొత్తం మార్కులు 600 నుంచి 597 మార్కులకు కుదించారు.

అయితే.. అఫీషియల్ కీ వెబ్ సైట్‌లో పొందపరిచిన తర్వాత ఈ గ్రూప్-2 పరీక్షలో ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది..? కటాఫ్ మార్కులు ఎంత వరకు ఉండొచ్చు..? ఏఏ పేపర్ కఠినంగా వచ్చింది..? అనే ఒకసారి తెలుసుకుందాం.. ముందుగా పేపర్ లెవల్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

పేపర్లు ఎలా వచ్చాయంటే..?

గ్రూప్-2 పేపర్-1 కఠినంగా వచ్చిందని చెప్పవచ్చు. కరెంట్ అఫైర్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి ప్రశ్నలు వచ్చాడు. అవ్వి కూడా హార్డ్ లెవల్‌లో ప్రశ్నలు వచ్చాయి. జాగ్రఫీ విషయానికి వస్తే ఎవరూ ఎక్కడ కనబడని ప్రశ్నలు రాగా.. ముఖ్యంగా వరల్డ్ జాగ్రీపీ అయితే చాలా కఠినంగా ప్రశ్నలు వచ్చాయి. మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కూడా అదే లెవల్ లో రావడంతో చాలా మంది అభ్యర్థులు పేపర్ కఠినంగా వచ్చిందనే భావిస్తున్నారు. పేపర్- 70 నుంచి 80 వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు. ఇక పేపర్ -2 తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ చాలా కఠినమైన ప్రశ్నలు వచ్చాయి. పాలిటీ, సొసైటీ ఈజీ టూ మోడరేట్ గా ప్రశ్నలు రావడంతో.. పేపర్-2 లో 90 నుంచి 100 మార్కులు వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు.

ఇక, పేపర్-3 ఎకానమీకి సంబంధించి పేపర్ కఠినంగా వచ్చింది. ఇండియన్ ఎకానమీ ఈజీ టూ మోడరేట్ గా ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ ఎకానమీ అయితే 2021-22, 2022-23 సర్వేల నుంచి ప్రశ్నలు రావడంతో చాలా మంది అభ్యర్థులు ప్రశ్నలకు ఆన్సర్ చేయలేకపోయారు. పేపర్-3 లో 85 నుంచి 95 మార్కుల మధ్య స్కోర్ వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు. ఇక పేపర్-4 తెలంగాణ ఉద్యమం చాలా మంది అభ్యర్థులు 140 చేయగలమని భావించారు. తీరా క్వశ్చన్ పేపర్ చూస్తే ప్రశ్నలు అంతా సులభంగా ఏం రాలేదు. ఇందులో 100 నుంచి 110 మార్కులు వస్తే మంచి స్కోరుగా చెప్పవచ్చు.

పేపర్ల వారీగా సేఫ్ స్కోర్..

పేపర్-1 జీఎస్: 70-80

పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ: 90-100

పేపర్-3 ఎకానమీ: 85-95

పేపర్-4 తెలంగాణ ఉద్యమం: 100-110

ఓవరాల్ అన్ని పేపర్లలో కలిపి 350 మార్కులు దాటితే మంచి స్కోర్ అనే చెప్పవచ్చు.

Also Read: Amazon Jobs: గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో అమెజాన్‌లో జాబ్స్.. జీతం రూ.42,000

కటాఫ్ ఇలా ఉండొచ్చు..

ఓపెన్ కటాఫ్: 365 మార్కులు ఉండోచ్చు

బీసీ-ఏ: 345 మార్కులు

బీసీ-బీ: 355 మార్కులు

బీసీ-సీ: 345 మార్కులు

బీసీ-డీ: 355 మార్కులు

బీసీ-ఈ: 345 మార్కులు

ఎస్సీ: 335

ఎస్టీ: 335

ఈడబ్ల్యూఎస్: 335

ఈ మార్కులు పది మార్కులు అటు ఇటు కటాఫ్ ఉండే అవకాశాలున్నాయి. 350, 360 మార్కులు దాటిన వారందరూ ఉద్యోగంపై హోప్ పెట్టుకోవచ్చు.

Related News

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

Big Stories

×