E-Paper
Advertisement

4 లక్షలకు కొంటే నేడు 3200 కోట్ల సామ్రాజ్యం… భారత్ మార్కెట్ ను శాసిస్తున్న బిస్లరీ అసలు కథ ఇదే

4 లక్షలకు కొంటే నేడు 3200 కోట్ల సామ్రాజ్యం… భారత్ మార్కెట్ ను శాసిస్తున్న బిస్లరీ అసలు కథ ఇదే
Advertisement

The Untold Story of Bisleri: బిస్లరీ అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది వాటర్ బాటిల్. చిన్న దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా కనిపించే ఈ బ్రాండ్, మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అయితే ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన వ్యాపార ప్రయాణం ఉంది. నిజానికి బిస్లరీ మన దేశంలో పుట్టిన బ్రాండ్ కాదు. ఇటలీలో మొదలైన ఈ సంస్థ భారత్‌లోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చూసింది. ఒకప్పుడు గ్లాస్ బాటిళ్లలో మాత్రమే అమ్ముడైన మినరల్ వాటర్, ఆ తర్వాత ప్లాస్టిక్ బాటిళ్ల రూపంలో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయాణంలో పార్లే గ్రూప్ పాత్ర చాలా కీలకం. అప్పట్లో కేవలం రూ.4 లక్షలకు కొనుగోలు చేసిన ఈ బ్రాండ్, ఇప్పుడు వేల కోట్ల రూపాయల వ్యాపారంగా ఎదిగింది. ఇంతటి స్థాయికి చేరుకోవడానికి బిస్లరీ ఎలాంటి మార్పులు చేసుకుంది, దీని వెనుక ఉన్న వ్యాపార కథ ఏమిటి, ఇటీవల ఈ సంస్థ వార్తల్లో నిలవడానికి కారణమేంటో తెలుసుకుందాం.

ఇటలీలో మొదలైన బిస్లరీ కథ

బిస్లరీ బ్రాండ్ పేరు వెనుక ఇటలీకి చెందిన ఫెలిస్ బిస్లరీ ఉన్నారు. 19వ శతాబ్దంలో ఆయన ఇటలీలో మినరల్ వాటర్‌తో పాటు ఔషధాలు, మూలికలతో తయారు చేసిన పానీయాలను కూడా విక్రయించేవారు. ఆయన పేరు మీదే ఈ బ్రాండ్‌కు బిస్లరీ అనే పేరు వచ్చింది. అయితే భారత్‌లో ఈ బ్రాండ్ ప్రయాణం 1965లో మొదలైంది. ఇటాలియన్ డాక్టర్ సిజేర్ రోస్సీ, భారతీయ వ్యాపారవేత్త ఖుర్షీద్ సుంటూక్ కలిసి ముంబై సమీపంలోని థానేలో బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో బాటిల్ నీరు తాగడం అనేది సామాన్యులకు పెద్దగా అలవాటు లేదు. అందుకే మొదట్లో ముంబైలోని ఖరీదైన హోటళ్లు, రెస్టారెంట్లలోనే బిస్లరీని విక్రయించేవారు.

రూ.4 లక్షలకే కొనుగోలు చేసిన పార్లే గ్రూప్

Advertisement

బిస్లరీ వ్యాపారం ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంతో అమ్మకానికి వచ్చింది. 1969లో పార్లే గ్రూప్ వ్యవస్థాపకుడు జయంతిలాల్ చౌహాన్ ఈ బ్రాండ్‌ను కేవలం రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు రమేష్ చౌహాన్ దీని డెవెలప్ పై దృష్టి పెట్టారు. మొదట్లో గాజు సీసాల్లో అమ్మే బిస్లరీని క్రమంగా ప్లాస్టిక్ బాటిళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. హోటళ్లకే పరిమితమైన ఈ వ్యాపారాన్ని సాధారణ ప్రజలకు కూడా చేరువ చేశారు. ఇంట్లో, ఆఫీసుల్లో వాడుకునే 20 లీటర్ల వాటర్ క్యాన్లను కూడా అందుబాటులోకి తీసుకురావడంతో బిస్లరీ వినియోగం మరింత పెరిగింది.

ప్రస్తుతం రూ.3,218 కోట్ల ఆదాయం

ఒకప్పుడు రూ.4 లక్షలకు కొనుగోలు చేసిన ఈ బ్రాండ్ ఇప్పుడు వేల కోట్ల వ్యాపారంగా ఎదిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బిస్లరీ ఇంటర్నేషనల్ ఆదాయం సుమారు రూ.3,218 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆదాయం దాదాపు 19.6 శాతం పెరిగింది. అయితే ఆదాయం పెరిగినప్పటికీ, పన్నుల తర్వాత మిగిలిన లాభం రూ.307 కోట్ల నుంచి రూ.253 కోట్లకు తగ్గింది. అంటే అమ్మకాలు పెరిగినా ఖర్చుల ప్రభావంతో లాభం తగ్గిందన్నమాట.

FSSAI చర్యతో మళ్లీ వార్తల్లోకి..

Advertisement

ఇటీవల బిస్లరీపై ఆహార భద్రతా నిబంధనలకు సంబంధించి వివాదం మొదలైంది. గోవాలోని కంపెనీ ప్లాంట్ నుంచి 2025 సెప్టెంబర్‌లో సేకరించిన ఒక నీటి నమూనాలో మొదట బ్రోమేట్ పరిమితికి మించి ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆ తర్వాత మరో పరీక్షలో వేరే రసాయనాల ఆనవాళ్లు ఉన్నట్లు FSSAI పేర్కొంటూ కంపెనీపై చట్టపరమైన చర్యలకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఫలితాలపై బిస్లరీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము చేసిన పరీక్షల్లో బ్రోమేట్ పరిమితుల్లోనే ఉందని, నీరు తాగడానికి సురక్షితమేనని కంపెనీ చెబుతోంది. ఈ వ్యవహారంలో తాము అధికారులకు సహకరిస్తామని కూడా వెల్లడించింది.

మొత్తానికి ఇటలీలో మొదలైన ఒక బ్రాండ్‌ను భారతీయ వ్యాపారవేత్తలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పేరుగా మార్చారు. రూ.4 లక్షల కొనుగోలుతో మొదలైన ఈ ప్రయాణం వేల కోట్ల ఆదాయం వరకు చేరడం వ్యాపార చరిత్రలో ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకుంటున్నారు.

Read Also: PPF vs SIP vs SSY… 3000లతో 15 లక్షల సంపాదన… పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ?

Related News

పెళ్లి, సాఫ్ట్ వేర్ జాబ్ వద్దు.. డెలివరీ బాయ్ పనే ముద్దు.. ‘జెన్ జీ’ యువత నయా ట్రెండ్!

బంగారం ధరలు ఢమాల్.. రూ.లక్షకు పడిపోయే ఛాన్స్.. మరి ఇప్పుడే కొనాలా? ఇంకాస్త ఆగాలా?

పెట్టుబడుల్లో మహిళల జోరు.. మ్యూచువల్ ఫండ్స్‌, ఈక్విటీల్లో పెరుగుతున్న వాటా

బ్యాంకులో ఆ విషయం చెబితే చాలు.. పొదుపు ఖాతాపై మూడు రెట్ల వడ్డీ, అదెలా సాధ్యం?

టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ, ట్రంప్‌కు కాసుల పంట

10 ఏళ్లలోనే కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి… ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?

బ్యాంకు FDలకు గుడ్ బై చెప్పండి.. నెలకు 3,000 SIPతో 40 లక్షలు అయ్యే ఫినాన్స్ మంత్ర

Big Stories

Advertisement
×