BigTV English

Nani Mets British Deputy Commissioner: బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ తో నాని.. కారణమేంటో..?

Nani Mets British Deputy Commissioner: బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ తో నాని.. కారణమేంటో..?

natural star nani


Hero Nani Mets British Deputy Commissioner and Telangana Gareth Wynn Owen: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది నుంచి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో టైర్ 1 హీరోల లిస్ట్ లో చేరడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక  తాజాగా నాని, బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ గారెత్ విన్ ఒవెన్ ను మర్యాద పూర్వకంగా  కలిశారు.  నాని ఇంట్లోనే ఈ మీటింగ్ జరిగింది. ఈ విషయాన్నీ గారెత్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు  గారెత్ బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈ మీటింగ్ కు కారణం ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక నాని, గారెత్ ను పుష్ప గుచ్చం తో పాటు శాలువా కప్పి ఆహ్వానించాడు. అనంతరం కొద్దిసేపు వారు ముచ్చటించారు. ఇక గారెత్ కు నాని సినిమాలు అంటే  చాలా ఇష్టమంట.  నాని నటించిన మంచి సినిమాలను తనకు సజిస్ట్ చేయమని కూడా ఆయన కోరారు.


” నానిని కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన సినిమాల గురించి, కెరీర్ గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు. టాలీవుడ్ తో బ్రిటన్ కు ఉన్న సంబంధాలు గురించి చర్చించుకున్నాం.  ఆయన నటించిన ఒక రెండు సినిమాలు నన్ను చూడమని చెప్పారు. న్యాచురల్ స్టార్ మూవీస్ లో మీరు ఏది చూడమంటారు.. ?” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నాని సినిమాల విషయానికొస్తే.. సరిపోదా శనివారం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. దసరా, హాయ్ నాన్నతో డబుల్ హిట్స్ అందుకున్న నాని సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి నాని హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Also Read: Siddharth and Aditi Rao : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ – అదితి రావు హైదరీ..!

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×