BigTV English
Advertisement

Maruthi Nagar Subramanyam Trailer: ట్రైలర్ వచ్చేసింది.. నవ్వులే నవ్వుల్.. రావు రమేషా మజాకా..

Maruthi Nagar Subramanyam Trailer: ట్రైలర్ వచ్చేసింది.. నవ్వులే నవ్వుల్.. రావు రమేషా మజాకా..

Maruthi Nagar Subramanyam Trailer: టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్.. ఈ యాక్టర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినిమా ఏదైనా అందులో నటించే పాత్రలో జీవించే గుణం ఆయనది. హీరో తండ్రిగా లేదా హీరోయిన్ తండ్రిగా, విలన్‌గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించి అదరగొట్టేస్తాడు. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర చేస్తూ సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న రావు రమేష్ ఇప్పుడు ఏకంగా హీరోగా ప్రమోషన్ కొట్టేశాడు.


రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై రూపొందుతోన్న ఈ సినిమాను బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా బాధ్యతలు తీసుకున్నారు. అలాగే ఈ మూవీలో రావు రమేష్ సరసన ఇంద్రజ నటిస్తుంది.

Also Read: మాస్ జాతర.. టీజర్ ఏముంది గురూ.. మాస్ మహారాజ అల్లాడించాడుగా


వీరితో పాటు అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ వంటి నటీ నటులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 23న అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు మరో అప్డేట్‌తో వచ్చారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇందులో ఉన్న కామెడీ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. రావు రమేష్ తన నటనా ప్రతిభతో నవ్వులు పూయించేశాడు. మంచి కామెడీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నవారి కోసం ఈ సినిమా వచ్చేస్తుంది. ఇందులో ఉండే కంటెంట్ ఒక ఎత్తయితే.. రావు రమేష్ యాక్టింగ్ మరో ఎత్తనే చెప్పాలి. డైలాగ్ డెలవరీతో అదరగొట్టేశాడు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×