E-Paper
Advertisement

మీ ఇంటి చుట్టూ పాములు తిరుగుతున్నాయా? ఈ 6 పొరపాట్లే కారణమట!

మీ ఇంటి చుట్టూ పాములు తిరుగుతున్నాయా? ఈ 6 పొరపాట్లే కారణమట!
Advertisement

Things that attract snakes to home: మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నప్పటికీ, కొన్నిసార్లు పాములు లోపలికి వస్తుంటాయి. అయితే.. పాములు కేవలం చెత్తాచెదారం ఉన్న చోట మాత్రమే కాదు, మనం ఎంతో అందంగా, అపురూపంగా అమర్చుకునే కొన్ని సాధారణ వస్తువులు, ఇంటి చుట్టూ మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా ఇళ్లను ఆశ్రయిస్తాయి. ఎవరికీ సందేహం రాని ఆ 6 రహస్య కారణాలు ఏంటో, వాటిని ఎలా గుర్తించి మన ప్రాణాలను కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో పాము కనిపిస్తే చాలు, గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. చాలా మంది పాములు ఎక్కడి నుంచో అడవుల నుంచి వస్తాయని అనుకుంటారు. కానీ నిజానికి, మన ఇంటి చుట్టూ లేదా బాల్కనీలో ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకునే కొన్ని అందమైన ఏర్పాట్లే వాటికి నివాసాలుగా మారుతున్నాయి. అవేంటంటే ..

Advertisement

1. బర్డ్ ఫీడర్స్ బర్డ్ బాత్:

పక్షులకు గింజలు వేయడం, నీళ్లు పెట్టడం మంచి పద్ధతే. కానీ కింద పడిన గింజలను తినడానికి ఎలుకలు వస్తాయి. ఆ ఎలుకల వెంటే.. పాములు మీ ఇంటివద్దకు చేరుకుంటాయి. అంతేకాకుండా పక్షుల ఈకలు, గుడ్లు కూడా కొన్ని రకాల పాములను ఇన్‌స్టెంట్‌గా అట్రాక్ట్ చేస్తాయి. అయితే వీటిని ఇంటికి కాస్త దూరంగా ఉంచడం మంచిది.

Advertisement

2. ఓపెన్ కంపోస్ట్ బిన్స్ :

ఇంట్లో మొక్కల కోసం సేంద్రీయ ఎరువును తయారు చేయడానికి కంపోస్ట్ గుంతలు లేదా ఓపెన్ బిన్స్ వాడటం ట్రెండ్ అయ్యింది. ఇలా కుళ్ళిపోయే.. పదార్థాల వల్ల వేడి పుడుతుంది. చలికాలంలో లేదా సాధారణ రోజుల్లో ఈ వెచ్చదనం కోసం పాములు ఆ ప్రాంతాలకు ఇష్టంగా వస్తాయి. దీనికి మార్కెట్లో లభించే సీల్డ్ కంపోస్ట్ బిన్స్‌ను వాడాలి.

3. రాక్ గార్డెన్స్, డెకరేటివ్ స్టోన్స్ :

ఇంటి అందాన్ని పెంచడానికి లాన్ లో లేదా కుండీల చుట్టూరా పెద్ద బండరాళ్లను, అందమైన స్టోన్ అరేంజ్మెంట్స్ ను అమర్చుతుంటాం. వీటి మధ్య ఉండే ఖాళీలు, సందులు పాములకు బెస్ట్ హైడింగ్ స్పాట్స్ (దాక్కునే ప్రదేశాలు) గా మారతాయి. వీటిని ఇంటి గోడలకు ఆనుకోకుండా దూరంగా అమర్చుకోవాలి.

4. నీటి కుంటలు, ప్లాస్టిక్ సాసర్స్ :

కుండీల కింద నీరు నిల్వ ఉండే సాసర్స్, చిన్న చిన్న ఫౌంటెన్లు లేదా కుళాయిల లీకేజ్ వల్ల ఏర్పడే నీటి కుంటలు పాములకు దాహాన్ని తీరుస్తాయి. నీటి కోసం వచ్చే కప్పలు, కీటకాలను తినడానికి పాములు ఆ ప్రాంతాల్లో తిష్ట వేస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

5.ఎలుకలను ఆకర్షించే అనవసర వస్తువులు :

పాములు మనుషుల కోసం రావు, వాటి ఆహారమైన ఎలుకల కోసం వస్తాయి. స్టోర్‌రూమ్‌లో పాత అట్టపెట్టెలు, గోనె సంచులు, ఇంట్లో మూలల్లో పేరుకుపోయిన చెత్త ఎలుకలకు ఆశ్రయం ఇస్తాయి. ఎలుకలు ఉన్నచోటికి పాములు క్షణాల్లో వచ్చేస్తాయి. ఇంటిని చెత్తలేకుండా క్లీన్ గా ఉంచుకోవాలి.

6. దట్టంగా అల్లుకునే తీగ మొక్కలు :

మనీ ప్లాంట్, ఐవీ లేదా ఇతర దట్టమైన తీగలు ఇంటి గోడలపై పాకడం చూడటానికి గ్రీన్‌గా ముచ్చటగా ఉంటుంది. కానీ ఇవి దట్టమైన నీడను ఇచ్చి, పాములు ఎవరి కంటికి కనిపించకుండా ఉండటానికి సేఫ్ కారిడార్‌లా పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు తీగలను కట్ చేస్తూ ఉండాలి.

చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పాముల బారి నుంచి మన ఇంటిని, కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.

Tags

Related News

మిల్లీనియల్స్ పురుషులను ఇష్టపడుతున్న జెన్ Z అమ్మాయిలు.. కారణాలు ఇవే

30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారా? ఈ 5 విషయాలు ముందే చర్చించకపోతే జీవితాంతం పశ్చాత్తాపమే!

45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!

నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

Big Stories

Advertisement
×