Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇంట్లో కంటెస్టెంట్స్ ఫుల్ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రోజు నరేష్, శ్వేత, వంశీ ఫ్యామిలీ మెంబర్లు ఇంట్లోకి వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. నరేష్ తమ్ముడు సురేష్ , శ్వేత సోదరీ, తండ్రి ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. అలాగే వంశీ కూతురు, భార్య రాకతో ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఎమోషనల్ గా సాగింది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ముఖేష్ తన తల్లిని పట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడవడమే కాకుండా తన సోదరి నుంచి వచ్చిన ఒక వీడియో సందేశం అందరిని కన్నీటి పర్యంతం చేసింది. ఇక వాటిని చూసిన ముఖేష్ తో పాటు వర్షిణి , అలాగే మిగతా కంటెస్టెంట్స్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
66వ రోజుకు సంబంధించి ఫ్యామిలీ వీక్ లో భాగంగా మొదటి ప్రోమో విడుదల చేశారు. బిగ్ బాస్ స్కూల్ టాస్క్ లో భాగంగా ఫ్రీజ్ అవమని బిగ్ బాస్ చెప్పగా.. హ్యాపీ బర్తడే టూ యు అంటూ ముఖేష్ తల్లి బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ముఖేష్ ఫ్రీజ్ అయి ఉండడంతో ముందుగా కదల్లేదు. ఆ తర్వాత తన తల్లిని పట్టుకొని ఏడ్చేసాడు. “ఏం చెప్పాలి నీకు నువ్వు స్ట్రాంగ్ గా ఉండు.” అని తన తల్లి చెబితే.. “ఎందుకు ఏడుస్తున్నానో.. ఎందుకు ఎమోషనల్ అవుతున్నానో..ఎందుకో నాకే తెలియట్లేదు” అంటూ ముఖేష్ ఎమోషనల్ అయ్యారు.” ఏడవద్దు నాన్న.. స్ట్రాంగ్ గా ఉండు” అంటూ ఆయన తల్లి సపోర్ట్ ఇచ్చారు. ఇక ముఖేష్ తన తల్లిని పట్టుకుని ఏడుస్తుంటే.. ఇంట్లో మిగతా కంటెస్టెంట్స్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం చూడవచ్చు. ఇక వర్షిణి ముఖేష్ తల్లిని హగ్ చేసుకుని ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
ALSO READ:సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రియా భవాని శంకర్!
తర్వాత ముఖేష్ వాళ్ళ అక్క ఫ్యామిలీ నుండి వీడియో మెసేజ్ వచ్చింది. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని, కీమోథెరపీ కంప్లీట్ చేయించి ఇప్పుడు హౌస్ లోకి వచ్చానని , తాను ఎలా ఉందో తనకు తెలియదని, తన అక్క లేకపోతే తాను లేను అంటూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తన అక్కను ఒక్కసారి అయినా చూడాలని అనుకుంటున్నట్లు ముఖేష్ చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ముఖేష్ బాధను అర్థం చేసుకున్న బిగ్ బాస్ ఆమె అక్క ఫ్యామిలీ వీడియో మెసేజ్ ను పంచుకున్నారు. అందులో ఆయన అక్క మాట్లాడుతూ.. “నా ఆరోగ్యం గురించి నువ్వు బెంగపడొద్దు. ప్రస్తుతం నేను రికవరీ అవుతున్నాను. ట్రోఫీ గెలిచి ఇంటికి రా” అంటూ చెప్పుకొచ్చింది? మొత్తానికైతే ఇంట్లో అమ్మ లైవ్ లో అక్క వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు ముఖేష్. ఇది చూసిన కంటెస్టెంట్స్ ఇటు ఆడియన్స్ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు.