E-Paper
Advertisement

ఉంగరం కోసం సౌరాన్‌ వేట… ఎల్వ్స్, ఓర్క్స్‌ మధ్య భీకర పోరు… ‘ది రింగ్స్ ఆఫ్ పవర్’ కొత్త సీజన్ వచ్చేసిందోచ్

ఉంగరం కోసం సౌరాన్‌ వేట… ఎల్వ్స్, ఓర్క్స్‌ మధ్య భీకర పోరు… ‘ది రింగ్స్ ఆఫ్ పవర్’ కొత్త సీజన్ వచ్చేసిందోచ్
Advertisement

The Rings of Power Season 3 on OTT: ఫాంటసీ అండ్ అడ్వెంచర్ సినిమాలకు వరల్డ్ వైడ్‌గా ఎప్పుడూ ఒక రేంజ్ డిమాండ్ ఉంటుంది. అందులోనూ ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ (Lord of the Rings) లెగసీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ప్రాజెక్ట్స్ అంటే ఆ హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ వెబ్ సిరీస్‌గా హిస్టరీ క్రియేట్ చేసిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ మోస్ట్ అవైటెడ్ సరికొత్త ఎపిక్ సీజన్ ‘The Rings of Power – Season 3’. ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్‌ ఇప్పుడు మూడో సీజన్‌తో తిరిగొచ్చింది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ అత్యంత గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో నిర్మించిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ Amazon Prime Video లో ఎక్స్‌క్లూసివ్‌గా ల్యాండ్ అయిపోయింది. గ్లోబల్ ఫ్యాన్స్ కోసం ప్రైమ్ వీడియో దీనిని ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోతో పాటు మల్టిపుల్ సబ్‌టైటిల్స్ ఆప్షన్ తో స్ట్రీమింగ్ చేస్తోంది.

కథలోకి వెళ్తే…

ఈ సీజన్ కథ మిడిల్-ఎర్త్ లోని సెకండ్ ఏజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. రెండవ సీజన్‌లో ఎరెజియన్‌ నగరం పతనం కావడం, సౌరాన్‌ తన శత్రువులపై పైచేయి సాధించిన ఐదేళ్ల తర్వాత ఈ మూడో సీజన్ కథనం ముందుకు సాగుతుంది. కరడుగట్టిన డార్క్ లార్డ్ సౌరాన్ తన పాత శక్తులను తిరిగి తెచ్చుకుని, ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి వేసే మాస్టర్ మైండ్ ప్లాన్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆ పవర్ఫుల్ ఉంగరం కోసం సౌరాన్ అతని ఓర్క్స్ సైన్యం చేసే ఊచకోత ఈ సీజన్ లో మేజర్ హైలైట్ గా నిలిచింది. ఈ వినాశనాన్ని అడ్డుకోవడానికి అమరత్వ ఎల్వ్స్ , నూమెనోర్ హ్యూమన్స్, డ్వార్వ్స్ అందరూ కలిసికట్టుగా ఒక భీకరమైన యుద్ధానికి రెడీ అవుతారు. గాడ్-లెవెల్ ఆక్యురసీతో సాగే ఈ ఫాంటసీ వార్ సీన్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి.

Advertisement

గాలాడ్రియల్, ఎల్రాండ్ క్యారెక్టర్స్ ఈ సీజన్ లో మరికొన్ని సరికొత్త మైండ్ బ్లోయింగ్ మిషన్లని హ్యాండిల్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ ఎవల్యూషన్ ని చూపిస్తాయి. సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎఫెక్ట్స్, ఆ గ్రాండ్ విజువల్స్ మిమ్మల్ని థియేటర్ లో కూర్చున్న ఫీలింగ్ ని ఇస్తాయి. ఒక పక్కా ఇంటర్నేషనల్ క్లాసిక్ ఫాంటసీ యాక్షన్ రైడ్ ని ఎక్స్ పీరియన్స్ చేయాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఈ సరికొత్త సీజన్ ని అస్సలు మిస్ అవ్వద్దు.

ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ 

ఇందులో సౌరాన్‌ పాత్రలో చార్లీ వికర్స్‌, గాలాడ్రియల్‌గా మోర్ఫిడ్‌ క్లార్క్‌, ఎల్రాండ్‌గా రాబర్ట్‌ అరమాయో, గాండాల్ఫ్‌గా డేనియల్‌ వేయ్‌మన్‌ లీడ్ రోల్స్ లో నటించారు. దీనికి చార్లెట్‌ బ్రాండ్‌స్ట్రోమ్‌, సనా హమ్రీ, స్టీఫన్‌ స్క్వార్ట్జ్‌ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మూడో సీజన్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి నాలుగు ఎపిసోడ్లు నవంబర్‌ 11న, ఐదు, ఆరు ఎపిసోడ్లు నవంబర్‌ 18న, చివరి రెండు ఎపిసోడ్లు నవంబర్‌ 25న Amazon Prime Videoలో విడుదలవుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే ఫ్యామిలీతో కలసి ఈ విజువల్ వండర్ ని ఎంజాయ్ చేయండి.

Advertisement

Read Also: అణు యుద్ధం జరిగి 200 ఏళ్లు… ముఖం లేని హీరో మాస్ జాతర… ‘మీర్జాపూర్’ను మించిన డైలాగులు

Related News

రాతియుగంలో మోటు-పత్లూ రోలర్ కోస్టర్ రైడ్… డైనోసార్లు, వింత మనుషులతో అల్టిమేట్ అడ్వెంచర్… 8 భాషల్లో స్ట్రీమింగ్

కోటీశ్వరుడి కొడుకు హత్య… రంగంలోకి దిగే 242 ఐక్యూ ఉన్న లేడీ డిటెక్టివ్‌… క్రిమినల్స్ కు దబిడి దిబిడే

తప్పుల్ని సరిచేసుకోవడానికి ఏడాది వెనక్కి వెళ్లే అద్భుతమైన అవకాశం… కొరియన్‌ టైమ్‌ ట్రావెల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ సిరీస్‌

కొడుకు వింతగా ప్రవర్తిస్తున్నాడని టీచర్‌పై అనుమానం… స్కూలుకెళ్ళి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్ ఉన్న మిస్టరీ డ్రామా

రాణి శరీరంలోకి మగ చెఫ్‌ ఆత్మ… రాజభవనంలో వంటలతో పాటు రాజకీయాలు కూడా… కొరియన్‌ ఫాంటసీ కామెడీ డ్రామా

అణు యుద్ధం జరిగి 200 ఏళ్లు… ముఖం లేని హీరో మాస్ జాతర… ‘మీర్జాపూర్’ను మించిన డైలాగులు

లాయర్‌ స్థానంలో నిందితుడిగా నిలబడితే… తన కేసులో తానే నిందితుడు… క్రేజీ కోర్ట్‌రూమ్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×