Bank Holidays In December 2024: సాధారణంగా బ్యాంకులకు ఆదివారాలు, రెండవ, నాలుగవ శనివారాలు సెలవులు ఉంటాయి. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో సెలవులు ఉంటాయి. డిసెంబర్ నెలలో సగానికి పైగా రోజులు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 రోజులు బ్యాంకులను మూసివేయనున్నారు. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన వెబ్ సైట్ లో సెలవులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. జాతీయ, ప్రాంతీయ సెలవులను ఇందులో మెన్షన్ చేసింది. ఇంతకీ ఏ రోజు ఎందుకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
డిసెంబర్ లో బ్యాంకుల సెలవుల వివరాలు..
సాధారణ సెలవులతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రత్యేక ఈవెంట్ల సందర్భంగా బ్యాంకులకు సెలవులను ప్రకటించిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంతకీ ఆ ప్రత్యేక ఈవెంట్లు ఏంటంటే..
⦿ డిసెంబర్ 3న (శుక్రవారం)
సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివ్ సందర్భంగా గోవాలో బ్యాంకులు మూసి వేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
⦿ డిసెంబర్ 12 (మంగళవారం)
ప-టోగన్ నెంగ్మింజా సంగ్మా సందర్భంగా మేఘాలయలో బ్యాంకులను మూసివేయనున్నారు.
⦿ డిసెంబర్ 18 (బుధవారం)
యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులను మూసివేయనున్నారు.
⦿ డిసెంబర్ 19 (గురువారం)
గోవా విమోచన దినోత్సవం సందర్భంగా గోవాలో బ్యాంకులు మూతపడనున్నాయి.
⦿ డిసెంబర్ 24 (గురువారం)
క్రిస్మస్ పండుగ సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయాలో బ్యాంకులు ప్రత్యేకంగా మూతపడనున్నాయి.
⦿ డిసెంబర్ 25 (బుధవారం)
క్రిస్మస్ సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
⦿ డిసెంబర్ 26 (గురువారం)
క్రిస్మస్ వేడుకల సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులు క్లోజ్ చేయనున్నారు.
⦿ డిసెంబర్ 27 (శుక్రవారం)
క్రిస్మస్ వేడుకల సందర్భంగా నాగాలాండ్ లో బ్యాంకులు మూతపడనున్నాయి.
⦿ డిసెంబర్ 30 (సోమవారం)
యు కియాంగ్ నంగ్బా సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూసివేయబడతాయి.
⦿ డిసెంబర్ 31 (మంగళవారం)
మిజోరాం, సిక్కింలో నూతన సంవత్సర పండుగ/లాసాంగ్/నామ్‌సూంగ్ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
Read Also: ముద్ర లోన్స్ పొందటం ఎలా? అర్హతలు ఏమిటీ? ఎన్ని లక్షల వరకు రుణం పొందవచ్చు?
యథావిధిగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు
ఈ నెల వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో కస్టమర్లు ముందుగానే బ్యాంకు వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ATMలతో సహా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు సెలవు రోజుల్లోనూ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ తో పాటు ఆన్ లైన్ బ్యాంకింగ్ ప్లాట్ ఫారమ్‌లు, మొబైల్ యాప్ ల ద్వారా డిజిటల్ చెల్లింపు చేసుకోవచ్చన్నారు. అవసరం అనుకున్న వాళ్లు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా ఈ నెల 17 రోజుల పాటు బ్యాంకులకు హాలీడేస్ క్లోజ్ కానున్నాయి. అటు వరుస సెలవులతో బ్యాంకు ఉద్యోగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసేందుకు టూర్లు ప్లాన్ చేస్తున్నారు. కొంత మంది మిత్రులతో కలిసి టూర్లకు వెళ్లాలి అనుకుంటే, మరికొంత మంది మంది ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలని భావిస్తున్నారు.
Read Also: రియలన్స్-డిస్నీ విలీనం.. జస్ట్ రూ.15కే అదిరిపోయే ప్లాన్