Bigtv Effect: సొంతూర్లలో పనులు చేస్తే వచ్చే అరకొర కూలీ డబ్బులు కుటుంబ పోషణకు సరిపోక.. గల్ఫ్ దేశాలకు ఒప్పందంపై పనులకు వెళ్లి.. అక్కడ వెట్టిచాకిరి చేస్తూ.. ఇటు సొంతూరికి రాలేక, అక్కడ ఉండలేక చాలా మంది భారతీయులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి.. తిండికి, ఉండటానికి సరైన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు.
అలా పనికోసం దుబాయ్ కు వెళ్లిన జ్యోతి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. నాలుగు నెలల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం శివారు వీధివారి లంక గ్రామానికి చెందిన జ్యోతి.. అబుదాబికి వెళ్లింది. అయితే.. అక్కడ తనతో పని ఎక్కువగా చేయించుకుంటున్నారని, సరైన వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఓ సెల్ఫీ వీడియో చేసింది. ఎలాగైనా తనను తిరిగి స్వగ్రామానికి చేర్చాలని వేడుకుంటూ చేసిన వీడియో.. బిగ్ టీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read: రసవత్తరంగా విశాఖ రాజకీయం.. డైలమాలో వైసీపీ ?
తమకున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక ఏజెన్సీ ద్వారా అబుదాబికి వచ్చానని, అక్కడున్న బ్రోకర్ ఓ ఇంట్లో పెట్టాడని తెలిపింది. తనతో వెట్టిచాకిరి చేయించుకుని సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదని వాపోయింది. జీతం కూడా ఇవ్వట్లేదని, ఇంటికి ఫోన్ కూడా చేసుకోనివ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ్యం బాలేదని చెప్పినా.. వైద్యం చేయించకపోగా ట్యాబ్లెట్లు కూడా ఇవ్వడం లేదని సెల్ఫీ వీడియోలో పేర్కొంది. ఎలాగైనా అధికారులు తనను ఆ నరకం నుంచి తప్పించి.. ఇంటికి చేర్చాలని వేడుకుంది.
ఈ వీడియోపై మంత్రి నారా లోకేశ్ ఆగస్టు 5న స్పందించారు. ఆమెను జాగ్రత్తగా స్వదేశానికి తీసుకొస్తామని X వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిన బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలిపారు.
చెప్పిన మాటను మంత్రి నారా లోకేశ్ నిలబెట్టుకున్నారు. అబుదాబిలో తీవ్ర నరకయాతన చూస్తూ ఉన్న జ్యోతిని స్వదేశానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం జ్యోతి అబుదాబి నుంచి సేఫ్ గా హైదరాబాద్ కు చేరుకుంది. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులు నారా లోకేశ్ కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
బిగ్ టీవీ ఎఫెక్ట్
స్వదేశానికి చేరుకున్న జ్యోతి…
అబుదాబిలో ఇబ్బందులు పడుతూ తనను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్న కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామానికి చెందిన వివాహిత జ్యోతి.
జ్యోతి సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి బిగ్ టీవీ… pic.twitter.com/cNEh2plEiq
— BIG TV Breaking News (@bigtvtelugu) August 9, 2024