E-Paper
Advertisement

పెట్టుబడుల్లో మహిళల జోరు.. మ్యూచువల్ ఫండ్స్‌, ఈక్విటీల్లో పెరుగుతున్న వాటా

పెట్టుబడుల్లో మహిళల జోరు..  మ్యూచువల్ ఫండ్స్‌, ఈక్విటీల్లో పెరుగుతున్న వాటా
Advertisement

Women Investment: కరోనా వచ్చిన తర్వాత మహిళలు అన్ని చోట్లా తమ ఉనికిని చాటుతున్నారు. కేవలం ఉద్యోగాల్లోనే కాదు, పొదుపు విభాగంలో వారి వాటా క్రమంగా పెరుగుతూ పోతోంది. గడిచిన ఐదేళ్లుగా మహిళలు బంగారం, నగదు పెట్టుబడులను దాటి మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ వైపు మళ్లినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

పెట్టుబడుల్లో మహిళల జోరు

దేశంలో మాగ్జిమమ్ మహిళలు పొదుపును ప్రొత్సహిస్తుంటారు. వారికి తోచిన విధంగా పొదుపు చేయడం మొదలుపెడతారు. తక్కువ రిస్క్ బ్యాంకు డిపాజిట్లు అయినా, అధిక రిస్క్ ఉన్న ఈక్విటీ ఫండ్స్ అయినా అన్ని చోట్లా తమ ఉనికిని చాటుకున్నారు. బంగారం, నగదు పెట్టుబడులను దాటి మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లారు మహిళలు.

Advertisement

AMFI-CRISIL నివేదిక ప్రకారం.. మార్చి 2021 నుండి మార్చి 2026 మధ్య వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ ఆస్తులలో మహిళల వాటా 32.6 శాతం నుంచి 34.5 శాతానికి పెరిగింది. పురుషుల వాటా 59.1 శాతానికి పడిపోయింది. మార్చి 2026 నాటికి మహిళలు బ్యాంకు డిపాజిట్లలో రూ. 55 లక్షల కోట్లు, మ్యూచువల్ ఫండ్లలో రూ. 16 లక్షల కోట్లు కలిగి ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌, ఈక్విటీల్లో పెరుగుతున్న వాటా

ఆర్‌బిఐ డేటా ప్రకారం.. బ్యాంకు ఖాతాలు కలిగిన మహిళల వాటా మార్చి 2019 లో 33 శాతం ఉండేది. మార్చి 2026 నాటికి 41 శాతానికి పెరిగింది. మహిళల ఎస్‌ఐపి ఆస్తులు ఐదేళ్లలో 30 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ. 4.73 లక్షల కోట్లకు పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే పొదుపు పెట్టుబడుల విషయంలో క్రమంగా పురుషులను అధిగమిస్తున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.

Advertisement

మార్చి 2026 నాటికి మ్యూచువల్ ఫండ్స్‌ పెట్టుబడుల్లో మహిళలు వాటా 26.4 శాతంగా ఉంది. మొత్తం ఆస్తులలో వారి వాటా 34.5 శాతం. పురుషుల కంటే మహిళల సగటు పెట్టుబడి పరిమాణం పెద్దదిగా ఉందని డేటా చెబుతోంది. వీటిలో ఉద్యోగం చేసే మహిళలదే అగ్రస్థానంగా ఉంది.

ALSO READ: టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ, ట్రంప్‌కు కాసుల పంట

CAMS నివేదిక ప్రకారం.. మహిళా పెట్టుబడిదారులలో 47 శాతం మంది ఉద్యోగస్తులు ఉండగా, 22 శాతం మంది గృహిణులు ఉన్నారు. మరో 7 శాతం మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరిలో 75 శాతం మంది 50 ఏళ్లలోపు వారే. ఈక్విటీ లేదా షేర్ మార్కెట్లలో మహిళల వాటా 49 శాతం నుండి 64 శాతానికి పెరిగింది. డెట్ ఫండ్ల వాటా 8 శాతానికి తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి.

Related News

బంగారం ధరలు ఢమాల్.. రూ.లక్షకు పడిపోయే ఛాన్స్.. మరి ఇప్పుడే కొనాలా? ఇంకాస్త ఆగాలా?

బ్యాంకులో ఆ విషయం చెబితే చాలు.. పొదుపు ఖాతాపై మూడు రెట్ల వడ్డీ, అదెలా సాధ్యం?

టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ, ట్రంప్‌కు కాసుల పంట

10 ఏళ్లలోనే కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి… ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?

బ్యాంకు FDలకు గుడ్ బై చెప్పండి.. నెలకు 3,000 SIPతో 40 లక్షలు అయ్యే ఫినాన్స్ మంత్ర

PPF vs SIP vs SSY… 3000లతో 15 లక్షల సంపాదన… పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ?

8.20 శాతం వడ్డీ రేటు… ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఇచ్చే ఈ 7 పథకాల గురించి తెలుసా ?

Big Stories

Advertisement
×