E-Paper
Advertisement

టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ! ట్రంప్ ఒత్తిడితో బోర్డు..

టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ! ట్రంప్ ఒత్తిడితో బోర్డు..
Advertisement

Nvidia: ఏం చెయ్యాలన్నా అమెరికాకే చెల్లుతుంది.. అదే చేసింది.. చేస్తోంది కూడా. ఎన్విడియా కంపెనీ సీఈఓగా జెన్సన్‌ హువాంగ్‌ రీఎంట్రీ ఇచ్చారు. ఆయన నియామకానికి కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ కంపెనీ స్టాక్ సుమారు 30 శాతం పైగానే పెరిగింది. జెన్సన్ రీఎంట్రీ వెనుక అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి ఉందని అమెరికా మీడియో కోడై కూస్తోంది.

ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ

అమెరికా చిప్‌ తయారీ కంపెనీ ఎన్విడియా సీఈఓగా జెన్సన్‌ హువాంగ్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. జెన్సన్ పునర్ నియామకానికి ఎన్వీడియా కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన బాధ్యతలు చేపట్టడం కూడా జరిగిపోయింది. కేవలం 11 రోజులు తిరగక ముందే సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్లు తారాజువ్వ మాదిరిగా దూసుకెళ్లాయి. ప్రీ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు 30 శాతానికి పెరుగుదల నమోదు చేసింది.

Advertisement

సీఈఓగా జెన్సన్‌ హువాంగ్‌ తిరిగి నియామకంపై ఎన్వీడియా ఛైర్మన్ హార్వే సి జోన్స్ రియాక్ట్ అయ్యారు. ఎన్విడియాకు నాయకత్వం వహించడానికి జెన్సన్‌ సరైన వ్యక్తి అని ప్రస్తావించారు. వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాముల ప్రయోజనార్థం పున్నరియామకం అవసరమని బోర్డు భావిస్తోందని తెలిపారు. జెన్సెన్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని, తాత్కాలిక సీఈఓగా సేవలందించిన కోలెట్ క్రెస్‌కు బోర్డు కృతజ్ఞతలు తెలిపింది.

హువాంగ్ రీఎంట్రీతో ట్రంప్‌కు కాసుల పంట

ఎన్విడియా జెన్సన్ హువాంగ్‌ను సీఈఓగా తిరిగి నియమించేలా తాను వ్యక్తిగతంగా ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాను బోర్డు సభ్యులతో మాట్లాడినట్టు తెలిపారు. ఆయన నియామకం జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని వారికి హామీ ఇచ్చానని వెల్లడించారు. జెన్సన్ తిరిగి సీఈఓగా వస్తున్నట్లు ఎన్విడియా ప్రకటించిన కొద్దిసేపటికే ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్విడియా బోర్డును సంప్రదించారా అన్న ప్రశ్నకు.. నేను వారితో మాట్లాడి ఒప్పించానని వివరించారు.

Advertisement

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించారనే వార్తతో ఆ కంపెనీ షేర్లు ధర ఆకాశాన్ని తాకాగాయ. ఫలితంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఉన్న ఎన్విడియా స్టాక్‌ల విలువ 15 మిలియన్ డాలర్ల వరకు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు సమర్పించిన ఆర్థిక పత్రాల మేరకు.. సెప్టెంబర్ 30 నాటికి ఎన్విడియాలో ట్రంప్‌కు 3,70,000 షేర్ల వరకు కలిగి ఉండవచ్చని సమాచారం. జెన్సన్ తప్పుకున్న తర్వాత ఎన్వీడియా కంపెనీ షేర్లు తీవ్రంగా పడిపోయిన విషయం తెల్సిందే.

ALSO READ: 10 ఏళ్లలోనే కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి… ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?

 

Related News

10 ఏళ్లలోనే కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి… ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?

బ్యాంకు FDలకు గుడ్ బై చెప్పండి.. నెలకు 3,000 SIPతో 40 లక్షలు అయ్యే ఫినాన్స్ మంత్ర

PPF vs SIP vs SSY… 3000లతో 15 లక్షల సంపాదన… పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ?

8.20 శాతం వడ్డీ రేటు… ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఇచ్చే ఈ 7 పథకాల గురించి తెలుసా ?

20 ఏళ్ల పాటు ప్రతి నెలా 30000 విత్‌డ్రా చేసినా అకౌంట్లో 75 లక్షలు… PF ఉన్నోళ్ళకే ఈ గోల్డెన్ ఛాన్స్

కోకాపేట, నార్సింగిలో ఖాళీగా ఖరీదైన ఫ్లాట్లు.. దిగొస్తున్న బిల్డర్లు, ఇళ్లు కొనేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

బ్లింకిట్ డెలివరీ బాయ్ సక్సెస్ స్టోరీ.. మొదటి నెలలోనే రూ. 39 వేల సంపాదన..!

Big Stories

Advertisement
×