BigTV English

Hyundai Creta: హాట్ కేకుల్లా అమ్ముడైన హ్యుందాయ్​ క్రెటా కార్లు.. 6 నెలల్లో 1 లక్ష సేల్స్.. సేఫ్టీ ఫీచర్లు హైలైట్..!

Hyundai Creta: హాట్ కేకుల్లా అమ్ముడైన హ్యుందాయ్​ క్రెటా కార్లు.. 6 నెలల్లో 1 లక్ష సేల్స్.. సేఫ్టీ ఫీచర్లు హైలైట్..!

2024 Hyundai Creta: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్యూవీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం ఎస్యూవీలపైనే ఫోకస్ పెడుతున్నాయి. అదే క్రమంలో కొత్త కొత్త ఎస్యూవీలను లాంచ్ చేస్తూ అదరగొడుతున్నాయి. అందులో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ ఒకటి. ఈ కంపెనీ కొత్త కొత్త కార్లను వాహన ప్రియులకు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. సేఫ్టీ ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో వచ్చి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ కంపెనీ నుంచి ఈ ఏడాది రిలీజ్ అయిన ఒక ఎస్యూవీ సేల్స్‌లో దుమ్ము దులిపేసింది. దీంతో హ్యుందాయ్ కంపెనీ పేరు మరింత మారుమోగిపోతుంది. ఆ కారేంటో, దాని స్పెసిఫికేషన్లు, ధర విషయాలు తెలుసుకుందాం.


హ్యుందాయ్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో 2024 హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీని లాంచ్ చేసింది. అయితే ఈ కొత్త ఎస్యూవీ లాంచ్ అయిన నుంచి సేల్స్‌లో దుమ్ము దులిపేస్తుంది. కేవలం 6 నెలల్లోనే 1 లక్ష యూనిట్ల సేల్స్ మైలురాయిని టచ్ చేసి అబ్బురపరచింది. దీని ప్రకారం చూస్తే రోజుకు 550 క్రెటా ఎస్యూవీలు సేల్ అవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఈ సేల్స్ బట్టి హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీకి దేశీయ మార్కెట్‌లో ఎంతటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read: ప్రత్యేకంగా పండుగ సీజన్.. హ్యుందాయ్ రెండు కొత్త కార్లు.. రేంజ్ చూస్తే షాక్ అవుతారు!


ఇంజిన్

2024 హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు ఇంజిన్‌లు 1.5 లీటర్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందులో నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్‌ వంటి ఆప్షన్‌లు ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు

2024 హ్యుందాయ్ క్రెటాలో సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ఏడీఏఎస్, బ్లైండ్ వ్యూ మానిటర్, ఆటో హూల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హూల్డ్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ ఎస్యూవీలో అందించారు. ఇక దీని ధర, వేరియంట్ల విషయానికొస్తే.. 2024 హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీ రూ.13.24 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. గరిష్టంగా రూ.24.37 లక్షల ఎక్స్ షోరూమ్ ధరను కలిగి ఉంది. కాగా ఈ కొత్త ఎస్యూవీ మొత్తం ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్(ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్(ఓ) ఆప్షన్‌లు ఉన్నాయి.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×