Big Stories

Kalki Released in OTT: ఓటిటీలో రిలీజ్ అయిన కల్కి.. అదిరిపోయింది అంతే!

Kalki Released in OTT: టైటిల్ చూడగానే ఒక్క నిమిషం గుండె ఆగిందా.. ? ఓటిటీకి కల్కి రావడం ఏంటి.. ? ఏం మాట్లాడుతున్నారా.. నరాలు కట్ అయిపోయాయి అని అనిపిస్తుందా.. ? సరే సరే కూల్ అవ్వండి. కల్కి ఓటిటీలోకి వచ్చిన విషయం నిజమే.. కానీ, ప్రభాస్ కల్కి2898AD కాదు. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటించిన చిత్రం కల్కి. ఇది 2019 లో రిలీజ్ అయిన ఒక మలయాళ సినిమా. ఇన్నేళ్ల తరువాత తెలుగు డబ్బింగ్ తో ఓటిటీలోకి వచ్చింది.

- Advertisement -

ప్రవీణ్ ప్రభారమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లిటిల్ బిగ్ ఫిలిమ్స్ కింద సువిన్ కె. వర్కీ మరియు ప్రశోభ్ కృష్ణ నిర్మించారు. ఈ చిత్రంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించగా, శివజిత్ పద్మనాభన్, సంయుక్త మీనన్ మరియు వినీ విశ్వ లాల్ కీలకమైన సహాయ పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

- Advertisement -

పొలిటికల్ టచ్ తో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక కల్కి అనే పోలీసాఫీసర్ పాత్రలో తొవినో అదరగొట్టాడు. అసలు కథ ఏంటి అంటే.. నెంజ‌న్‌కొట్ట అనే గ్రామాన్ని రాజకీయ నాయకుడు అయిన అమ‌ర్‌నాథ్ (శివ‌జీత్ ప‌ద్మ‌నాభ‌న్‌) చెప్పుచేతల్లో ఉంచుకుంటాడు. అతనికి ఎవరు ఎదురుతిరిగినా.. ఉమ‌ర్ (హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) అనే రౌడీతో అంతం చేస్తూ ఉంటాడు. ఇక ఆ ఊరిలో వారిని ఎదిరించలేక.. చుట్టూ ఉన్నవాళ్లు పోలీస్ అయ్యి ఉండి ఏం చేయలేని చేతకాని వాడు అని గేలి చేయడంతో ఆ ఊరి ఎస్సై వైశాఖ్ (ఇర్షాద్‌) పోలీస్ స్టేష‌న్‌లోనే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు.

Also Read: RT 75 Officially Launched: ‘ధమాకా’ జోడి రిపీట్.. ఈ సారి దంచి కొట్టనున్న రవితేజ, శ్రీలీల..

ఇక ఆ స్థానంలో ఎవరు వచ్చినా చెప్పుచేతల్లో పెట్టుకోమని అమర్ ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలోనే ఆ ఊరికి కొత్త ఎస్సై గా కల్కి(టోవినో థామస్) వస్తాడు. రావడం రావడమే.. అమర్ రౌడీలందరిపై విరుచుకుపడతాడు. ఇక ఇంకోపక్క అమర్ కు వ్యతిరేకంగా మరో రాజకీయ పార్టీ.. అమర్ కు భయపడి పారిపోయిన గ్రామస్తులను మళ్లీ ఊరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వారు వస్తే అమర్ మళ్లీ ఎన్నికల్లో గెలవడు అని తెలియడంతో కల్కి కూడా వారికీ సహాయం చేసాడు.

ఇక అమర్ కు – కల్కి కి మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు.. ? ఎవరు ఓడారు.. ? అసలు కల్కి ఎవరు.. ? కల్కికి, సంగీత ( సంయుక్త మీనన్) కు సంబంధం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా మొత్తం యాక్షన్ తో నింపేశాడు డైరెక్టర్. పవర్ ఫుల్ పోలీస్ గా టోవినో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సంయుక్త పాత్ర అసలు ముఖ్యమైంది కాదు. అప్పట్లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండడంతోనే ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Sonakshi Sinha: తనకంటే రెండేళ్ల చిన్నవాడైన ప్రియుడితో స్టార్ హీరోయిన్ పెళ్ళి.. ఎప్పుడు, ఎక్కడంటే?

సినిమా కథ కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. ఒక గ్రామాన్ని వేదించే రౌడీ.. పోలీస్ గా వచ్చిన హీరో. అతడి అంతు చూడడం.. కథ మొత్తం ఇలాగే నడిచింది టోవినో యాక్టింగ్ కోసం చూడాలంటే ఈ సినిమా ఈటీవీ విన్ లో చూడొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News