E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu : ఛీ.. ఛీ.. యష్మీ కొంచెం కూడా బుద్ది లేదా?

Bigg Boss 8 Telugu : ఛీ.. ఛీ.. యష్మీ కొంచెం కూడా బుద్ది లేదా?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 సీజన్ ఇప్పుడు కొత్తగా ఉంది. హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినా హౌస్ మెట్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. హౌస్‌కి చాలామంది వస్తుంటారు.. పోతుంటారు. కానీ చూడగానే ఛీ.. థూ అనిపించే కంటెస్టెంట్స్ సీజన్‌కి వచ్చి ఒకరిద్దరూ కనిపిస్తూనే ఉంటారు. ఆ బెర్త్‌ని ఈ సీజన్‌లో భర్తీ చేసింది కన్నడ కంత్రీ యష్మీ గౌడ. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిపై అక్కసు కక్కుతుంది. తన నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతూ దారుణంగా మారింది.. ఒక్కమాటలో చెప్పాలంటే దిగ జారిపోతుంది. పర్సనల్ ఎటాక్ చేసి.. దాని వల్ల ఎదుటి వాళ్లు ఏడుస్తుంటే.. కన్నీళ్లతో కుమిలిపోతుంటే.. వాళ్లని చూసి రాక్షస ఆనందం పొందుతుంది. ముఖ్యంగా మణికంఠ విషయంలో మరి దారుణం అనే చెప్పాలి. తాజాగా ఎపిసోడ్ లో ఈమె చేసిన వ్యాఖ్యల పై నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఆదివారం ఎపిసోడ్ తో హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయ్యో పాపం వాళ్లూ తినాలి కదా అని తన తోటి కంటెస్టెంట్స్ జాలి చూపిస్తే.. ఈ కఠినాత్మురాలు మాత్రం.. వాళ్లకి ఫుడ్ పెడితే నేను ఒప్పుకోను. మీరు ఇస్తే ఇవ్వండి కానీ.. నేను మాత్రం నా ఫుడ్‌ని పెట్టను.. నా ఎనర్జీని లాస్ చేసుకోను అంటూ రచ్చ చేసింది. కానీ నామినేషన్స్ టైం లో మాత్రం ఏమి ఎరుగనట్లు మౌనంగా ఉండి కర్ణింగ్ ఆలోచనలకు పదును పెట్టింది. దీంతో మరోసారి ఆమె వంకర బుద్ది బయట పడింది. సాటి ఆడదాని గురించి తన బేవార్స్ బ్యాచ్ దగ్గర నీఛంగా మాట్లాడటం. మెయిన్ ఎపిసోడ్‌లో ఇది లేపేసినా నెటిజన్లు ఈమె నీఛమైన బుద్దిని బయటపెడుతూ ఆ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు.

నిన్నటి ఎపిసోడ్‌లో మార్నింగ్ వేకప్ సాంగ్‌కి ఇరగదీసి డాన్స్ చేసింది. కుర్చీ మడతపెట్టి అంటూ రాయల్ టీం అంతా దుమ్ము దులిపేశారు. ప్రతి రోజూ బిగ్ బాస్ సాంగ్ వేసినా కూడా.. నిద్రలో నుంచి లేచేవారు కాదు. కానీ నిన్నటి ఎపిసోడ్‌లో రాయల్ టీం వాళ్లు వేకప్ సాంగ్‌కి డాన్స్ చేసి బిగ్ బాస్ హౌస్‌ని షేక్ చేశారు. ముఖ్యంగా నయని పావని అయితే.. ఉదయాన్నే లేచి నీట్‌గా చీర కట్టుకుని.. మంచిగా రెడీ అయ్యి ఈ నిద్రమొహాలన్నీ కుళ్లుకుని చచ్చేట్టుగా రెడీ అయ్యింది.అది చూసి ఓర్వలేక పోయిన యష్మీ తన మనసులోని మాటలను బయట పెట్టింది. పృథ్వీతో కలిసి నయని పావని ఫేస్ గురించి ఆమె మేకప్ గురించి నీఛంగా మాట్లాడింది యష్మీ గౌడ. ఆమె మేకప్ లేకుండా ఛండాలంగా ఉండే పేస్ ను చూడలేము అని కామెంట్స్ చేసింది. ఎవర్ని మేకప్ లేకుండా చూడలేమో.. సిగ్గుండాలి.. ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటానికి? అంటూ ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇస్తున్నారు.. మొత్తానికి యష్మీ పై నెటిజన్లు సిగ్గు లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×