BigTV English

Ather Rizta : ఏథర్ రిజ్టా వచ్చేసింది.. ఇది పక్కా ఫ్యామిలీ స్కూటర్!

Ather Rizta : ఏథర్ రిజ్టా వచ్చేసింది.. ఇది పక్కా ఫ్యామిలీ స్కూటర్!
Ather Rizta
Ather Rizta

Ather Rizta : ఏథర్ ఎనర్జీ భారత మార్కెట్లోకి ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేసింది. ఏథర్ ఎనర్జీ నుంచి 450 సిరీస్ తరువాత వచ్చిన రెండో స్కూటర్ ఇది. ఈ స్కూటర్‌ను ఫ్యామిలీ స్కూటర్‌గా మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. మొదటగా బెంగళూరు అటోమొబైల్ మార్కెట్‌లో వీటిని విక్రయించనున్నారు. ఈ స్కూటర్ ఎక్స్‌ షోరూమ్ ధర రూ. 1.10 లక్షలుగా ఉంది. రూ.999 చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. జులైలో దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.


బ్యాటరీ ప్యాక్

కొత్త ఏథర్ రిజ్టా 450 ఇ-స్కూటర్ కొత్త ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడింది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లాంచ్ చేశారు.దీని 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌లో 105 కిమీ రేంజ్ ఇస్తుంది. 3.7 kWh బ్యాటరీ ప్యాక్ 125 కిమీ పరిధి ఇస్తుంది. స్కూటర్ 3.7 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. ఈ స్కూటర్ IP67 రేటింగ్‌ను కూడా పొందింది. Rizta S స్కూటర్ 3 మోనోటోన్ రంగులలో వస్తుంది. రిజ్టా Z 7 రంగులలో లభిస్తుంది. ఇందులో 3 మోనోటోన్,4 డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయి.


Also Read : చీప్ గురూ.. రూ. 37,000 కే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!

ఫీచర్లు

ఈ స్కూటర్‌లో అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అ450Xలో ఉన్న అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఇతర స్కూటర్ల కంటే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. Ather పార్క్ అసిస్ట్, ఆటో హిల్ హోల్డ్ వంటి 450X నుండి రిజ్టా వరకు ఫీచర్లను కలిగి ఉంది. స్మార్ట్ ఎకో,జిప్ మోడ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

డిజైన్‌

రిజ్టా ఫ్యామిలీ కస్టమర్ల అభిరుచికి ప్రాధాన్యత ఇస్తూ డిజైన్ చేశారు. ఇందులో ఎక్కువ మంది ప్రయాణించవచ్చు. దీని ఫీచర్లు, డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.మృదువైన లైన్‌లు, గుండ్రని ప్యానెల్‌లు, మోనో-LED హెడ్‌ల్యాంప్‌, సొగసైన LED టైల్‌లైట్, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.

Also Read : ఈ నెలలో లాంచ్ కానున్న సూపర్ బైక్స్..!

స్పెసిఫికేషన్స్‌

రిజ్టా స్కూటర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు ఉన్నాయి. వెనుకవైపు సింగిల్ షాక్ అబ్జార్బర్‌ను కలిగి ఉంది. దీని ద్వారా రైడర్లు మంచి స్మూత్ రైడింగ్‌ ఫీల్ అవుతారు. ఫ్రంట్‌లో డిస్క్ బ్రేక్, రియల్ డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంది.

Tags

Related News

Gold Rate: అమ్మ బాబోయ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ పండగ సేల్ ప్రారంభం.. భారీ ఆఫర్ల వర్షం

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

Big Stories

×