E-Paper
Advertisement

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?
Advertisement

2-pin vs 3-pin plug:  ఇంట్లో మొబైల్ ఛార్జర్ కోసం 2-పిన్, ఐరన్ బాక్స్ లేదా ఫ్రిడ్జ్ కోసం 3-పిన్ ప్లగ్ వాడతాం. ఈ రెండింటి మధ్య తేడా కేవలం డిజైన్ మాత్రమే కాదు. దీని వెనక మన ప్రాణాలను కాపాడే సేఫ్టీ కూడా ఉంది. ఇంతకీ ఎలక్ట్రిక్ షాక్స్ నుంచి రక్షణ పొందడంలో ఈ పిన్స్ ఎలా పని చేస్తాయి? ఏ పరికరానికి ఏ ప్లగ్ ఉపయోగించాలి? వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఇంట్లో వాడే ప్రతి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్ వెనక ఒక ముఖ్యమైన సైన్స్ దాగి ఉంటుంది. చాలా మంది 2-పిన్, 3-పిన్ ప్లగ్స్‌ని కేవలం డిజైన్ అనుకుంటారు. కానీ అవి మన ప్రాణాలను కాపాడే ఇంపార్టెంట్ సేఫ్టీ టూల్స్. 2-పిన్ ప్లగ్‌లు ఫేజ్, న్యూట్రల్ వైర్లను మాత్రమే కలిగి ఉండి, మొబైల్ ఛార్జర్లు, ట్రిమ్మర్లు వంటి తక్కువ పవర్ తీసుకునే, ప్లాస్టిక్ బాడీ ఉన్న డబుల్ ఇన్సులేటెడ్ పరికరాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. అయితే.. ఐరన్ బాక్స్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ వంటి హెవీ లోడ్ , మెటల్ బాడీ ఉన్న పరికరాలకు 3-పిన్ ప్లగ్ మ్యాండేటరీ.

Advertisement

ఇందులో ఉండే మూడవ పిన్ అంటే.. ఎర్తింగ్ పిన్ అత్యంత కీలకం. గాడ్జెట్ లో ఎక్కడైనా కరెంట్ లీక్ అయినప్పుడు, ఈ ఎర్తింగ్ పిన్ ఆ అదనపు కరెంట్ ను సురక్షితంగా భూమిలోకి పంపి మనకు ఎలాంటి షాక్ తగలకుండా కాపాడుతుంది. కాబట్టి.. పరికరం కెపాసిటీని బట్టి కరెక్ట్ ప్లగ్‌ను వాడటం ద్వారా ఎలాంటి ప్రమాదాలనైనా ఇట్టే అరికట్టవచ్చు.

2-పిన్ ప్లగ్ అంటే ఏమిటి? ఎక్కడ వాడతారు?

2-పిన్ ప్లగ్‌లో లైవ్ (Live- కరెంట్ అందించేది), న్యూట్రల్ (Neutral – కరెంట్ తిరిగి వెళ్లేది) అనే రెండు పిన్స్ మాత్రమే ఉంటాయి. వీటిని సాధారణంగా ప్లాస్టిక్ బాడీ ఉండే.. తక్కువ పవర్ వాడే డబుల్ ఇన్సులేటెడ్ పరికరాలకు వాడుతారు. ఉదాహరణకు.. మొబైల్ ఛార్జర్లు, లాప్‌టాప్ అడాప్టర్లు, టీవీలు మొదలైనవి. ఈ పరికరాల లోపల ఎలక్ట్రిక్ షాక్ తగిలే ..అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి.. వీటికి ఎర్తింగ్ అవసరం ఉండదు. అందుకే ఇవి చిన్న సైజులో 2-పిన్ రూపంలో వస్తాయి.

3-పిన్ ప్లగ్ , ఎర్త్ పిన్ ప్రాముఖ్యత:

Advertisement

ఇక 3-పిన్ ప్లగ్‌ విషయానికి వస్తే.. ఇందులో లైవ్, న్యూట్రల్‌తో పాటు పైన ఉండే మూడో పిన్ చాలా పెద్దదిగా, లావుగా ఉంటుంది. దాన్నే ‘ఎర్త్ పిన్’ అంటారు.

సేప్టీ కోసమే మూడో పిన్: లోహంతో తయారైన హెవీ పరికరాలైన ఐరన్ బాక్స్, వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి వాటిలో.. ఒక్కో సారి వైరింగ్ సమస్య వల్ల కరెంట్ బాడీకి.. పాకే అవకాశం ఉంటుంది. ఒక వేళ అలా జరిగితే మనకు షాక్ తగిలే ప్రమాదం ఉంది.

ఈ ప్రమాదం జరగకుండా.. ఉండటానికే 3-పిన్ ప్లగ్ లోని మూడో పిన్ నేరుగా భూమిలోకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఒక వేళ కరెంట్ లీక్ అయితే, ఆ అదనపు కరెంట్ నేరుగా ఎర్త్ పిన్ ద్వారా భూమిలోకి వెళ్లిపోతుంది. దీని వల్ల మనకు ఎలాంటి షాక్ తగలకుండా సేఫ్టీ లభిస్తుంది.

Also Read: 10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

ఎందుకు ఇవి భిన్నంగా ఉంటాయి?

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల సైజు.. డిజైన్ వేర్వేరుగా ఉండటానికి ప్రధాన కారణం వాటి పవర్ కెపాసిటీ, సేఫ్టీ రిక్వైర్మెంట్. 3-పిన్ ప్లగ్‌లోని ఎర్త్ పిన్ పొడవుగా ఉండటానికి ఒక టెక్నికల్ రీసన్ ఉంది. సాకెట్‌లో ప్లగ్ పెట్టేటప్పుడు ఎర్త్ పిన్ అందరికంటే.. ముందే కనెక్ట్ అవుతుంది. బయటికి తీసేటప్పుడు చివరగా డిస్‌కనెక్ట్ అవుతుంది.

ప్లగ్‌లలో ఉండే 2-పిన్, 3-పిన్ తేడాలు కేవలం అందం కోసం కావు, అవి మన ప్రాణాలను కాపాడే ప్లగ్స్‌. హెవీ లోడ్ లేదా మెటల్ బాడీ ఉన్న అప్లయెన్సెస్‌కు ఎప్పుడూ 3-పిన్ ప్లగ్ ఉండేలా చూసుకోవడం మన సేఫ్టీకి ఎంతో ముఖ్యం!

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×