E-Paper
Advertisement

Gold Price Today : అమ్మబాబోయ్ ! బంగారం రూ.65 వేలు దాటేసింది.. తులం రేటు ఎంతంటే..

Gold Price Today : అమ్మబాబోయ్ ! బంగారం రూ.65 వేలు దాటేసింది.. తులం రేటు ఎంతంటే..
Advertisement

Gold and Silver Prices Today : పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఇదే సమయంలో వరుసగా పండుగలు వస్తున్నాయి. హోలీ, ఉగాది, శ్రీరామనవమి పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. పండుగలకు కొన్నా కొనకపోయినా.. పెళ్లిళ్లు, ఫంక్షన్లుంటే.. తులం బంగారమైనా కొనాల్సిందే. వీటితో పాటు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

Advertisement

శుక్రవారం ఉదయం 10 గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో 22, 24, 18 క్యారెట్ల బంగారం ధరలతో పాటు కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాముకు 15 రూపాయలు పెరిగి 6,025 గా ఉంది. 8 గ్రాములకు 120 రూపాయలు పెరిగి రూ.48,200గా, 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగి రూ.60,250గా, 100 గ్రాములకు 1500 రూపాయలు పెరిగి రూ.6,02,500 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Read More : మహిళలకు మోదీ ఉమెన్స్ డే గిఫ్ట్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

అలాగే.. 24 క్యారెట్ల బంగారం 1 గ్రాముకు 17 రూపాయలు పెరిగింది. ఈరోజు మార్కెట్లో 1 గ్రాము బంగారం ధర రూ.6,573గా ఉంది. 8 గ్రాముల బంగారంపై 136 రూపాయలు పెరిగి రూ.52,584గా ఉండగా.. 10 గ్రాముల బంగారంపై 170 రూపాయలు పెరిగి రూ.65,730 వద్ద కొనసాగుతోంది. 100 గ్రాముల బంగారంపై 1700 రూపాయలు పెరిగి రూ.6,57,300 వద్ద ఉంది.

18 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 1 గ్రాము బంగారంపై రూ.12 పెరిగి.. రూ.4,929 వద్ద కొనసాగుతోంది. 8 గ్రాములపై 96 రూపాయలు పెరిగి రూ.39,432, 10 గ్రాములపై 120 రూపాయలు పెరిగి రూ.49,290, 100 గ్రాములపై రూ.1200 పెరిగి రూ.4,92,900 వద్ద ఉంది.

ఇక కిలో వెండి ధరపై రూ.500 పెరగడంతో రూ.79,000వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,730కు చేరుకుంది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,880కు పెరిగింది.

ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,250గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,730గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600కు ఎగబాకింది.

 

 

 

Related News

పుత్తడి ప్రియులకు షాక్.. అమాంతంగా పెరిగిన ధర, నేడు మార్కెట్లో ధరలు ఇవే

ఐఫోన్ 18 ప్రో తక్కువ ధరలో కావాలా? ఈ దేశాల్లో కొంటే ఇండియా కంటే చీప్

పిఎఫ్ సెటిల్మెంట్ ఆలస్యం చేస్తే వడ్డీ తప్పదా? EPFO కేసులో మండిపడిన కోర్టు

SBI తప్పిదం.. రోజుకు రూ.5 వేలు చెల్లించాలన్న కోర్టు, ఇలా మీకూ జరిగిందా?

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

ఫోన్, కారు కంటే ఇల్లు ముఖ్యం? ఆర్థికపరంగా భారతీయుల ఆలోచనల్లో మార్పు

నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే

Big Stories

Advertisement
×