E-Paper
Advertisement

Pushpa2 : ‘పుష్ప 2’ ప్రమోషన్స్ కు సుకుమార్ దూరం.. ఆ గొడవలే కారణమా..?

Pushpa2 : ‘పుష్ప 2’ ప్రమోషన్స్ కు సుకుమార్ దూరం.. ఆ గొడవలే కారణమా..?
Advertisement

Pushpa2 : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం పుష్ప 2.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మొన్నీమధ్య వచ్చిన ట్రైలర్ సినిమా పై బజ్ ను క్రియేట్ చెయ్యగా, నిన్న రిలీజ్ అయిన కిస్సిక్ ఐటమ్ సాంగ్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. డిసెంబరు 5న ‘పుష్ప 2’ విడుదల కానుంది. ఈ మూవీ ఫ్యాచ్ వర్క్ ను కంప్లీట్ చేసుకొని సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా అందుకుంది. విడుదలకు ఐదు రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అయితే ఈ ప్రమోషన్స్ భాధ్యతలను అల్లు అర్జున్ తన భుజాల మీద వేసుకున్నాడని తెలుస్తుంది. ఏ ఏరియాకు వెళ్లినా ఆయనే వెళ్లి పుష్ప 2 ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ కు సుకుమార్ దూరం అయ్యాడు. సినిమా గురించి కరెక్ట్ గా చెప్పేది ఒక్క డైరెక్టర్ మాత్రమే.. అలాంటి ఆయన దూరంగా ఉండటం పై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు సుక్కు దూరానికి కారణం ఏంటో తెలుసుకుందాం..

డైరెక్టర్, హీరో మధ్య గొడవలు నిజమేనా? 

Advertisement

పుష్ప సినిమా వచ్చి నాలుగేళ్లు అయ్యింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2 మూవీ కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాటుగా ఊర మాస్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఉండబోతుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ను చూస్తే తెలుస్తుంది. అయితే సినిమా ప్రమోషన్స్ జోరుగానే చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ మొత్తం అల్లు అర్జున్ మాత్రమే చూసుకుంటున్నారు. చిత్ర డైరెక్టర్ సుక్కు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయన ఇప్పటివరకు జరిగిన ట్రైలర్ లాంచ్, ఐటమ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్స్ లో కనిపించలేదు. ఏమైంది సుక్కు దూరంగా ఉండటానికి గొడవలే కారణమా? లేదా ఇంకేదైనా ఉందా? అనే అనుమానాలు ఫ్యాన్స్ కు రావడం సహజం. నిజం చెప్పాలంటే సుక్కు దూరం అవ్వడానికి కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులే అని తెలుస్తుంది. ఆ పనుల్లో తీరిక లేని బిజీగా ఉన్నాడట అందుకే దూరం అని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.

పుష్ప 2 సెన్సార్ రివ్యూ.. 

Advertisement

తాజాగా పుష్ప-2 సెన్సార్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాకు సెన్సార్ టీమ్ యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ మూవీ రన్ టైమ్ కూడా 3 గంటల 18 నిముషాలు ఉంది. ఇంత భారీగా ఉండటంపై చర్చ జరుగుతోంది. అయితే పార్టు-1 కూడా 3గంటలకు పైగానే ఉంది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పార్టు-2కు ఉంది. సినిమా బాగుంటే రన్ టైమ్ గురించి మాట్లాడుకోరని పుష్ప నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమకు ఎక్కువ రన్ టైమ్ కలిసి వచ్చింది కాబట్టి.. ఇప్పుడు కూడా అదే కలిసి వస్తుందంటున్నారు.. వారి నమ్మకం ఏ మాత్రం నిజం అవుతుందో? రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డు లను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×