BigTV English

Bigg Boss 8 Telugu Promo: రూల్స్‌ను పాటించని కంటెస్టెంట్స్.. నిఖిల్, పృథ్విలపై ప్రేరణ నిందలు

Bigg Boss 8 Telugu Promo: రూల్స్‌ను పాటించని కంటెస్టెంట్స్.. నిఖిల్, పృథ్విలపై ప్రేరణ నిందలు

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి. అందుకే ప్రతీ సీజన్‌లో లాగానే ఈ సీజన్‌లో కూడా ఒక కంటెస్టెంట్ నేరుగా ఫైనల్స్‌లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంటాడు. దానికోసమే టికెట్ టు ఫినాలే రేసు జరుగుతుంది. ఇక బిగ్ బాస్ 8లో ఈ టికెట్ టు ఫినాలే రేసు కాస్త భిన్నంగా జరగనుంది. హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్‌తో మెగా చీఫ్ కంటెండర్ పోటీ జరపనున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ అయిన వితికా షేరు, పునర్నవి హౌస్‌లోకి అడుగుపెట్టారు. కంటెస్టెంట్స్‌తో టికెట్ టు ఫినాలే కంటెండర్‌షిప్ పోటీని ప్రారంభించారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


జారుతూ గెలవాలి

‘‘టికెట్ టు ఫినాలే రేసులో మీ ఫిజికల్ బలన్నా టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ ఇస్తున్న ఛాలెంజ్ జారుతూ గెలువు. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి మీరు చేయాల్సింది స్లైడ్ పైకి తాడు సహాయంతో వెళ్లి దానిపైన ఉన్న డిస్కులను తీసుకొని మీకు చెందిన బాస్కెట్‌లో వేయాలి’’ అంటూ బిగ్ బాస్ టాస్క్ గురించి వివరించడంతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. ఇక టికెట్ టు ఫినాలేలో చివరి కంటెండర్‌గా ఎంపిక అవ్వడం కోసం నిఖిల్, పృథ్వి, ప్రేరణ, గౌతమ్ పోటీపడ్డారు. ముందుగా స్లైడ్‌లోకి వెళ్లే ముందు అందరూ తమ కాళ్లను నీటితో తడుపుకోవాలి. దాని వల్ల స్లైడ్ పైకి వెళ్లడం మరీ కష్టమవుతుంది. అయితే ఈ టాస్క్‌లో కొందరు రూల్స్ పాటించలేదని సంచాలకులు అయిన వితికా, పునర్నవిలకు డౌట్ వచ్చింది.


Also Read: ఎట్టకేలకు బాయ్‌ఫ్రెండ్ గురించి బయటపెట్టిన విష్ణుప్రియా.. అసలు బ్రేకప్ ఎందుకు అయ్యిందంటే?

కాళ్లు తడపలేదు

టాస్క్ మొదలవ్వగానే నిఖిల్, పృథ్వి, ప్రేరణ, గౌతమ్ పోటాపోటీగా స్లైడ్ ఎక్కడం మొదలుపెట్టారు. చాలామంది దానిపై జారిపడ్డారు కూడా. ఇక టాస్క్ అయిపోగానే అందరూ తమ కాళ్లు తడుపుకున్నారా లేదా అని పునర్నవికి డౌట్ వచ్చింది. అదే విషయాన్ని వితికాను అడిగింది. ‘‘ప్రతీసారి అందరూ కాళ్లు తడుపుకొని వెళ్లలేదు అని ప్రేరణ చెప్తుంది’’ అంటూ పృథ్వితో అన్నాడు నబీల్. అదే విషయాన్ని అవినాష్‌తో కూడా చెప్పింది ప్రేరణ. ‘‘నేను వచ్చేటప్పుడే చూశాను. ఎవరు చేశారో తెలియదు కానీ ఒక కాలిని నీటిలో పెట్టలేదు. పక్కన నుండి వెళ్లిపోయారు’’ అంటూ అందరితో డిస్కషన్ మొదలుపెట్టింది ప్రేరణ.

వ్యతిరేకంగా మాట్లాడకు

ఆ తర్వాత సంచాలకులుగా పునర్నవి, వితికా తమ నిర్ణయాన్ని చెప్పే సమయం వచ్చింది. ‘‘బిగ్ బాస్.. అందరూ రూల్స్ పాటించారు కానీ..’’ అంటూ ఏదో చెప్పబోయింది పునర్నవి. ప్రేరణ మాత్రం టాస్కులో తనకు ఉన్న అనుమానాల గురించి అవినాష్‌తో చర్చిస్తూనే ఉంది. ‘‘నిఖిల్ తన చివరి డిస్క్ తీసుకోలేదు. నా లాస్ట్ డిస్క్‌ను పృథ్వి తీసుకున్నాడు’’ అని ప్రేరణ చెప్తుండగానే.. ‘‘నేను ఎవ్వరినీ చూడలేదు’’ అని అవినాష్ తేల్చేశాడు. ‘‘నువ్వు ప్రతీసారి చూడలేదు అంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంది’’ అని సీరియస్ అయ్యింది ప్రేరణ. ఇక ఈ టాస్క్‌లో ఎవరి ర్యాంక్ ఎంత అని వితికా, పునర్నవి చెప్పే సమయానికి ప్రోమో ముగిసింది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×