ఆదాయ పన్ను చట్టం ప్రకారం కుటుంబ సభ్యుల నుంచి తీసుకునే కానుకల పైన టాక్స్ ఉంటుందా లేదా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. నిజానికి కుటుంబ సభ్యుల నుంచి కానుకల రూపంలో తీసుకున్న డబ్బుపై పన్ను చెల్లించాలా వద్దా అనే విషయంపై ఆదాయపన్ను శాఖ చట్టం ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా పెళ్లిళ్లు, పుట్టినరోజులు, అలాగే ఇతర సందర్భాల్లో హిందూ అవిభాజ్య కుటుంబం నుంచి కానుకలు తీసుకున్నట్లయితే, కొన్ని ప్రత్యేకమైన ఆదాయపన్ను చట్టం నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా అసలు హిందూ అవిభాజ్య కుటుంబంలో (HUF) ఎవరి నుంచి కానుకలు తీసుకున్నట్లయితే పను చెల్లించాల్సిన అవసరం లేదు ముందుగా తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 56(2)(x) ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 అంత కంటే ఎక్కువ విలువైన కానుకలు పొందినట్లయితే దానిపై స్లాబ్ రేట్ ప్రకారం పన్ను చెల్లించాలి. కానీ హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) నుంచి కానుకలు పొందితే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా భర్త లేదా భార్య, సోదరడు లేక సోదరి, భర్త లేదా భార్యకు చెందిన సోదరుడు లేదా సోదరి., తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, భర్త లేదా భార్య తల్లిదండ్రులు, సంతానం, అలాగే పైన పేర్కొన్న బంధువులందరి జీవిత భాగస్వాములు నుంచి డబ్బు రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ కానుకలు స్వీకరించినట్లయితే పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఒక తండ్రి నుంచి కుమారుడికి 20 లక్షల రూపాయల బహుమతి గనుక అందజేసినట్లయితే దానిపై ఎలాంటి పనులు కట్టాల్సిన అవసరం లేదు. కుమారుడి భార్యకు కూడా ఆమె వివాహం సందర్భంగా మామగారి హోదాలో కానుకలు ఇచ్చినట్లయితే దానిపై కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
HUF (హిందూ అవిభక్త కుటుంబం) ప్రకారం తండ్రిని కర్త అని పిలుస్తారు. అతని సంతానము వారి జీవిత భాగస్వాములు, వారి పిల్లలు ఈ కుటుంబంలోని సభ్యులుగా మారుతారు.
హిందూ అవిభాజ్య కుటుంబంలో కుటుంబ సభ్యులను బంధువులుగా పరిగణిస్తారు. కనుక ఒక సభ్యుడు నుంచి మరొక సభ్యుడికి బహుమతుల రూపంలో కానుకలు ఇచ్చినట్లయితే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీకు గిఫ్ట్ రూపంలో లభించిన డబ్బును పెట్టుబడిగా పెట్టినట్లయితే దానిపై వచ్చే లాభానికి మాత్రం మీకు ఎవరైతే కానుక రూపంలో డబ్బు చెల్లించారో వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే టాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మీ కుటుంబ సభ్యుల నుంచి బహుమతుల రూపంలో మీరు నగదు కనుక అందుకున్నట్లయితే దానిని పన్ను రిటర్న్ ఫైలింగ్ లో చూపించాల్సి ఉంటుంది. లేకపోతే రెండు వందల శాతం పైగా జరిమానా సైతం విధించవచ్చు. అందుకే టాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు అన్ని రకాలుగా సరైన వివరాలను నమోదు చేయడం మంచిది. అయితే ప్రస్తుతం కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకోవడం ద్వారా కాస్త వెసులుబాటు లభిస్తుంది అని చెప్పవచ్చు.