Big Stories

History Of Tata Indica : రతన్ టాటా ఎమోషనల్ కార్.. టాటా ఇండికా చరిత్ర తెలుసా?

History Of Tata Indica
History Of Tata Indica

History Of Tata Indica : టాటా దేశీయ ఆటోమొబైల్ కంపెనీ. ఈ కంపెనీకి భారతీయుల మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంది.  ఇక టాటా వంశీయుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశం కోసం తన ఆస్థిని సైతం రాసిస్తామన్న గొప్ప దేశ భక్తి కలిగిన కుటుంబం. అయితే టాటా సుమారు 26 సంవత్సరాల క్రితం 1998 సంవత్సరంలో దేశంలో తన మొట్టమొదటి చిన్న కారు టాటా ఇండికాను విడుదల చేసింది. అప్పటి వరకు ట్రక్కు, బస్సుల తయారీ కంపెనీగా పేరుగాంచిన టాటా ఈ కారుతో ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. ఈ టాటా కారు బ్రిటన్‌లో కూడా అమ్ముడయ్యిందని మీకు తెలుసా? ఆ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

UK లో టాటా ఇండికా

- Advertisement -

భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన మొదటి చిన్న కారు ఇండికాను UKకి రవాణా చేసింది. అక్కడ ఈ కారును సిటీ రోవర్ పేరుతో సూపర్ మినీ సెగ్మెంట్లో MG రోవర్ గ్రూప్ విడుదల చేసింది. 2003 సంవత్సరంలో ఈ కారును బ్రిటన్‌లో ప్రారంభించారు. అయితే ఇది UKలో కేవలం రెండేళ్లపాటు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంచారు.

Also Read : మారుతి కార్లపై భలే ఆఫర్లు.. ఇక జాతరే జాతర!

ఇంజిన్ 

MG రోవర్ టాటా ఇండికాలో సిటీ రోవర్ పేరుతో 1405 cc ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఇది 85 bhp, 119 న్యూటన్ మీటర్ టార్క్ విడుదల చేస్తుంది. ఈ కారు 11.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు మరియు దాని గరిష్ట వేగం గంటకు 160.9 కిలోమీటర్ల వరకు ఉంది. కంపెనీ 1.4 లీటర్ ఇంజన్‌తో ఐదు-గేర్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందించింది.

బ్రిటన్‌ మోడల్‌

బ్రిటన్‌లో విక్రయించే సిటీ రోవర్ భారతదేశంలోని పూణేలో తయారు చేయబడింది. కానీ ఇండికాతో పోలిస్తే బ్రిటన్‌లో అందిస్తున్న సిటీ రోవర్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు చేయబడ్డాయి. బ్రిటన్‌లో ఈ కారు కొత్త బంపర్‌లు, గ్రిల్‌పై రోవర్ బ్యాడ్జ్, 14-అంగుళాల వీల్స్, కొత్త సస్పెన్షన్ సెట్టింగ్‌ల వంటి మార్పులతో లాంచ్ చేశారు.

ధర 

సమాచారం ప్రకారం.. బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG రోవర్ 2003లో 6495 బ్రిటిష్ పౌండ్ల ధరతో సిటీ రోవర్‌ని విడుదల చేసింది. అందులో ఒక్కో యూనిట్‌కు కంపెనీ దాదాపు మూడు వేల బ్రిటీష్ పౌండ్లను టాటా మోటార్స్‌కు చెల్లించేది. డిసెంబర్ 2004లో కంపెనీ ఈ కారు ధరను కూడా 900 బ్రిటిష్ పౌండ్లు తగ్గించింది.

Also Read : ఏథర్ రిజ్టా వచ్చేసింది.. ఇది పక్కా ఫ్యామిలీ స్కూటర్!

భారతదేశంలో టాటా ఇండికా

దేశంలో ఈ కారు 1998లో లాంచ్ అయిన వెంటనే ఇండియన్ మార్కెట్లో హిట్ అయింది. ప్రారంభించిన రెండు సంవత్సరాలలో టాటా మోటార్స్ ఈ వాహనం కోసం దాదాపు 1.25 లక్షల ఆర్డర్‌లను దక్కించుకుంది. వాణిజ్య వాహనాల తయారీ సంస్థ యొక్క మొదటి చిన్న కారుగా ఇండికాను ఇష్టపడిన వారిలో రతన్ టాటా కూడా ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News