RBI New Governor Ajay Malhotra: రిజర్వ్ బ్యాంక్ ఆఫర్ ఇండియా (RBI) నూతన గవర్నర్ గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. శక్తికాంత్ దాస్ వారసుడిగా మల్హోత్రాను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం నాడు 26వ ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్న ఆయన, మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఇంతకీ సంజయ్ మల్హోత్రా ఎవరు?
మల్హోత్రా ప్రస్తుతం కేంద్రంలో రెవెన్యూ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మల్హోత్రా రాజస్థాన్ కేడర్ కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. కాన్పూర్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆయన కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నారు. అటు అమెరికాకు చెందిన ప్రిన్స్ టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు. 33 ఏళ్ల కెరీర్ లో, మల్హోత్రా పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాలలో కీలక బాధ్యతలు పోషించారు. రెవెన్యూ కార్యదర్శిగా నియమించబడక ముందు ఆర్థిక సేవల శాఖలో కార్యదర్శిగా పని చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేనా?
సంజయ్ మల్హోత్రాకు ఆర్థిక రంగంలో అపార అనుభవం ఉంది. ఆయనకు రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పన్నుల విషయంలో విస్తృత అనుభవం ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కోసం పన్ను విధాన రూపకల్పనలో మల్హోత్రా కీలక పాత్ర పోషించారు.
దేశ ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషించిన శక్తికాంత్ దాస్
ఇక ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఉర్జిత్ పటేల్ తర్వాత డిసెంబర్ 11, 2018న ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులయ్యారు. అంతకు ముందుకు శక్తికాంత్ దాస్ G20కి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా, ఇండియా షెర్పాగా పని చేశారు. అంతేకాదు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), G20, BRICS లాంటి పలు అంతర్జాతీయ ఫోరమ్ లలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. శక్తికాంత దాస్ 1980లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో చేరారు. తమిళనాడు కేడర్ కు కేటాయించబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల కమిషనర్ గా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లి ఆర్థిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా జాయిన్ అయ్యారు. పెద్ద నోట్ల రద్దు, GST లాంటి ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి ఆర్బీఐ గవర్నర్ గా ఆయన పదవీ పొడగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండటం లేదు. రీసెంట్ గానే ఆయన గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మల్హోత్రాను ఆర్బీఐ గవర్నర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: వెంటనే మీ ఆధార్ అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే ఏం అవుతుందో తెలుసా?