E-Paper
Advertisement

అప్పులతో అల్లాడుతున్నారా ? 50:30:20 గోల్డెన్ రూల్ తో లైఫ్ బిందాస్

అప్పులతో అల్లాడుతున్నారా ? 50:30:20 గోల్డెన్ రూల్ తో లైఫ్ బిందాస్
Advertisement

Savings Tips: నెల జీతం ఎంత వస్తుందన్నది మాత్రమే ముఖ్యం కాదు.. ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నామన్నదే మన ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది. కొంతమంది భారీ జీతాలు సంపాదిస్తున్నప్పటికీ నెలాఖరుకు చేతిలో రూపాయి కూడా మిగలని పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. మరికొందరు తక్కువ ఆదాయంతోనే ఫ్యామిలీ అవసరాలను తీర్చుకుంటూ, భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయగలుగుతారు. దీనికి కారణం డబ్బును ఉపయోగించుకునే విధానమే. ప్రతి నెలా వచ్చే జీతాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని ఖర్చు చేస్తే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు మంచి మొత్తాన్ని కూడా ఆదా చేయవచ్చు. అయితే నెల జీతాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇంటి ఖర్చులు, సరదాలు, భవిష్యత్తు అవసరాల కోసం ఎంత మొత్తం కేటాయించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆర్థిక నిపుణులు సూచించే బడ్జెట్ విధానమే 50:30:20 ఫార్ములా. ఈ పద్ధతిలో మీ నెల జీతాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. అలా చేస్తే ఖర్చులకు ఇబ్బంది లేకుండా పొదుపు కూడా కొనసాగించవచ్చు.

50:30:20 ఫార్ములా అంటే ఏమిటి?

ఈ బడ్జెట్ ప్రకారం మీ చేతికి వచ్చే జీతాన్ని 100 శాతంగా పరిగణించాలి. అందులో 50 శాతాన్ని తప్పనిసరి అవసరాలకు, 30 శాతాన్ని మీ పర్సనల్ ఖర్చులకు, మిగిలిన 20 శాతాన్ని పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. అంటే జీతం వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ఖర్చు చేయకుండా ముందుగానే ఈ మూడు విభాగాలుగా డబ్బును పంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కో విభాగంలో ఎంత ఖర్చు చేయాలో చూద్దాం.

తప్పనిసరి అవసరాలకు 50 శాతం

Advertisement

మీ నెల జీతంలో సగం మొత్తాన్ని తప్పనిసరి ఖర్చుల కోసం కేటాయించాలి. ఇంటి అద్దె, నిత్యావసర సరుకులు, విద్యుత్, నీటి బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు, హెల్త్ ఖర్చులు, బీమా ప్రీమియంలు, అవసరమైన రుణాల ఈఎంఐలు వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఇవి తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులు కాబట్టి వీటికి ముందుగానే బడ్జెట్ కేటాయించుకోవడం మంచిది.

సరదాలు, అభిరుచుల కోసం 30 శాతం

జీవితంలో అవసరాలే కాదు.. మనకు నచ్చిన పనుల కోసం కూడా కొంత డబ్బు ఖర్చు చేయాలి. అందుకే జీతంలో 30 శాతాన్ని వ్యక్తిగత సరదాలు, అభిరుచుల కోసం ఉపయోగించుకోవచ్చు. సినిమాలకు వెళ్లడం, రెస్టారెంట్లలో భోజనం చేయడం, విహారయాత్రలు, కొత్త బట్టలు, గ్యాడ్జెట్లు కొనడం, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవడం వంటి ఖర్చులు ఈ విభాగంలోకి వస్తాయి. అయితే ఈ మొత్తాన్ని దాటకుండా చూసుకోవడం ముఖ్యం.

పొదుపు, పెట్టుబడులకు 20 శాతం

Advertisement

ఇక మిగిలిన 20 శాతం మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పక్కన పెట్టాలి. ఈ డబ్బును బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ, స్టాక్స్, బాండ్లు, బంగారం వంటి మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు రిస్క్, రాబడి పరిశీలించడం అవసరం. ఇలా ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు చేస్తే కొన్నేళ్లకు మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. పిల్లల చదువులు, పెళ్లి, సొంత ఇల్లు, కారు కొనుగోలు వంటి పెద్ద లక్ష్యాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది.

ఈ ఫార్ములాతో ప్రయోజనాలేంటి?

50:30:20 బడ్జెట్ విధానాన్ని పాటించడం వల్ల ఆదాయం, ఖర్చులపై స్పష్టమైన అవగాహన వస్తుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం అలవాటవుతుంది. ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేయడం వల్ల ఇది ఒక మంచి అలవాటుగా మారుతుంది. అంతేకాకుండా అప్పులు, ఈఎంఐలు సరైన దారిలో వెళ్లేందుకు కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే ప్రతి ఒక్కరి ఆదాయం, కుటుంబ బాధ్యతలు ఒకేలా ఉండవు. కాబట్టి అవసరాన్ని బట్టి ఈ నిష్పత్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏది ఏమైనా జీతం ఎంత వచ్చినా కొంత మొత్తాన్ని పొదుపు చేయాలనే అలవాటు చేసుకోవడమే ఈ ఫార్ములా వెనుక ఉన్న అసలైన ఉద్దేశం.

Read Also: 4 లక్షలకు కొంటే నేడు 3200 కోట్ల సామ్రాజ్యం… భారత్ మార్కెట్ ను శాసిస్తున్న బిస్లరీ అసలు కథ ఇదే

Related News

4 లక్షలకు కొంటే నేడు 3200 కోట్ల సామ్రాజ్యం… భారత్ మార్కెట్ ను శాసిస్తున్న బిస్లరీ అసలు కథ ఇదే

పెళ్లి, సాఫ్ట్ వేర్ జాబ్ వద్దు.. డెలివరీ బాయ్ పనే ముద్దు.. ‘జెన్ జీ’ యువత నయా ట్రెండ్!

బంగారం ధరలు ఢమాల్.. రూ.లక్షకు పడిపోయే ఛాన్స్.. మరి ఇప్పుడే కొనాలా? ఇంకాస్త ఆగాలా?

పెట్టుబడుల్లో మహిళల జోరు.. మ్యూచువల్ ఫండ్స్‌, ఈక్విటీల్లో పెరుగుతున్న వాటా

బ్యాంకులో ఆ విషయం చెబితే చాలు.. పొదుపు ఖాతాపై మూడు రెట్ల వడ్డీ, అదెలా సాధ్యం?

టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ, ట్రంప్‌కు కాసుల పంట

10 ఏళ్లలోనే కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి… ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?

Big Stories

Advertisement
×