E-Paper
Advertisement

బ్యాంకులో ఆ విషయం చెబితే చాలు.. పొదుపు ఖాతాపై మూడు రెట్ల వడ్డీ, అదెలా సాధ్యం?

బ్యాంకులో ఆ విషయం చెబితే చాలు.. పొదుపు ఖాతాపై మూడు రెట్ల వడ్డీ, అదెలా సాధ్యం?
Advertisement

Banks: ఖాతాదారులకు బ్యాంకులకు సంబంధించి చాలా విషయాలు తెలియవు. కనీసం వారు చెప్పే ప్రయత్నం చేయరు. ఎవరైనా అడిగితే ఆ తరహా సిస్టమ్ మా దగ్గర ఉందని చెబుతారు. బ్యాంకు ఖాతా తెరవడానికి చాలా పత్రాలు ఉండాలి. ఖాతాను తెరిచినప్పుడు మీకు డెబిట్ కార్డు జారీ చేస్తారు. పొదుపు ఖాతాతో లభించే అనేక ప్రయోజనాలను ఏ ఒక్క బ్యాంకు ఉద్యోగులు వివరించే ప్రయత్నం చేయరు.

పొదుపు ఖాతాపై మూడు రెట్ల వడ్డీ

సాధారణంగా కస్టమర్ల డిపాజిట్లపై 2.5 లేదా 3 శాతం వడ్డీ ఇస్తుంటాయి బ్యాంకులు. దానికి మూడు రెట్లు వడ్డీ సాధించవచ్చు. కస్లమర్లు బ్యాంకుకు వెళ్లి వారికి ఓ విషయం చెప్పాలి. చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు 7 నుంచి 8 శాతం వరకు వడ్డీ ఇస్తుంటాయి. అధిక వడ్డీ రేట్లతో కొందర్ని ఆకర్షిస్తారు. సేవింగ్స్ ఖాతాపై FD తరహా వడ్డీని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? బ్యాంక్‌లో ఆటో స్వీప్ సర్వీస్ అంతే బాగా పని చేస్తుంది.

Advertisement

వినియోగదారులు బ్యాంకుకు వెళ్లినప్పుడు ఆటో స్వీప్ సర్వీస్‌ను ప్రారంభించమని అడగాలి. బ్యాంక్ ఆటో స్వీప్ సేవ ఎలా పని చేస్తుంది? ఖాతాదారుడు FD లాంటి ప్రయోజనాలను ఎలా పొందాలి? దాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సర్వీసు పని చేసే విధానాన్ని తెలుసుకోవాలి. దాన్ని ఎనేబుల్ చేస్తే ఖాతాదారుడు మిగులు నిధులపై అధిక వడ్డీని పొందుతాడు. సేవింగ్స్ ఖాతాలో ఉన్న ఆటో స్వీప్ సేవను ఎనేబుల్ చేయవచ్చు.

బ్యాంకులో ఆ విషయం చెబితే చాలు

దీని ద్వారా సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలో బ్యాలెన్స్ స్వీప్ పరిమితిని మించినప్పుడు ఆటో స్వీప్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల పొదుపు ఖాతాకు వర్తించే వడ్డీకి బదులుగా బ్యాంక్ FD వడ్డీ ప్రయోజనాన్ని పొందుతాయి. బ్యాంక్ ఖాతాలో ఆటో స్వీప్ సేవ కోసం కొంత నిధులు ఉండాలి. రూ. 30 వేలు పరిమితిని నిర్దేశించుకుని మీ డిపాజిట్ రూ. 90 వేలు ఉంటే పరిమితికి మించిన మొత్తం కంటే అదనంగా ఉన్న రూ. 60 వేలు ఆ బ్యాంకులో ఉన్నట్లే.

Advertisement

మిగిలిన రూ. 60 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇస్తున్నట్టు సమానంగా వడ్డీగా మార్చి దాన్ని FDగా మార్చుస్తారు. అదే సమయంలో రూ. 30 వేలు డిపాజిట్ సేవింగ్స్ ఖాతా ప్రకారం వడ్డీని సంపాదించవచ్చు. ఆటో స్వీప్ సర్వీస్ ఫీచర్ యాక్టివేట్ చేసిన వెంటనే మిగులు నిధులపై మూడు రెట్ల వరకు వడ్డీని పొందుతారు, FD గా మార్చిన పొదుపు ఖాతా నుండి ఎప్పుడైనా నిధులు విత్‌డ్రా చేసుకోవచ్చు. FD పథకంలా వడ్డీని సంపాదించినప్పటికీ మెచ్యూరిటీ వరకు విత్‌డ్రా చేసుకోలేమనే పరిమితి లేదు.

ALSO READ: టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ, ట్రంప్‌కు కాసుల పంట

బ్యాంకు ఖాతాలో డిపాజిట్లపై భారీ వడ్డీని సంపాదించడం ద్వారా ఈ సర్వీసు కస్టమర్లను మరింత పొదుపు చేయడానికి ప్రోత్సహిస్తుంది. తద్వారా వారు వడ్డీ గరిష్ట ప్రయోజనాన్ని పొందేందుకు వీలు ఉంటుంది. FDలో పెట్టుబడి పెట్టడంలా కాకుండా క్రమ వ్యవధిలో మాన్యువల్‌గా నిధులను జమ చేసే శ్రమ ఉండదు. పరిమితి తర్వాత అదనపు నిధులు ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు బదిలీ అవుతాయి.

Related News

టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ, ట్రంప్‌కు కాసుల పంట

10 ఏళ్లలోనే కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి… ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?

బ్యాంకు FDలకు గుడ్ బై చెప్పండి.. నెలకు 3,000 SIPతో 40 లక్షలు అయ్యే ఫినాన్స్ మంత్ర

PPF vs SIP vs SSY… 3000లతో 15 లక్షల సంపాదన… పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ?

8.20 శాతం వడ్డీ రేటు… ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఇచ్చే ఈ 7 పథకాల గురించి తెలుసా ?

20 ఏళ్ల పాటు ప్రతి నెలా 30000 విత్‌డ్రా చేసినా అకౌంట్లో 75 లక్షలు… PF ఉన్నోళ్ళకే ఈ గోల్డెన్ ఛాన్స్

కోకాపేట, నార్సింగిలో ఖాళీగా ఖరీదైన ఫ్లాట్లు.. దిగొస్తున్న బిల్డర్లు, ఇళ్లు కొనేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Big Stories

Advertisement
×