Lakdikapul Traffic: హైదరాబాద్ సిటీలో ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పరిస్థితి. దీన్ని కంట్రోల్ చేయాలని పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రిటైర్ బ్యాంక్ ఉద్యోగి పక్కా వేసిన స్కెచ్ అధికారులకు కనెక్ట్ అయ్యింది. ట్రయిల్ రన్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో వన్ వే అమల్లోకి రానుంది.
హైదరాబాద్ సిటీలోని కీలకమైన ప్రాంతాల్లో భయంకరంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అక్కడే వాహనదారులు గంటలకొద్దీ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పొల్యూషన్, సౌండ్ హారన్లు మోత మోగిస్తున్నాయి. ఈ క్రమంలో కేబీఆర్ పార్కు చుట్టూ తీసుకొచ్చిన వన్ వే వ్యవస్థ మంచి ఫలితాలు ఇచ్చింది. దీంతో అధికారులు లక్డీకాపూల్ ప్రాంతంపై ఫోకస్ చేశారు. 73 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి పాలకోదేటి చంద్రశేఖర్ చేతితో గీసిన స్కెచ్ లక్డీకాపూల్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ లూప్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారు.
ఇప్పుడు దాన్ని పరిశీలన చేస్తున్నారు. ఏడాది కిందట ఈ-మెయిల్ సూచనతో మొదలైంది. ఈ విషయాన్ని ట్రాఫిక్ సీనియర్ పోలీసు అధికారుల తనిఖీల వరకు వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో ఇలాంటి ఏర్పాట్ల కోసం ట్రాఫిక్ పోలీసు విభాగం అన్వేషణ చేస్తోంది. రద్దీగా ఉండే లక్డీకాపూల్ ప్రాంతంలో వాహనాల రాకపోకలను పునర్వ్యవస్థీకరించడానికి మాజీ ఉద్యోగి చంద్రశేఖర్ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు సూచన పంపారు. దీనిపై స్పందించిన అధికారులు పోలీస్ కమిషనరేట్‌కు ఆహ్వానించారు.
ఆయన ఆలోచనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గీసిన రూట్ మ్యాప్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తాను పోలీసు కాదని, ఇంజనీరు అంతకంటే కాదన్నారు. తనకు తెలిసినంతలో రూటు మ్యాప్ గీసి ఇచ్చానని తెలిపారు. లక్డీకాపూల్, సచివాలయ రోడ్డు, రవీంద్ర భారతి, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లను కలుపుతూ ప్రతిపాదించారు. ఈ మార్గంలో ద్వారకా హోటల్, ఎల్ఐసి భవనం, అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్స్, డీజీపీ కార్యాలయం వంటి ముఖ్య ప్రదేశాలు గుర్తించారు.
ALSO READ: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్లకు బ్రేక్! అసలేం జరిగింది?
క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించేందుకు కమిషనర్ సజ్జనార్‌తోపాటు పలువురు అధికారులు బైక్‌పై ఆ ప్రాంతంలో పర్యటించారు. ద్వారకా హోటల్ మొదలు పాత సైఫాబాద్ పీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్ చౌరస్తా, ఓల్డ్ కంట్రోల్ రూమ్ జంక్షన్ పరిధిలోని రహదారుల స్థితిగతులు, వాహనాల రద్దీని పరిశీలించారు. వన్ వే వల్ల వాహనదారులు అదనపు దూరం ప్రయాణించాల్సి వచ్చినా ప్రయాణం సజావుగా సాగుతుందన్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రవేశపెట్టిన వన్ వే సిస్టమ్‌కు మాంచి స్పందన వచ్చిందని, హారన్ల మోత గణనీయంగా తగ్గిందన్నారు. ఇదే కాకుండా సైబరాబాద్‌లోని బయోడైవర్సిటీ జంక్షన్, ఐకియా, మైండ్‌స్పేస్ రోటరీ, టైమ్స్ స్క్వేర్ రోడ్, నాలెడ్జ్ సిటీ, క్వాల్ కామ్, డల్లాస్ సెంటర్ రోడ్, మై హోమ్ భూజాలను కలిపేందుకు ప్రత్యేక లూప్‌ను అధికారులు పరిశీలన చేస్తున్నారు.