Gold Price Crash: బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా తగ్గుతూ అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. వారంలోనే బంగారం ధర 9 శాతం, వెండి ఏకంగా 15 శాతం మేర తగ్గింది. దీంతో బంగారం కొనడానికి ఇదే సరైనా సమయమా? లేదంటే ఇంకాస్త ఆగొచ్చా? అన్న అంశంపై ప్రస్తుత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు కొండెక్కిన పసిడి.. వరుసగా దిగి వస్తుండటంతో సామాన్యుల దృష్టి తిరిగి బంగారంపై పడింది. ఇంతకీ ఈ ధరల పతనానికి కారణం ఏంటి? ఇంకా ఎంత తగ్గే అవకాశముంది? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎదిగి మిడిసిపడిన బంగారం.. ఇప్పుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. ఒక్కసారిగా నేల చూపు చూస్తోంది. వరుసగా పతనమవుతూ వస్తూ నేల చూపులు చూస్తున్నాయి. శుక్రవారం (నవంబర్ 20) ఒక్కరోజే రూ.5 వేలకు పైగా పడిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. మెుత్తంగా 6 రోజుల వ్యవధిలో రూ.12వేలకు పైగా పసిడి ధరలు పడిపోయాయి. మున్ముందు బంగారం రూ. 3 లక్షల వరకూ వెళ్తుందన్న భయాల నుంచి.. ఇప్పుడు కనిష్ట స్థాయికి గోల్డ్ పడిపోయింది.
ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,27,800 పలుకుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,17,150కి దిగి వచ్చింది. అటు బంగారంతో పాటు వెండి కూడా భారీగా పడిపోయింది. ఈ నెల 16న హైదరాబాద్ లో కిలో వెండి రూ.1,68,690 ధర పలకగా.. 22వ తేదీ నాటికి రూ.1,49,570కి దిగి వచ్చింది. అంటే వారం రోజుల్లోనే కిలోకు ఏకంగా రూ.19,120 తగ్గింది. దీంతో నిన్న, మెున్నటికి బంగారం, వెండి అంటే ఆమడ దూరం పారిపోయిన సామాన్యులు.. ఇప్పుడు కొద్దికొద్దిగా వాటిని కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ఈ ధరల పతనానికి ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, బాండ్ డీల్స్ పెరగడం వంటివి బంగారం, వెండి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి ఇతర మార్గాలకు మళ్లుతున్నారు. వడ్డీ రాల్చని బంగారం కన్నా ఇంట్రస్ట్ వచ్చే బాండ్లు, ఆస్తుల కొనుగోళ్ల వైపు మెుగ్గుచూపుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం పతనం కొనసాగుతోంది. గత వారం ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు 8శాతం తగ్గినట్లు చెబుతున్నారు.
Also Read: ఓపెన్‌ఏఐ సంచలన ప్రకటన.. ఏడాది పాటు ‘చాట్‌జీపీటీ ప్లస్’ ఫ్రీ.. రూ.23,998 విలువైన సేవలు ఉచితం!
ప్రస్తుతం బంగారం తిరిగి పుంజుకునే పరిస్థితులు మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఇదే ట్రెండ్ కొనసాగితే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. లక్ష వరకూ తగ్గే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు ఇదే మంచి సమయమా? ఇంకాస్త తగ్గేవరకూ ఎదురుచూడలా? అని సామాన్యుల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. దీంతో ఇప్పుడే బంగారం కొనాలా? వద్దా? అని పసిడి ప్రియులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ధరలు తగ్గాయని ఒకేసారి కొనుగోలు చేయడం కంటే అవసరం, చేతిలోని బడ్జెట్ ను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ధరల సరళిని విశ్లేషిస్తూ విడతలవారీగా కొంటే బెటరని సలహా ఇస్తున్నారు.
Also Read: రాగి బాటిల్ vs స్టీల్ బాటిల్.. రోజూవారీ వాడకానికి ఏది బెస్ట్? దేనివల్ల ఎక్కువ బెనిఫిట్స్?