Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8లో అందరు కంటెస్టెంట్స్‌ను దాటుకుంటూ అయిదుగురు మాత్రమే టాప్ 5కు చేరుకున్నారు. ప్రేరణ, అవినాష్, నబీల్, గౌతమ్, నిఖిల్.. టాప్ 5 కంటెస్టెంట్స్‌గా నిలిచారు. అయితే ఫినాలే వీక్ మొదలయినప్పటి నుండే ఎవరు విన్నర్ అవుతారు అని బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ గెలవాలని ఫ్యాన్స్ అంతా ఓట్లు వేయడం మొదలుపెట్టారు. ఇక బిగ్ బాస్ రివ్యూవర్లు సైతం ఎవరు గెలుస్తారు అని అంచనాలు మొదలుపెట్టారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించిన సగం షూటింగ్ పూర్తవ్వగా 3 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. ఇద్దరు మాత్రమే బిగ్ బాస్ ఫైనల్స్‌లో మిగిలారు.
ఛాన్స్ లేదు
మామూలుగా ప్రతీసారి బిగ్ బాస్ సీజన్ ప్రారంభమయిన కొన్నిరోజుల్లోనే విన్నర్ ఎవరు అనే విషయంపై ప్రేక్షకుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఈసారి అలా జరగలేదు. ఎవరి ఆట కూడా సూపర్ అనిపించే రేంజ్‌లో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. చాలామంది ప్రేక్షకులకు అసలు ఫేవరెట్ కంటెస్టెంటే లేకుండా పోయారు. కానీ అయిదుగురు మాత్రమే చాలామంది అభిమానాన్ని గెలిచి టాప్ 5 స్థానానికి చేరుకున్నారు. అందులో అవినాష్ కూడా లక్‌లో మొదటి ఫైనలిస్ట్ అయిపోయాడు లేదా తను ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేవాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాబట్టి తనకు విన్నర్ అయ్యే ఛాన్స్ ఏ మాత్రం లేదు. ఇక మిగిలింది నలుగురే.
Also Read: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈసారి కూడా..?
లేడీ కంటెస్టెంట్
గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ.. అందరూ చాలామంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. కానీ ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన కంటెస్టెంట్ విన్నర్ అవ్వలేదు. ఆ సెంటిమెంట్‌ను గౌతమ్ బ్రేక్ చేయడానికి చాలా దగ్గర్లో ఉన్నాడు. అసలైతే చాలావరకు బిగ్ బాస్ సీజన్స్‌లో జరిగినట్టుగానే ఈసారి కూడా ఒక లేడీ కంటెస్టెంట్ రన్నర్ అవుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అలా జరగలేదు. ముందు నుండి ప్రేరణ చేసిన తప్పులు, తను వదిలేసిన మాటలు చాలామందికి నచ్చలేదు. అందుకే తనకు ఓట్లు తక్కువగా పడ్డాయి. అలా ప్రేరణ టాప్ 3 కంటెస్టెంట్‌గానే వెనుదిరగాల్సి వచ్చింది.
ఫైర్ తగ్గిపోయింది
ఒక కామన్ మ్యాన్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్.. ఒక స్పీడ్‌తో దూసుకుంటూ వచ్చాడు. కంటెస్టెంట్‌గా తన ఫైర్ అందరికీ నచ్చింది. తను విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్‌లాగా మరొక రికార్డ్ సాధిస్తాడని అనుకున్నారు. కానీ మెల్లగా నబీల్‌లో ఫైర్ తగ్గిపోయింది. అందుకే తను టాప్ 5 వరకు చేరుకున్నా కూడా విన్నర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. ఇక మిగిలిన నిఖిల్, గౌతమ్‌లో ఒకరికి బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ దగ్గనుంది. ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన గౌతమ్.. చివరి వరకు ఉంటాడని చాలామంది అనుకోలేదు. అలాంటిది ముందు నుండి హౌస్‌లో ఉన్న నిఖిల్‌కు పోటీగా ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఇక ఈ ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారో చూడాలి.