Kissik Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప 2…ఈ మూవీ ఇటీవలే థియేటర్లలోకి వచ్చేసింది. వచ్చిన నాలుగు రోజులకే 900 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చెయ్యడం మామూలు విషయం కాదు. థియేటర్లలో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోవడమే కాదు కాసుల వర్షం కురిపిస్తుంది.. ఈ మూవీ స్టోరీ బాగుంది.. అంతకన్నా ఈ మూవీలోని పాటలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. అందులో శ్రీలీలా డ్యాన్స్ తో అదరగొట్టిన ఐటమ్ సాంగ్ కిస్సిక్ పాట మామూలు క్రేజ్ అందుకోలేదు. వయసు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ పాటకు తెగ రీల్స్ చేస్తున్నారు. తాజాగా బామ్మల గ్యాంగ్ దెబ్బలు పడతాయిరో అంటూ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
పుష్ప 2 మూవీ ప్రస్తుతం రికార్డులను బ్రేక్ చేసేలా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. అయితే ఈ మూవీలోని ప్రతి పాట బాగా ట్రెండ్ అవుతుంది. అందులో శ్రీలీల వేసిన ఐటమ్ సాంగ్ కిస్సిక్ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా కొందరు బామ్మలు ఈ పాటకు స్టెప్పులు వెయ్యడం గమనార్హం.. ఈ బామ్మలు అందరు ఏదో అనాథశ్రమంలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరంత కలిసి ఇటీవల విడుదలైన పుష్ప2 మూవీలోని కిస్సిక్ పాటకు దెబ్బలు పడతాయ్ రో పాటకు మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టారు.. ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.. వీరి టాలెంట్ ముందు హీరోయిన్ కూడా దిగదుడుపే అన్నట్లు కామెంట్స్ చెయ్యడం మాత్రమే కాదు వీడియోను షేర్ చేస్తున్నారు.
ఇక పుష్ప 2 కలెక్షన్స్ విషయానికొస్తే.. బాక్సాఫీస్ వద్ద కూడా అంతకు మించి వీరంగం ఆడుతున్నాడు. కేవలం 4 రోజుల్లో 829 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కొల్లగొట్టి విధ్వంసం స్పెల్లింగ్ రాయిస్తున్నాడు. నార్త్ నుంచి సౌత్ దాకా ప్రతిచోటా తేడా లేకుండా థియేటర్లను జనాలతో నింపేస్తున్న పుష్ప 2 ఇప్పట్లో తగ్గేలాలేదు.. రెండో వారంలో కల్కి కలెక్షన్స్ దాటేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఫాంటసీ కంటెంట్ లేని ఒక మాస్ కమర్షియల్ సినిమా ఈ స్థాయిలో ఊచకోత చేయడం చూస్తే హీరో కరెక్ట్ గా సెట్ అయ్యాడు,కథ, దర్శకుడు, సాంకేతిక బృందం చేతులు కలిపితే భాషతో సంబంధం లేకుండా అందరినీ మెప్పించవచ్చని పుష్ప 2 ది రూల్ నిరూపించింది. బాక్సాఫీస్ ను కలెక్షన్స్ తో షేక్ చెయ్యడంలో తగ్గేదేలే అంటుంది.. తగ్గేదేలే అంటూ ఊతపదంగా పెట్టుకున్న అల్లు అర్జున్ నిజంగా తగ్గడం ఇష్టమే లేదన్న రీతిలో తుఫానులా విరుచుకుపడటం సరికొత్త హిస్టరినీ క్రియేట్ చేస్తుంది.. ఇక ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ నెక్స్ట్ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చెయ్యనున్నారని తెలిసిందే..
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">