BigTV English

Aadhaar card update for free: వెంటనే మీ ఆధార్ అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే ఏం అవుతుందో తెలుసా?

Aadhaar card update for free: వెంటనే మీ ఆధార్ అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే ఏం అవుతుందో తెలుసా?

Aadhaar Card Update For Free: దేశ పౌరులకు తప్పకుండా ఉండాల్సిన ముఖ్యమైన కార్డులలో ఆధార్ ఒకటి. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలతో పాటు బ్యాంకింగ్ అవసరాలకు ఆధార్ తప్పని సరి చేశారు. అయితే, ఆధార్ కార్డు గత 10 సంవత్సరాలుగా అప్ డేట్ చేసుకోని వాళ్లు ఉంటే.. వెంటనే చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నెల 14 వరకు ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. పేరు, అడ్రస్, చిరునామా, పుట్టిన తేదీని అప్ డేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆన్ లైన్ లోనూ మీ ఆధార్ ను అప్ డేట్ చేసుకోవచ్చు.


ఆన్ లైన్ లో ఆధార్ ఎలా అప్ డేట్ చేసుకోవాలంటే?

⦿ ముందుగా UIDAI వెబ్‌ సైట్‌ ను ఓపెన్ చేయాలి.


⦿‘మై ఆధార్’ మీద క్లిక్ చేయాలి.

⦿ ఆ తర్వాత ‘అప్ డేట్ యువర్ ఆధార్’ మీద ట్యాప్ చేయాలి.

⦿అప్ డేట్ సెక్షన్ ను యాక్సెస్ చేయాలి.

⦿ అప్ డేట్ ఆధార్ డీటైల్స్ పేజీలో ‘డాక్యుమెంట్ అప్ డేట్’ మీ క్లిక్ చేయాలి.

⦿ ఆ తర్వాత ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి.

⦿ మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ‘OTP సెండ్’ మీద క్లిక్ చేయాలి.

⦿ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.

⦿ ఆ తర్వాత మీరు అప్‌ డేట్ చేయాలనుకుంటున్న వివరాలు అంటే పేరు, చిరునామా, పుట్టిన తేదీని సెలెక్ట్ చేసుకోవాలి.

⦿ అవసరం అయిన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.

⦿ మీ వివరాలను అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేసిన తర్వాత సబ్ మిట్ చేయాలి.

⦿ మీ ఆధార్ అప్ డేట్ కోసం రిక్వెస్ట్ పంపించబడుతుంది. మీ ఆధార్ అప్ డేట్ వివరాలను ఎస్సెమ్మెస్ ద్వారా అందుకునే అవకాశం ఉంటుంది.

ఆధార్ అప్ డేట్ విషయంలో ఈ విషయాలు మర్చిపోకండి!

⦿ బయోమెట్రిక్ అప్‌డేట్స్: బయోమెట్రిక్ వివరాలు అంటే ఐరిష్, ఫింగర్ ప్రింట్, ఫోటో మార్పుల కోసం ఆధార్ కేంద్రానికి తప్పకుండా వెళ్లాలి.

⦿ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అప్‌డేట్స్: మీ బర్త్ డే లేదంటే జెండర్ కు సంబంధించిన అప్ డేట్స్ ఒకేసారి చేయబడుతాయి.

⦿ ఆఫ్ లైన్ ద్వారా ఆధార్ అప్ డేట్ చేసుకోవాలనుకునే వారు UIDAI వెబ్‌సైట్ నుండి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

⦿ దాన్ని నింపి అసరం అయిన డాక్యుమెంట్స్ ను యాడ్ చేసి ఆధార్ సెంటర్ కు వెళ్లాలి.

⦿ ఉచితంగా ఆధార్ ను అప్ డేట్ చేయించుకోవచ్చు.

Read Also: కొత్త పాన్ కార్డ్ వచ్చేస్తోంది.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఆధార్ అప్ డేట్ ఎందుకు?  

గత 10 సంవత్సరాలలో మీ ఆధార్ అప్‌ డేట్ కానట్లయితే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని UIDAI సూచిస్తున్నది. తాజాగా అడ్రస్ సహా ఇతర వివరాలను సమర్పించాలని కోరుతున్నది. మీ వివరాలు అప్ డేట్ గా ఉండటం వల్ల ఆధార్ సంబంధిత అన్ని సేవలను ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందే అవకాశం ఉంటుందని వెల్లడించింది. డిసెంబర్ 14, 2024లోగా ఎలాంటి ఫీజు లేకుండా ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నది.14 తర్వాత డబ్బులు చెల్లించి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.

Read Also: నామినీల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. కొత్తగా అమల్లోకి వచ్చిన బ్యాంకింగ్ రూల్స్ ఇవే!

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×