BigTV English

Nara Rohith: ఇంకో సుందరకాండ.. ఈసారి నారా వారబ్బాయితో

Nara Rohith: ఇంకో సుందరకాండ.. ఈసారి నారా వారబ్బాయితో

Nara Rohith:నారా వారబ్బాయి నారో రోహిత్ కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. మంచి కథలను ఎంచుకున్నా రోహిత్ కు మాత్రం హిట్ దక్కలేదు. ఇక ఈ మధ్యనే ప్రతిధ్వని 2 తో రీఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా నారా రోహిత్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సుందరకాండ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ టైటిల్ తో వెంకటేష్ సినిమా వచ్చింది. దీని తరువాత ఛార్మీ సుందరకాండ టైటిల్ తో ఒక సినిమా వచ్చింది. ఇందులో వెంకీ మామ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఇదే టైటిల్ తో నారా రోహిత్ వస్తున్నాడు. ఇందుకు సంబంధించిన టైటిల్ టీజర్ ఆకట్టుకొంటుంది.


 

” ప్రేమ.. ఇది అందరి లైఫ్ లో కామన్ గా జరిగేదే.. అమ్మ అన్నం పెట్టినా, ఫ్రెండ్ బూతులు తిట్టినా.. ఒక్క అమ్మాయిని చూసిన వెంటనే నచ్చినా, అదే అమ్మాయి బ్రేకప్ చెప్పినప్పుడు ఏడ్చినా.. అన్నిట్లో ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ కథ కచ్చితంగా ఉంటుంది. కొన్ని మణిరత్నం గీతాంజలిలా సాడ్ ఎండింగ్ అవ్వవచ్చు. మురారిలో మహేష్ బాబులా ఫేట్ తో ఫైట్ చేయొచ్చు.. గౌతమ్ మీనన్ ఏ మాయ చేశావేలా ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు.. బొమ్మరిల్లులో సిద్ధులా డెసిషన్ పేరెంట్స్ చేతిలో పెట్టొచ్చు.. ఖుషిలో పవన్ కళ్యాణ్ లా మనస్పర్థలు రావచ్చు.. ఆర్యలో అల్లు అర్జున్ లా వన్ సైడ్ లవ్ అవ్వొచ్చు. ఇలా ఎన్ని ప్రేమకథలు ఉన్నా.. ఏ రెండు ప్రేమ కథలు ఒకలా ఉండవు. ఏ ఇద్దరు ఒకేలా ప్రేమించరు.. అందుకే మనకు ఇన్ని ప్రేమ కథలు.. ప్రతి కథలో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అలాంటి మ్యాజిక్ నా లైఫ్ లో కూడా జరిగింది.. నా పేరు సిద్దార్థ్.. ఇది నా కథ” అంటూ నారా రోహిత్ తన కథను చెప్పుకుంటూ కనిపించాడు.

స్టూడెంట్ లా ఒకచేతిలో బుక్.. మరో చేతిలో పూల కుండీ పట్టుకొని కూల్ లుక్ లో అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో నారా రోహిత్ సరసన వ్రితి వాఘని నటిస్తోంది. సెప్టెంబర్ 6 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో నారా వారబ్బాయి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×