Nargarjuna New Luxurious Car: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ప్రముఖ ఆటోమోబైల్ కంపెనీ టయోటాకు చెందిన లెక్సస్(Lexus LM 350h) టాప్ ఎండ్ కారును తన గ్యారేజీకి తీసుకొచ్చారు. తాజాగా ఈ కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం నాగార్జున ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ కారుకు ఆర్టీఏ అధికారులు TG9 GT/R4874 నెంబర్ ను కేటాయించారు
Lexus LM 350h ప్రత్యేకతలు
టయోటా లెక్సస్ LM 350h అనేది హైఎండ్ MPV. ఈ కారు మార్చిలో దేశీ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ లగ్జరీ కారు ధర అక్షరాలా రూ. 2.5 కోట్లు(ఎక్స్-షోరూమ్). టయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్(TNGA) ఆధారంగా రూపొందించారు. ఈ కారును కంపెనీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంట్రీ లెవల్ లెక్సస్ LM 350h VIP కారు. ఇది ఏడు సీట్ల వేరియంట్. అల్ట్రా లగ్జరీ వెర్షన్ లో 4 సీట్లు ఉంటాయి. ఇందులో ఇంటీరియర్ ఫస్ట్ క్లాస్ ఎయిర్ లైన్ క్యాబిన్ ను పోలి ఉంటుంది. Lexus LM 350h MPV సెగ్మెంట్‌కు అల్ట్రా-లగ్జరీని అందిస్తుంది. ఇది ఫ్యామిలీ జర్నీ కోసం ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇందులో 23-స్పీకర్ మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్, రిమోట్ కంట్రోలర్లతో కూడిన మల్టీ-ఆపరేషనల్ ఆర్మ్‌రెస్ట్‌ను కలిగి ఉంది. ఈ కారు డ్యాష్ బోర్డు 14-అంగుళాల HD టచ్ స్క్రీన్, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 10-అంగుళాల హెడ్ అప్ డిస్ ప్లేను కలిగి ఉంది.
Lexus LM 350h ఇంజిన్ ప్రత్యేకతలు
LM 350h 2.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇది 190 bhpతో పాటు 240 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. విలాసవంతమైన MPV ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ తో వస్తుంది. LM 350h VIP ధర రూ. 2 కోట్లు కాగా, అల్ట్రా లగ్జరీ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.5 కోట్లు. నాగార్జున తీసుకున్న కారు అల్ట్రా లగ్జరీ వెర్షన్ గా తెలుస్తోంది.
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో నాగార్జున సందడి..
తన కొత్త కారు టయోటా లెక్సస్ TG09 GT R/4874 రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లిన నాగార్జున
నాగార్జునతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీపడిన అభిమానులు, ఆర్టీఏ సిబ్బంది@iamnagarjuna @TGRTAIndia#Hyderabad #NagarjunaAkkineni… pic.twitter.com/OuIijL1ZrT
— BIG TV Breaking News (@bigtvtelugu) November 28, 2024
ఈ కారు ఏ హీరోలా దగ్గర ఉందంటే?
టయోటా లెక్సస్ LM 350h ఇప్పటికే పలువురు సినీ హీరోలు కొనుగోలు చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ కారు మార్చిలోనే కొనుగోలు చేశారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఈ కారును కొన్నారు. తాజాగా నాగార్జున గ్యారేజీలోకి ఈ లగ్జరీ కారు ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ములతో కలిసి ‘కుబేర’, లోకేష్ కనగరాజ్ తో కలిసి ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ షో హోస్టుగా కొనసాగుతున్నారు. అదే సమయంలో నాగార్జున తన ఇద్దరు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ కు త్వరలో పెళ్లి చేయబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా కొనసాగుతున్నాయి.
This is my first look at the Lexus LM luxury hybrid MPV. Some salient features are mentioned but opinions and review are embargoed until the 30th. Your comments are welcome 😄
SVP#LexusLM#MPV #Luxury #hybrid pic.twitter.com/OC7jwEsRFK— Siddharth Vinayak Patankar (@sidpatankar) August 26, 2023
Read Also: బ్యాంకులకు ఏకంగా 17 రోజుల సెలవులు, ఎందుకో తెలుసా?