E-Paper
Advertisement

పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం.. పూర్తిగా నుజ్జైన వాహనం, హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం

పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం.. పూర్తిగా నుజ్జైన వాహనం, హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం
Advertisement

Hyderabad City: అతివేగం ప్రమాదకరం అని పదేపదే పోలీసులు మైకులతో చెప్పినా వాహనదారులు ఏమాత్రం పట్టించుకోలేదు. వేగంగా వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురవుతున్నాయి. సరిగ్గా అలాంటి ఘటన హైదరాబాద్ సిటీలో చోటు చేసుకుంది. కారు బోల్తాపడడమే కాదు.. చివరకు నుజ్జునుజ్జు అయ్యింది.

హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బీభత్సం

మెహిదీపట్నం నుంచి రాజేంద్రనగర్‌కు వెళ్లే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా పిల్లర్ నంబర్ 170 వద్ద ఈ ఘటన జరిగింది. ఫ్లైఓవర్‌పై వాహనాలు వేగంగా వెళ్తుండగా ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసిన కియా కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీ కొట్టింది. స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.

Advertisement

ఫలితంగా కియా కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో కియా కారు డ్రైవర్ ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలైన ఆయన్ని కారు నుంచి బయటకు తీశారు వాహనదారులు. వాహనం రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులతో కలిసి కారును సైడుకు తొలగించారు.

సడన్ బ్రేక్‌తో పల్టీలు కొట్టిన కారు నుజ్జైంది

ఆ తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేశారు. దాదాపు గంటసేపు పైగానే వాహనాలు నిలిచిపోయాయి.  మరొక కారు కుడివైపు బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయ్యింది. మరొక కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. వాహనంలోని వ్యక్తులు ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అనేది ఇంకా తెలియాల్సివుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

ALSO READ: గోడకి కన్నం వేసి.. జ్యూవెలరీ షాపునే దోచేశారు, మేడ్చల్‌లో కలకలం

 

Related News

గోడకి కన్నం వేసి.. జ్యూవెలరీ షాపునే దోచేశారు, మేడ్చల్‌లో కలకలం

గల్లీలో కేడీ.. ఢిల్లీలో మోదీ.. ఎవరినైనా తొక్కుకుంటూ పోతా!- రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌పై కాలుష్య పంజా.. దీపావళితో భారీగా పడిపోయిన గాలి నాణ్యత!

హైదరాబాద్‌లో కలకలం.. లోన్‌ యాప్‌ వేధింపులతో కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రేమ నిరాకరించడంతో యువతి ఇంట్లో.. ప్రియుడు ఏం చేశాడంటే, వనస్థలిపురంలో దారుణం

తెలంగాణకు వణికిస్తున్న శీతల గాలులు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, 29 జిల్లాలకు అలర్ట్‌

తెలంగాణలో జనగణనకు షెడ్యూల్ ఖరారు.. ముఖ్య తేదీలు ఇవే..?

Big Stories

Advertisement
×