E-Paper
Advertisement

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!
Advertisement

Airtel Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్.. తన కస్టమర్ల కోసం తక్కువ బడ్జెట్ లో ఎన్నో రకాల ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ లో ఫ్రీ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లను అందించే ఎంట్రీ లెవల్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 199 నుండి ప్రారంభమై రూ. 2,249 వరకు అందుబాటులో ఉన్న ఈ అత్యుత్తమ ప్లాన్లు, వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూ. 199, రూ. 219.. నెలవారీ ప్లాన్‌లు

తక్కువ వ్యాలిడిటీ రీఛార్జ్ కోరుకునేవారికి రూ. 199, రూ. 219 ప్లాన్‌లు బెస్ట్. రూ. 199 ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడితీ అన్‌లిమిటెడ్ కాల్స్, 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. మరోవైపు రూ. 219 ప్లాన్‌లో 28 రోజులకు గాను 3GB డేటాతో పాటు మొత్తం 300 ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందుతాయి. ఈ రెండు ప్లాన్‌లలోనూ అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, హలోట్యూన్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ఉచితంగా లభిస్తాయి.

మధ్యకాలిక ప్లాన్స్.. రూ. 469, రూ. 489, రూ. 548

Advertisement

నెల రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునేవారికి ఈ ప్లాన్స్ పర్ఫెక్ట్. రూ. 469 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, 900 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అయితే ఇందులో డేటా లభించదు. డేటా కూడా కావాలనుకునే వారు రూ. 489 లేదా రూ. 548 ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. రూ. 489 ప్లాన్ 77 రోజుల వ్యాలిడిటీతో 6GB డేటా, 600 ఎస్‌ఎం‌ఎస్‌లను ఇస్తుంది. అదే రూ. 548 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 7GB డేటా, 900 ఎస్‌ఎం‌ఎస్‌లను అందిస్తుంది.

Also Read: పేదలకు బంపరాఫర్.. రూ.200కే వజ్రాల గని లీజు.. ఒక్క రోజులో కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

వార్షిక ప్లాన్‌లు.. రూ.1849, రూ.2249

Advertisement

ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే బాధ లేకుండా ఏడాది పొడవునా సేవలు పొందాలనుకునే వారికి రూ. 1849, రూ. 2249 ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ. 1849 ప్లాన్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతీరోజూ 100 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. ఇందులో ఎలాంటి డేటా బెనిఫిట్స్ ఉండవు. మరోవైపు ఏడాది వ్యాలిడిటీలో డేటా కూడా కావాలనుకునే వారికి రూ. 2249 ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది. 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 30GB హై స్పీడ్ డేటా, 3,600 ఎస్‌ఎం‌ఎస్‌లు యూజర్లకు లభిస్తాయి. ఉచిత హలోట్యూన్స్, సేఫ్ నెట్‌వర్క్, అడోబ్ ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే వంటి డిజిటల్ బెనిఫిట్స్ కూడా యూజర్లు పొందొచ్చు.

Also Read: 120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

Tags

Related News

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×