Big Stories

Air Made Hand Bag: గాలితో హ్యాండ్ బ్యాగ్.. ప్రపంచంలోనే లైట్ వెయిట్ బ్యాగ్‌గా రికార్డ్!

Hand Made Air Bag
Bag Made with Air

Hand Bag Made with AIR: మహిళలకు ఇష్టమైన వస్తువుల్లో హ్యాండ్ బ్యాగుల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వారి వద్ద ఉండే అన్ని వస్తువుల్లో కంటే హ్యాండ్ బ్యాగులే ఎక్కువ ఉంటాయి. ఒక్కో డ్రెస్‌కు తగ్గట్లు ఒక్కోటి మెయింటెన్ చేస్తూ ఉంటారు. ఎన్ని డ్రెస్సులు ఉండే అన్ని హ్యాండ్ బ్యాగులు ఉండాల్సిందే. ఇలా వారి బీరువా నిండా హ్యాండ్ బ్యాగులే కనిపిస్తాయి. అయితే ఆడవారిని ఆకర్షించేందుకు కూడా ప్రముఖ బ్రాండ్ కంపెనీలు రకరకాల కలర్స్‌తో మార్కెట్లోకి హ్యాండ్ బ్యాగులను తీసుకువస్తున్నాయి.

- Advertisement -

ఆడవారి ఇష్టాలకు అనుగుణంగా, స్టైలిష్‌గా ఉండేలా బ్యాగుల కంపెనీలు తయారుచేస్తున్నాయి. ఈ తరుణంలో చాలా రకాల మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో చిన్నవి, పెద్దవి, పొడవాటివి సహా మార్కెట్ కు తీసుకెళ్లే సంచులను కూడా హ్యాండ్ బ్యాగుల మాదిరి తయారుచేసి ట్రెండ్ అంటూ సేల్స్ చేస్తూ బిజినెస్ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పలు కంపెనీ వినూత్నంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త కొత్తగా హ్యాండ్ బ్యాగులను తయారుచేస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో బరువైనవి, తేలికైనవి ఇలా చాలా రకాలుగా ఉన్నాయి.

- Advertisement -

తాజాగా ఓ కంపెనీ ఏకంగా గాలితో తయారు చేసిన హ్యాండ్ బ్యాగులను సేల్ చేస్తుంది. ప్రపంచంలోనే అతి తక్కువ బరువుతో ఉండే ఈ హ్యండ్ బ్యాగులు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చాయి. మరి వీటి వివరాలు ఏంటో తెలుసుకుందాం.

Also Read: యూజర్లకు బ్యాడ్‌ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ ధరలు

దూదితో, దుస్తులతో ఇలా రకరకాల పదార్థాలతో తయారుచేసిన వస్తువులను చూసే ఉంటారు. కానీ గాలితో తయారుచేసిన బ్యాగులను ఎవరు చూసి ఉండరు. ఓ కంపెనీ ఏకంగా 99 శాతం గాలి, ఒక శాతం గాజుతో బ్యాగును తయారుచేస్తుంది. ఈ మేరకు ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని కంపెనీ హ్యాండ్ బ్యాగ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.

కేవలం 37 గ్రాముల బరువుతో ఉండే ఈ బ్యాగుగు ఎయిర్ స్వైప్ అని కూడా పేరు పెట్టింది. అంతేకాదు, ఇందులో ఆసక్తికర ఘటన ఏమిటంటే.. ఇది కేవలం 37 గ్రాములే ఉన్నా.. 4000 రెట్లు ఎక్కువ బరువును మోయగలుగుతుంది. దీని సైజ్ 27, 16, 6 లతో 15 నమూనాలను తయారుచేసింది. ఈ బ్యాగును తయారు చేసేందుకు కోపర్నికస్ బ్రాండ్ అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ సైప్రస్ శాస్త్రవేత్త ఐయోనిస్ మిచెలౌడిస్ హెల్ప్ చేశారు. ఈ బ్యాగును తయారు చేసేందుకు సిలికా ఎయిర్ జెల్ ను ఉపయోగించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే తేలికైన బ్యాగుగా రికార్డు సృష్టించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News