Airtel Prepaid Recharge Plans Under Rs 300: ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఇటీవల తమ మంత్లీ, ఇయర్లీ రీఛార్జ్ ప్లాన్ ధరలను అధికంగా పెంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెలికాం సంస్థల యూజర్లకు గట్టి షాక్ తగిలినట్లయింది. దీంతో ఒక నెల రీఛార్జ్ చేసుకుందాం అంటే ఏకంగా పెద్ద అమౌంటే పే చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుుడు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. మీరు కూడా ఎయిర్‌టెల్ యూజర్ అయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. కంపెనీ 4 సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇవి తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలతో వస్తాయి. మీరు కూడా ఈ Airtel చౌకైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
Airtel రూ.199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
Airtel Rs.199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ యూజర్లు డేటా, వాయిస్ కాల్‌లు, ఫ్రీ SMS ప్రయోజనం పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. దీని కింద కంపెనీ తన వినియోగదారులకు 2GB డేటా, రోజువారీ 100 SMS, అపరిమిత కాలింగ్‌లను అందిస్తుంది. దీనితో పాటు ప్రీ-హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
Airtel రూ.219 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
Also Read: భారీ పోటీ.. తక్కువ ప్రైస్‌లో ఎక్కువ వాలిడిటీ అందించే రీఛార్జ్ ప్లాన్లు!
Airtel రూ.219 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల వ్యాలిడిటీని అందుకుంటారు. ఇందులో యూజర్‌కు 3జీబీ డేటా లభిస్తుంది. దీనితో పాటు అపరిమిత కాలింగ్, 300 SMS, ప్రీ-హలో ట్యూన్స్, Wynk మ్యూజిక్ ఆఫర్ ఇందులో ఉన్నాయి.
Airtel రూ.249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
Airtel రూ.249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 24 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో, మీరు రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను పొందుతారు. దీనితో పాటు ఈ ప్లాన్‌లో ప్రీ హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ అందించబడుతున్నాయి.
Airtel రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
Airtel రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఇది రోజుకు 1.5 GB డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలను అందిస్తుంది. దీనితో పాటు ప్రీ హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఆఫర్ కూడా ఈ ప్లాన్‌లో ఇవ్వబడ్డాయి. దీంతో మీరు కేవలం రూ.300 లోపు బెస్ట్ రీఛార్జ్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.